Bigg Boss Telugu 7: బిగ్‌బాస్ ఇంట్లోకి చివరగా రతికా తండ్రి... కారణం ఏంటో తెలుసా?
Rathika Father in BB House: బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 షో ఉల్టాపుల్టాగా సాగుతున్న విషయం అందరికీ తెలిసిందే. ఈషోపై అందరికీ రోజుకురోజుకూ ఆసక్తి పెరుగుతూ వస్తోంది. ముఖ్యంగా మరికొద్ది వారాల్లో ఎవరు గెలుస్తారో తెలియడం.. గేమ్ షో చివరకు రావడంతో రోజురోజుకూ ఆసక్తి పెరిగిపోతుంది. పదో వారంలో భాగంగా బిగ్ బాస్ ఫ్యామిలీ వీక్ నిర్వహిస్తున్నారు. ఈక్రమంలోనే ఇప్పటి వరకు దాదాపుగా అందరి కుటుంబ సభ్యులు వచ్చారు. ఈరోజు అంటే చివరగా.. రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ తండ్రితో పాటు రతికా రోజ్ తండ్రి ఈరోజుటి ఎపిసోడ్ లో రాబోతున్నారు. ఈరోజు ఉదయం విడుదల అయిన ప్రోమోలో పల్లవి ప్రశాంత్ తండ్రి ఇంట్లోకి వచ్చినట్లు చూపించారు.
ఇక తాజాగా విడుదల అయిన రెండో ప్రోమోలో.. రతికా రోజ్ తండ్రి ఇంట్లోకి ఎంట్రీ ఇచ్చారు. మెయిన్ గేట్ ద్వారా రతికా తండ్రి రాగా.. ఆమె పరిగెట్టుకుంటూ వచ్చి తండ్రిని కౌగిలించుకుంది. గట్టిగా ఏడ్చేసింది. తండ్రి కూడా కూతురును ఊరుకోబెడుతూనే ఏడ్చేశాడు. ఈక్రమంలోనే రతిక తన తండ్రిని అందరికీ పరిచయం చేసింది. ఇక ఆ తర్వాత కిచెన్ దగ్గరకు వెళ్లిన వీళ్లకు భోలె షవాళి అన్నం తినిపించాడు. రతికా తండ్రి కూతురుకు గోరు ముద్దులు పెట్టాడు. దీంతో రతికా ఫుల్ ఖుషీ అయిపోయింది.

పర్సనల్ గా కూర్చొని తండ్రీకూతుర్లు మాట్లాడుకోగా.. గేమ్ ఇంకా బాగా ఆడు అని తండ్రి చెప్పాడు. బానే ఆడుతున్నానా.. అంటూ ఆమె అడగ్గా ఆ బాగుంది, నువ్వు కూడా బాగా కనిపిస్తున్నావని చెప్పాడు. ఇక ఆ తర్వాత స్టోర్ రూంలో రతికాకు ఓ గిఫ్టు వచ్చినట్లు చూపించారు. ఆ ఫొటో ఫ్రేమ్ తీసుకెళ్లి అమర్ దీప్ రతికాకు ఇవవ్గా.. తండ్రితో పాటు దాన్ని ఓపెన్ చేసింది. అందులో తన అమ్మ, అక్క, చెల్లి, వాళ్ల పిల్లలతో కలిసి దిగిన ఫొటో ఉండగా.. రతికా చాలా హ్యాపీగా ఫీల్ అయింది. ఆమె తండ్రి కూడా సంతోషంగా ఆ ఫొటోను చూసుకుని మురిసిపోయారు.
బయటకు వచ్చిన తర్వాత గౌతమ్ కృష్ణను చూసిన రతికా తండ్రి.. డాక్టరా నువ్వు అని అడిగాడు. అవునని చెప్పగా.. డాక్టర్ అంటే ఎట్లుండాలే.. మనిషిని చూడగానే గుర్తు పట్టాలని చెప్పాడు. దీనికి డాక్టర్ బాబు ఫుల్లుగా నవ్వాడు. ఇక ఆ తర్వాత రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ వచ్చి రతికా తండ్రికి రెండు చేతులు జోడించి మరీ నమస్కారం పెట్టాడు. నమస్కారం సార్ అనగానే.. బాగున్నావా, మంచిగా ఆడుతున్నవ్ అంటూ ఆయన చెప్పగా రైతుబిడ్డ నవ్వాడు. మంచిగా ఆడు అంటూ సూచించాడు.
ఈ సందర్భంగానే రతికా తండ్రి.. గేమ్ అన్నప్పుడు కొట్లాడలే, కప్పు తెచ్చుకోవాలే అని చెప్పాడు. హౌస్ మేట్స్ అందరితో ఆయన మాట్లాడుతుండగానే.. రతికా వచ్చి తండ్రి చెంపపై ముద్దు పెట్టింది. ఇది చూసేందుకు చాలా బాగా అనిపిస్తోంది. ఇంతోలనే బిగ్ బాస్.. రాములు ఇక మీరు ఇంటిని విడిచి వెల్లిపోవాల్సిన సమయం దగ్గరపడిందని చెప్పారు. వెంటనే ఆయన ఇదంతా అయిపోగానే అంతా మా ఇంటికి రండి ఫుల్లుగా దావత్ ఇస్తానని చెప్పారు. ఆ తర్వాత డీజే టిల్లు పాటకు ఫుల్లుగా స్టెప్పులు వేశారు.
అయితే అందరికంటే చివరగానే రతికా రోజ్ తండ్రిని ఇంట్లోకి పంపేందుకు ఓ కారణం ఉంది. రతికా ఫస్ట్ వీక్ లోనే ఇంట్లోకి ఎంటర్ అయినప్పటికీ నాలుగో వారంలో ఎలిమినేట్ అవ్వడం.. ఆ తర్వాత రెండు వారాలకే మళ్లీ ఇంట్లోకి అడుగు పెట్టడం జరిగింది. అయితే ఇప్పటికే కుటుంబాన్ని కలిసి, షో చూసి వచ్చిన ఈమెకు గ్యాప్ ఎక్కువ రాకపోవడంతో కాస్త ఆలస్యంగా అయినా సరే ఫ్యామిలీ మెంబర్స్ ను చూపిస్తే పర్లేదు అనుకున్నారట. అలాగే ఎమోషన్స్ ఎక్కువగా పండే అవకాశం లేదని భావించి ఇలా చివరగా పంపించారట. ఏది ఏమైతేనేం.. బిగ్ బాస్ ప్లాన్ మామూలుగా లేదుగా.


Click it and Unblock the Notifications











