Bigg Boss Telugu 7 ప్రశాంత్‌కు అక్కడ మచ్చ.. అందుకే అలా.. రైతుబిడ్డపై రతిక కామెంట్స్

బిగ్ బాస్ తెలుగు 7 మరో వారం రోజుల్లో ముగియనుంది. ఇక ఈ నేపథ్యంలో రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ పై బిగ్ బాస్ బ్యూటీ రతికా రోజ్ కీలక కామెంట్స్ చేసింది. తాజాగా ఓ యూట్యూబ్ ఛానెల్ కు ఇంటర్వ్యూ ఇచ్చిన ఈ భామ.. బిగ్ బాస్ గురించి.. అందులోని కంటెస్టెంట్స్ గురించి తన అభిప్రాయాలను వెల్లడించింది. ముఖ్యంగా రైతు బిడ్డపై తొలిసారిగా హాట్ కామెంట్స్ చేసింది. ఇక తన దృష్టిలో విన్నర్ ఎవరో చెప్పుకువచ్చింది ఈ బ్యూటీ. ఆ వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.

బిగ్ బాస్ తెలుగు 7 సెప్టెంబర్ 3న ప్రారంభం అయిన సంగతి తెలిసిందే. అయితే బిగ్ బాస్ హౌస్ లో తొలి విడుతలో 14మంది ఎంటర్ అయ్యారు. వారిలో రతికా రోజ్ ఒకరు. ఈ బ్యూటీ రావడం రావడమే అందరినీ ఆకర్షించింది. ఇక రాహుల్ సిప్లిగంజ్ తో బ్రేకప్ మ్యాటర్ లీక్ అవ్వడం.. మరోవైపు బిగ్ బాస్ హౌస్ లో రైతు బిడ్డతో పులిహోర.. ఆ తర్వాత శత్రుత్వం.. మొత్తానికి నాలుగవ వారంలో ఎలిమినేట్ అయింది. ఇక ఆరో వారంలో మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చిన తర్వాత కూడా రతికా రోజ్.. నెగిటివిటీతోనే బయటకు వచ్చింది.

Rathika Rose Shocking Comments on Pallavi Prashanth and Bigg Boss Telugu 7 Show

ఇక బయటకు వచ్చాక తొలిసారిగా ఓ యూట్యూబ్ ఛానెల్ కు ఇంటర్వ్యూ ఇచ్చింది ఈ భామ. ఆ ఇంటర్వూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లే ముందు ఆనంద్ అనే వ్యక్తిని కలిసి వెళ్లాల్సింది. ఆ వ్యక్తిని కలవకపోవడం వల్లే నాకు ఇంత బ్యాడ్ వచ్చింది. అతనికి బిగ్ బాస్ ఆట గురించి బాగా తెలుసు. అతని సలహాలు తీసుకుని వెళ్లి ఉంటే.. నా గేమ్ వేరేలా ఉండేది. అదే నేను చేసిన తప్పు.. అంటూ వెల్లడించింది.

ఇక వైల్డ్ కార్డు ఎంట్రీల గురించి మాట్లాడుతూ తనకు ఈ విషయం అస్సలు నచ్చలేదని వెల్లడించింది. ఫస్ట్ టైం బ్యాడ్ అవ్వడానికి కారణం బిగ్ బాస్ తనకు నచ్చింది టెలికాస్ట్ చేసుకున్నాడు.. అందుకే జనాలు అది చూసి నమ్మారు.. అసలు బిగ్ బాస్ హౌస్ లో జరిగిందేంటో నాకు మాత్రమే తెలుసు.. నేను ప్రశాంత్ కు ఎన్నో సార్లు సలహాలు ఇచ్చాను.. ఆట మీద ఫోకస్ చేయ్ అంటూ.. అదేమి ప్లే చేయకుండా.. కిస్సులు, హగ్గులు ప్లే చేసి.. నన్ను బ్యాడ్ చేశాడని సంచలన వ్యాఖ్యలు చేసింది.

Rathika Rose Shocking Comments on Pallavi Prashanth and Bigg Boss Telugu 7 Show

ఇక ఈ సీజన్ విన్నర్ యావర్ అవ్వాలని కోరుకుంటున్నాను అని రతికా చెప్పింది.. ఇక ప్రశాంత్ గురించి మాట్లాడుతూ.. ప్రశాంత్ కు మచ్చ ఉంది... బానే అదృష్టం ఉందంటూ వెల్లడించింది. ఇక నాగార్జున హోస్టింగ్ బాగుందని తెలిపింది. అమర్ దీప్ కు హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి.. అయిన ఆట ఓవర్ గా ఆడుతున్నాడంటూ వెల్లడించింది. ఇక రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ పై రతికా రోజ్ కామెంట్స్ చేయడం వైరల్ గా మారాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X