Bigg Boss Telugu 7: హౌస్‌లోకి ఆ కంటెస్టెంట్ రీ ఎంట్రీ.. ఇది కదా ఊహించని ఉల్టా పుల్టా!

బిగ్ బాస్ తెలుగు 7 ఉల్టా పుల్టా అంటూ సాగుతోంది. రోజుకో ట్విస్టు ఇస్తూ ప్రేక్షకులను అలరిస్తుంది ఈ షో. ఇక ఇప్పటికే ఐదు వారాలు పూర్తి కావొస్తుండగా.. ఈ వారంలో బిగ్ బాస్ తెలుగు 2.ఓ గ్రాండ్ లాంచ్ ఉంటుందని సమాచారం. ఇక హౌజ్ లో 14 మంది కంటెస్టెంట్స్ ఎంటర్ అవ్వగా అందులో నలుగురు ఎలిమినేట్ అయ్యారు. ఇక సెన్సేషన్ క్రియేట్ చేసిన రతికారోజ్ ఎలిమినేట్ అవ్వగా.. ఇప్పుడు ఆమె మళ్లీ బిగ్ బాస్ లోకి రీ ఎంట్రీ ఇవ్వనున్నట్లు సమచాారం. ఈ విషయం నెట్టింట వైరల్ గా మారింది. ఆ వివరాల్లోకి వెళితే...

బిగ్‌బాస్ సీజ‌న్ 7లో విజయ‌వంతంగా నాలుగు వారాలు ముగిశాయి. ప్ర‌స్తుతం ఐదో వారం కొన‌సాగుతోంది. నాలుగు వారాల్లో న‌లుగురు కిర‌ణ్ రాథోడ్‌, ష‌కిలా, దామిని, ర‌తిక‌లు ఎమిలినేట్ అయ్యారు. ప్ర‌స్తుతం హౌస్‌లో 10 మంది కంటెస్టెంట్లు మాత్ర‌మే ఉన్నారు. వ‌రుస‌గా న‌లుగురు మ‌హిళా కంటెస్టెంట్లు ఎలిమినేట్ కావ‌డం తెలుగు బిగ్‌బాస్ చ‌రిత్ర‌లో ఇదే మొద‌టి సారి. వీరిలో ర‌తిక రోజ్ ఎలిమినేష‌న్ చాలా మందికి షాకింగ్ గురి చేసింది.

 Bigg Boss Telugu 7:

బిగ్ బాస్ తెలుగు సీజన్ 7లో 14 మంది కంటెస్టెంట్స్ ఎంటర్ అయ్యారు. ఇక అందులో అందరి దృష్టిని ఆకర్షించింది మాత్రం రతికా రోజ్. ఆమె ఎంట్రీ ఇవ్వడమే నాగార్జున లవ్ బ్రేకప్ గురించి మాట్లాడి చర్చనీయంశం అయింది. అసలు ఎవరీ రతికా.. నాగార్జున బ్రేకప్ గురించి ఎందుకు మాట్లాడాడు అంటూ నెటిజన్స్ ఆరా తీశారు. చివరకు రతికా రోజ్.. రాహుల్ సిప్లిగంజ్ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ అని తేలింది. ఇక వీరి మధ్య అభిప్రాయ భేదాలు రావడంతో ... వీరు విడిపోయినట్లు తెలుస్తోంది.

 Bigg Boss Telugu 7:

ఆ విషయం పక్కన పెడితే.. హౌజ్ లోకి ఎంటర్ అయిన రతికా రోజ్.. ఈమె కచ్చితంగా టాప్ 5 కంటెస్టెంట్స్ లో ఒకరిగా నిలుస్తుందని అంతా అనుకున్నారు. రావడం రావడమే రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ ప్రేమాయణం నడిపి.. ఆ తర్వాత మళ్లీ వీళ్లు గొడవ పడటం సంచలనం సృష్టించింది. మళ్లీ సారీ చెప్పుకుని మాట్లాడుకున్నా... ఆ తర్వాత మళ్లీ శత్రువుల్లా మారిపోయారు. ఇక నామినేషన్స్ లో ప్రశాంత్ పై రతిక రెచ్చిపోయి మాట్లాడిన విషయం తెలిసిందే.

ప్రశాంత్ పవర్ అస్త్ర గేమ్ లో ఆడుతున్నప్పుడు రతికా రోజ్.. అమర్ దీప్ తో కలిసి రెచ్చిపోయి మాట్లాడింది. ఆయన్నీ కించపరిచేలా మాట్లాడి ప్రేక్షకుల దృష్టిలో నెగిటివ్ ఇంప్రెషన్ తెచ్చుకుంది. ఇక సోషల్ మీడియాలో రతికపై నెగిటివిటీ విపరీతంగా పెరిగిపోయింది. దీంతో నాలుగో వారంలోనే బిగ్ బాస్ ఆమెకు షాక్ ఇచ్చాడు. ఎలిమినేట్ అంటూ ఆమెను బయటకు పంపించారు. ఇక ఈ న్యూస్ నెట్టింట కూడా బాగా వైరల్ గా మారింది.

Anasuya Bharadwaj జబర్దస్త్ మానేయడానికి కారణం అదే... అనసూయ షాకింగ్ కామెంట్స్
https://telugu.filmibeat.com/television/actrees-anchor-anasuya-bharadwaj-reveals-why-she-is-away-from-jabardasth-125579.html

ఇదిలా ఉంటే రతికా గురించి సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ గా మారింది. ఆమె బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 లో మళ్లీ రీ ఎంట్రీ ఇవ్వనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ సీజ‌న్ ఉల్టా ఫ‌ల్టాగా ఉంటుంద‌ని సీజ‌న్ ఆరంభంలోనే చెప్పేశారు మేకర్స్. ఈ క్ర‌మంలో వ‌చ్చే వారంలో వైల్డ్ కార్డు ద్వారా మ‌రో ఆరు లేదా ఏడుగురు కంటెస్టెంట‌ర్ల‌ను హౌస్‌లోకి ఎంటర్ కానున్నారు. ఇది మినీ లాంచింగ్ ఈవెంట్ లాంటిదేన‌ని అంటున్నారు బిగ్ బాస్ నిర్వాహకులు.

 Bigg Boss Telugu 7:

అక్టోబర్ 8 ఆదివారం నాడు ఈ లాంచింగ్ ఎపిసోడ్ ఉంటుంది. అయితే వారితో పాటు... ర‌తిక కూడా మళ్లీ రీ ఎంట్రీ ఇవ్వనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇక అదే నిజమైతే.. మళ్లీ హౌజ్ లో రచ్చ మొదలు కావడం ఖాయం. మరి ఈసారి రతికా ఎలా ఆడుతుందో చూడాలి. ఇప్పటికే బయటకు వెళ్లి తనపై నెగిటివిటీ ఉన్నట్లు అర్థం చేసుకున్న ఈ భామ.. ఈ సారి లోపలికి వెళ్లి మళ్లీ పాజిటివిటీతో వస్తుందా లేదా అనేది వేచి చూడాల్సిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X