Bigg Boss 7 Telugu: బిగ్ బాస్‌లో మొదలైన ప్రేమ.. ఏకంగా పెళ్లి గురించి కూడా.. హాట్ టాపిక్‌గా కొత్త జంట

బిగ్ బ్రదర్ అనే ఇంగ్లీష్ షో ఆధారంగా వచ్చిన కార్యక్రమమే బిగ్ బాస్. హిందీలో ఇది సూపర్ హిట్ అవడంతో దేశంలోని చాలా భాషల్లోనూ ఈ షోను తీసుకు వచ్చారు. అలా ఏడేళ్ల క్రితమే తెలుగులోకి కూడా ఇది పరిచయమైంది. ఎన్నో అనుమానాల మధ్య వచ్చిన ఈ షో.. ప్రేక్షకుల నుంచి ఊహించని విధంగా భారీ స్పందనను అందుకుంది. ఫలితంగా ఎన్నో సీజన్లను రికార్డు స్థాయి రేటింగ్‌తో విజయవంతంగా పూర్తి చేసుకుంది. ఈ క్రమంలోనే ఏడోది కూడా ఇటీవలే మొదలైంది. ఇందులో అప్పుడే ఓ ప్రేమ జంట హైలైట్ అయింది. ఆ వివరాలు మీరే చూడండి!

అవన్నీ కంప్లీట్.. కొత్త సీజన్‌:తెలుగులో ఆరు రెగ్యూలర్, ఒక ఓటీటీ సీజన్ సూపర్ సక్సెస్ అవడంతో.. ఏడో దానిపై అంచనాలు తారాస్థాయిలో ఏర్పడ్డాయి. అందుకు అనుగుణంగానే దీన్ని సెప్టెంబర్ 3 అంటే గత ఆదివారం సాయంత్రం నుంచి ప్రారంభించారు. అక్కినేని నాగార్జునే దీన్ని కూడా హోస్ట్ చేస్తున్నారు. అంగరంగ వైభవంగా జరిగిన ఈ ఎపిసోడ్‌ ఎంతో సందడిగా సాగి ప్రేక్షకులకు మజాను పంచింది.

Rathika Rose Love Proposal to Pallavi Prashanth in Bigg Boss Show

14 మంది.. కన్ఫార్మ్ కాలేదు:బిగ్ బాస్ ఏడో సీజన్‌లోకి ప్రియాంక జైన్, హీరో శివాజి, సింగర్ దామిని, నటుడు ప్రిన్స్ యావర్, శుభ శ్రీ, నటి షకీలా, కొరియోగ్రాఫర్ సందీప్, శోభా శెట్టి, టేస్టీ తేజ, నటి రతికా రోజ్, నటుడు గౌతమ్ కృష్ణ, నటి కిరణ్ రాథోడ్, రైతు పల్లవి ప్రశాంత్, సీరియల్ హీరో అమరదీప్‌లు ఎంట్రీ ఇచ్చారు. కానీ, వీళ్లెవరూ కంటెస్టెంట్లుగా కన్ఫార్మ్ అవలేదని చెప్పి బిగ్ బాస్ షాక్‌నే ఇచ్చాడు.

Rathika Rose Love Proposal to Pallavi Prashanth in Bigg Boss Show

వాళ్లిద్దరు మాత్రం హైలైట్:గతంలో కంటే ఈ సారి బిగ్ బాస్ కంటెస్టెంట్ల ఎంపిక విషయంలో నిర్వహకులు చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. ఇలా ఏడో సీజన్‌లోకి 14 మంది కంటెస్టెంట్లు ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. అందులో రతికా రోజ్ మాత్రం అందరి దృష్టినీ ఆకర్షించింది. దీనికి కారణం ఈ అమ్మడు లోకల్ బ్యూటీ కావడమే. అలాగే, రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ కూడా బాగానే హైలట్ అయ్యాడని చెప్పాలి.

Rathika Rose Love Proposal to Pallavi Prashanth in Bigg Boss Show

ఇద్దరి మధ్య స్నేహంతో:లోకల్ వాళ్లు అన్న కారణమో ఏమో కానీ.. బిగ్ బాస్ ఏడో సీజన్ ఆరంభం నుంచే పల్లవి ప్రశాంత్, రతికా రోజ్ మధ్య స్నేహం మొదలైంది. మొదట్లో హౌస్‌లో ఉండేందుకు కాస్త ఇబ్బంది పడిన అతడితో ఆమె క్లోజ్‌గా మాట్లాడింది. తర్వాత ప్రశాంత్ తన లేడీ లక్ రతికానేనని చెప్పడంతో స్నేహం మొదలైంది. అప్పటి నుంచి వీళ్లిద్దరూ హౌస్‌లో ఎంతో క్లోజ్‌గా ఉంటున్నారు.

Rathika Rose Love Proposal to Pallavi Prashanth in Bigg Boss Show

నీ దిల్ ఎవరికి ఇస్తావని:తాజాగా జరిగిన ఎపిసోడ్‌లో ప్రిన్స్ యావర్, పల్లవి ప్రశాంత్ ఒక దగ్గర కూర్చుని ఉండగా.. రతికా రోజ్ వచ్చి 'హేయ్ ప్రశాంత్ ఒకటి అడుగుతా చెప్పు. నువ్వు ఏ అమ్మాయికి నీ దిల్ ఇస్తావు' అని అడిగింది. దీనికి అతడు తెగ సిగ్గు పడిపోయాడు. అంతేకాదు, 'ఇక్కడనా? బయటనా' అని పలు రకాల ప్రశ్నలు అడిగాడు. మొత్తానికి సమాధానం మాత్రం చెప్పకుండా దాటవేశాడు.

Rathika Rose Love Proposal to Pallavi Prashanth in Bigg Boss Show

నాది నీకే ఇస్తా.. పెళ్లితో:రతికా అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పని ప్రశాంత్.. ఏకంగా ఆమెనే 'నీ దిల్ ఎవరికి ఇస్తావు చెప్పు' అని ప్రశ్నించాడు. దీనికామె 'నీకే ఇస్తా' అని సూటిగా సమాధానం చెప్పింది. దీంతో ప్రశాంత్ ఉబ్బితబ్బిబ్బు అయిపోయాడు. అనంతరం వాళ్లిద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా.. ప్రిన్స్ 'మ్యారేజ్ కూడానా' అని రతికను అడిగాడు. దీనికామె తెగ సిగ్గు పడిపోయింది. మొత్తానికి వీళ్లిద్దరి రూపంలో హౌస్‌లో ప్రేమ జంట పుట్టుకొచ్చింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X