Bigg Boss Telugu 7: ఆ కంటెస్టెంట్‌కి గోల్డెన్ ఛాన్స్... మళ్లీ హౌస్‌లోకి రీఎంట్రీ.. ఇది కదా ఉల్టా పుల్టా అంటే?

బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 ఆసక్తిగా సాగుతున్న విషయం తెలిసిందే. 7వ వారంలోకి అడుగుపెట్టిన ఈ షో.. రసవత్తరంగా సాగుతోంది. ఇక నామినేషన్స్ కూడా ఈ వారం ఫుల్ హీటెక్కించాయి. అయితే నాలుగోవారంలో ఫుల్ నెగిటివిటీతో ఎలిమినేట్ అయిపోయిన రతికా రోజ్... ఇక ఈ వారం రీఎంట్రీ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ భామకు ఇది గోల్డెన్ ఛాన్స్ అని చెప్పవచ్చు. ఎందుకు అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.

బిగ్ బాస్ తెలుగు 7 అంతా ఉల్టా పుల్టాగానే సాగుతోంది. కొత్త కొత్త టాస్కులు, ట్విస్టులతో ఆటను రసవత్తరంగా సాగిస్తున్నారు. సీజన్ లో కూడా కొత్త కొత్త నిర్ణయాలతో హౌస్ మేట్స్ కి బిగ్ బాస్ కూడా షాక్ లు ఇస్తున్నాడు. అంతే కాకుండా ఎప్పుడు ఎవరు హౌస్ లోకి వస్తారు అనే విషయం కూడా తెలియక ప్రేక్షకులు కూడా అయోమయోంలో ఉండిపోతున్నారు. ఇక ఇటీవల ఎపిసోడ్ లో హౌస్ లోకి దామిని, రతికా రోజ్, శుభశ్రీలను తీసుకొచ్చిన సంగతి తెలిసిందే.

Golden Chance to BIgg Boss Contestant

అయితే వారిలో ఒకరు హౌస్ లోకి వస్తారు అని చెప్పుకువచ్చారు. దానికి ఓటింగ్ కూడా పెట్టారు. ఇప్పుడు వారిలో ఒకరు హౌస్ లోకి రాబోతున్నారు. అది ఎవరో కాదు.. రతికా రోజ్. బిగ్ బాస్ హౌస్ లో ముగ్గురిలో ఒకరిని హౌస్ లోకి తీసుకొస్తామని... అందుకు హౌస్ మేట్స్ ఓట్లు వేయాలి అన్నారు. అందుకు హౌస్ లో ఉన్న వాళ్లంతా ఓట్లు వేశారు. అయితే ఓటింగ్ అయిపోయిన తర్వాత బిగ్ బాస్ బిగ్ ట్విస్ట్ ఇచ్చిన సంగతి తెలిసిందే.

సాధారణంగా ఓట్లు ఎక్కువ ఎవరికి పడితే.. వాళ్లను హౌస్ లోకి తీసుకురావాలి. అయితే ఇక్కడ నాగ్ ట్విస్ట్ ఇస్తూ... ఎవరికైతే తక్కువ ఓట్లు పడతాయో వారిని హౌస్ లోకి తీసుకొస్తామంటూ చెప్పుకువచ్చారు. ఇప్పుడు రతికా రోజ్ కి తక్కువ ఓట్లు వచ్చాయి. దీంతో ఆమె హౌస్ లోకి అడుగుపెట్టబోతుంది. ఇక ఆమెకు ఇది గోల్డెన్ ఛాన్స్ అని చెప్పవచ్చు. ఎందుకంటే.. ఆమె ఫుల్ నెగిటివిటీతో బయటకు వచ్చింది. ఇలాంటి క్రమంలో మళ్లీ హౌస్ లోకి వెళ్తే.. ఆమెకు మంచి ఛాన్స్ అని చెప్పవచ్చు.

Rathika Rose re-entry into the Bigg Boss Telugu Season 7 This is Real Ulta Pulta Game Full Details Here

నెగిటివిటీ వల్ల రతికా రోజ్ బయటకు వచ్చింది. ఇప్పుడు మళ్లీ లోపలికి వెళ్లి పాజిటివ్ తెచ్చుకోవచ్చు. దీంతో ఆమెకు ఇదో గోల్డెన్ ఛాన్స్ అని చెప్పవచ్చు. అంతేకాకుండా శివాజీ, ప్రశాంత్ లను మిస్ అవుతున్నాను ఇంతకు ముందే తన ఇన్ స్టాగ్రామ్ వేదికగా చెప్పుకువచ్చింది. ఇలాంటి సమయంలో ఆమె తిరిగి హౌస్ లోకి వెళ్తే ఆట కచ్చితంగా రసవత్తరంగా సాగుతోంది.

Rathika Rose re-entry into the Bigg Boss Telugu Season 7 This is Real Ulta Pulta Game Full Details Here

ఇక ఇప్పటికే వైల్డ్ కార్డు ఎంట్రీస్ ద్వారా ఐదుగురు వచ్చారు. ఇక అందులో నయని పవని ఎలిమినేట్ అయ్యారు. ఇక ఈ వారం పూజా మూర్తి ఎలిమినేట్ కానుందని సమాచారం. ఈ క్రమంలో ఈ రతికా ఎంట్రీ ఇస్తే... ఎలా ఉండనుందో చూడాలి. రతికా ఎంట్రీపై ఇది కదా ఉల్టా పుల్టా అని నెటిజన్స్ అంటున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X