Bigg Boss 7 Telugu: ప్రశాంత్‌కు ఘోర అవమానం.. అతడితో రతికా గలీజ్ పని.. గెలిచి ఇచ్చిపడేశాడుగా!
తెలుగు ప్రేక్షకులకు అస్సలు పరిచయం చేయనవసరంలేని షోలలో బిగ్ బాస్ ఒకటి. అంతలా ఈ షో దాదాపు ఏడేళ్లుగా బుల్లితెరపై హవాను చూపిస్తూ దూసుకుపోతోంది. ఈ క్రమంలోనే ప్రేక్షకుల మద్దతును విశేషంగా అందుకుని, రికార్డు స్థాయిలో రేటింగ్‌లను కూడా అందుకుంటోంది. ఫలితంగా దేశ వ్యాప్తంగా నెంబర్ వన్ రియాలిటీ షోగా వెలుగొందుతోంది. ఈ ఉత్సాహంతోనే నిర్వహకులు ఇటీవలే ఏడో సీజన్‌ను మొదలెట్టారు. ఇందులో తాజాగా జరిగిన ఎపిసోడ్‌లో పల్లవి ప్రశాంత్‌కు ఘోర అవమానం జరిగింది. అసలేమైంది? ఆ పూర్తి వివరాలను మీరే చూడండి!
బిగ్ బాస్ ఏడో సీజన్ ఉల్టా పుల్టా కాన్సెప్టుతో నడుస్తోంది. దీంతో మొదటి రోజు నుంచే ఇందులో ఎన్నో ఊహించని సన్నివేశాలను చూపిస్తున్నారు. ఫలితంగా దీనికి రెస్పాన్స్ కూడా భారీగానే లభిస్తోంది. ఇక, ఈ సీజన్‌లోకి 14 మంది కంటెస్టెంట్లు మాత్రమే వచ్చారు. అందులో రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్, లోకల్ బ్యూటీ రతికా రోజ్ మాత్రం ఆరంభంలోనే అందరి దృష్టినీ లాక్కున్నారు.

ముఖ్యంగా ఏడో సీజన్‌లో పల్లవి ప్రశాంత్, రతికా రోజ్ మధ్య ట్రాక్‌ను ఆరంభంలోనే బాగా ఫోకస్ చేశారు. అందుకు అనుగుణంగానే వీళ్ల మధ్య కొన్ని సీన్లను హైలైట్ చేసి చూపించి.. వీళ్లిద్దరూ ప్రేమించుకుంటున్నారు అనే ఫీల్ కలిగించారు. ఆ తర్వాత 'నేను నిన్ను లవ్ చేస్తున్నా అని చెప్పానా' అని ప్రశాంత్.. రతికను సూటిగా ప్రశ్నించినప్పటి నుంచి వీళ్ల మధ్య దూరం పెరిగింది.
అప్పటి వరకూ లవ్ చేస్తున్నట్లు కనిపించిన ప్రశాంత్.. ఉన్నట్లుండి రతికాపై కాకుండా తన గేమ్‌పై ఫోకస్ చేయడం మొదలు పెట్టాడు. అప్పటి నుంచి ఆమె అతడిని టార్గెట్ చేస్తూనే వస్తోంది. మొదటి 'నా దిల్ నీకు ఇచ్చేస్తా' అని ట్రాక్ మొదలెట్టిన రతికానే.. ప్రశాంతే అంతా చేశాడు అన్నట్లుగా క్రియేట్ చేసింది. ఇలా వీలు చిక్కినప్పుడల్లా అతడిపై విమర్శలు చేస్తూనే ఉంది.
ఇక, తాజాగా జరిగిన ఎపిసోడ్‌లో పవర్ అస్త్రకు కంటెండర్లు అయిన ప్రిన్స్ యావర్, శుభశ్రీ రాయగురు, ప్రశాంత్‌కు ఒక టాస్క్ ఇచ్చారు. అందులో తమకు నచ్చిన వాళ్లను సపోర్ట్ చేసేందుకు వేరే వాళ్ల దృష్టిని మళ్లించవచ్చని బిగ్ బాస్ చెప్పాడు. దీంతో అమర్‌దీప్, రతికా రెచ్చిపోయారు. ఇద్దరూ కలిసి ప్రశాంత్‌ను టార్గెట్ చేస్తూ దారుణమైన కామెంట్లు చేసి ఘోరంగా అవమానించారు.

ఒక దశలో రతికా రోజ్ 'ఛీఛీ కొందరు ఉంటారు. వాళ్లకు అమ్మాయిలను గౌరవించడం తెలీదు. వాళ్లను ఇంట్లో వాళ్లు అలాగే పెంచారేమో. ఆ మీసాలు, గెడ్డాలు ఉన్నా వేస్ట్' అంటూ దారుణమైన మాటలు అనేసింది. ఆ సమయంలో అక్కడున్న ప్రశాంత్‌తో పాటు చూసే అతడి అభిమానులు కూడా బాధ పడే పరిస్థితి వచ్చింది. అంతలా ఆమె ఘోరమైన కామెంట్లను చేసింది.
రతికా రోజ్ తానా అంటే అమర్‌దీప్ తందానా అంటూ ప్రశాంత్‌ను టార్గెట్ చేసి కామెంట్లు చేశారు. అయినప్పటికీ అతడు ఏమాత్రం తగ్గేదేలే అన్నట్లుగా ఆ టాస్కులో ఆడాడు. అయితే, ఎవరూ ఏకాభిప్రాయానికి రాకపోవడంతో ఈ ముగ్గురికీ వేరే టాస్క్ ఇచ్చారు. ఇందులో ప్రశాంత్ విజయం సాధించాడు. దీంతో నాలుగో పవర్ అస్త్ర దక్కించుకుని తన సత్తాను నిరూపించుకున్నాడు.


Click it and Unblock the Notifications











