Bigg Boss 7 Telugu: బిగ్ బాస్‌కే షాకిచ్చిన లోకల్ బ్యూటీ.. రూమ్‌లో ఆ ఇద్దరు తప్పు చేశారంటూ!
ఇండియాలోని వేరే భాషల్లో ఎప్పుడో మొదలైనా.. ఏడేళ్ల క్రితమే తెలుగులోకి పరిచయం అయింది బిగ్ బాస్ షో. ఎన్నో అనుమానాలతో మన భాషలోకి వచ్చిన దీనికి చాలా తక్కువ సమయంలోనే ప్రేక్షకులు మద్దతును అందించారు. దీంతో ఇది తెలుగు బుల్లితెరపై సూపర్ హిట్ షోగా మారిపోయింది. గతంలో ఎన్నడూ చూడని కాన్సెప్టే అయినా ఇక్కడి ప్రేక్షకులు దీనికి ఊహించని రీతిలో స్పందన అందించారు. ఇక, ఇప్పుడు ఏడో సీజన్ మరింత ఆసక్తికరంగా సాగుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా జరిగిన ఎపిసోడ్‌లో ఓ కంటెస్టెంట్ బిగ్ బాస్‌కే షాకిచ్చారు. ఆ సంగతులు మీకోసమే!
భారీ అంచనాలకు తగ్గట్లుగానే:ఎన్నో భాషలతో పోలిస్తే తెలుగులో ప్రసారం అవుతోన్న బిగ్ బాస్‌కు మాత్రమే ప్రేక్షకుల నుంచి భారీ స్పందన వస్తోంది. అందుకే ఏడో సీజన్‌పై అంచనాలు అదే రేంజ్‌లో ఏర్పడ్డాయి. అందుకు అనుగుణంగానే షో నిర్వహకులు ఈ సీజన్‌లో అన్నీ సరికొత్తగా ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. ఫలితంగా ఇది ఆరంభం నుంచే ఆసక్తికంగా సాగుతూ ప్రేక్షకులకు వినోదాన్ని పంచుతోంది.

ఏడో సీజన్‌లో ఫోకస్ అయింది:ఏడో సీజన్‌లోకి 14 మంది కంటెస్టెంట్లు ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. అందులో రతికా రోజ్ మాత్రం అందరి దృష్టినీ ఆకర్షించింది. దీనికి కారణం ఈ అమ్మడు లోకల్ బ్యూటీ కావడమే అని తెలిసిందే. దీనికితోడు ప్రీమియర్ ఎపిసోడ్‌లో ఈమె ఏకంగా నాగార్జునకే షాకిచ్చేలా మాట్లాడింది. ఫలితంగా రతికా రోజ్ ఆరంభం నుంచే యమా హైలైట్ అయిందని చెప్పుకోవచ్చు.

దూకుడుగా... నిజాయితీతోనే:రతికా రోజ్ మొదటి రోజు నుంచే తనదైన మార్కును చూపిస్తూ దూసుకుపోతోంది. ముఖ్యంగా ప్రతి విషయంలోనూ దూకుడుగా వ్యవహరిస్తూ.. నిజాయితీగా మాట్లాడుతూ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. అదే సమయంలో తన అందంతోనూ కుర్రాళ్లను మాయ చేస్తోంది. దీంతో షో మొదలైన మొదటి రోజు నుంచే ఫాలోయింగ్‌ను క్రమంగా పెంచుకుంటూ దూసుకుపోతోంది.

నామినేషన్స్‌లో మంచి రీజన్:బిగ్ బాస్ ఏడో సీజన్‌కు సంబంధించి మొదటి వారానికి గానూ జరిగిన నామినేషన్స్ టాస్కులో రతికా రోజ్... ప్రియాంక జైన్, దామిని నామినేట్ చేసింది. ఇందుకోసం ఆమె 'డీలక్స్ రూమ్‌లో, స్టాండర్డ్ రూమ్‌లో ఒక్కొక్కరికి మాత్రమే పర్మీషన్ వచ్చింది. కానీ, ప్రియాంక, దామినీ కూడా వాళ్లతో కలిసి పడుకున్నారు. దీంతో వాళ్లు రూల్స్ అతిక్రమించారు' అని కారణం చెప్పింది.

మీరు కూడా అంగీకరించాలి:ప్రియాంక జైన్, దామినిని రతికా రోజ్ నామినేట్ చేసిన తర్వాత బిగ్ బాస్ 'రతికా.. మీరు చెప్పిన కారణాలతో వాళ్లిద్దరూ అంగీకరిస్తారని మీరు భావిస్తున్నారా' అని సూటిగా ప్రశ్నించాడు. దీనికి రతికా రోజ్ 'అంగీకరించాలి. ఎందుకంటే ఆ రూమ్స్‌లో పడుకోమని ఎవరికీ చెప్పలేదు కదా. వాళ్లెలా వెళ్లి పడుకుంటారు? వాళ్లే కాదు.. మీరు కూడా దీనికి అంగీకరించాల్సిందే' అని షాకిచ్చింది.
ముందే చెప్పి నామినేషన్:నామినేషన్ తర్వాత రతికా గురించి ప్రియాంక జైన్ మాట్లాడింది. దామినితో కలిసి వస్తున్నప్పుడు ఆమె 'రతికా నాకు ముందే చెప్పింది. పర్మీషన్ లేకుండా మీరు రూమ్‌లో ఎలా పడుకుంటారు? దీనికి నేను నామినేట్ చేస్తున్నా అని. ఈ విషయంపై నాతో డిస్కర్షన్ కూడా పెట్టింది. కాబట్టి నాకు ఓకే' అని చెప్పింది. మొత్తానికి రతిక వీళ్లిద్దరితో పాటు బిగ్ బాస్‌కూ ఝలక్ ఇచ్చేసింది.


Click it and Unblock the Notifications











