Bigg Boss Telugu 7: అసలు రంగు బయటపెట్టిన రతికా.. గేమ్ స్ట్రాటజీ మార్చిన రాధిక!
బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 రోజురోజుకూ రసవత్తరంగా సాగుతోంది. ఉల్టా పుల్టా కాన్సెప్ట్ తో వచ్చిన బిగ్ బాస్ అదిరిపోయే టాస్కులు, అంతకు మించిన ఎమోనషన్స్ ను బయటకు తీస్తున్నాడు. కంటెస్టెంట్లు కూడా గెలిచేందుకు చాలానే ప్రయత్నాలు చేస్తున్నారు. కొందరు గ్రూపుగా గేమ్ ఆడుతుంటే మరికొంత మంది సింగిల్ గా ఆడుతున్నారు. అయితే 8వ వారంలో సోమవారం రోజు రతికా రోజ్ ఇంట్లోకి రీఎంట్రీ ఇచ్చిన విషయం అందరికీ తెలిసిందే. అయితే గతంలో ఇంట్లో ఉండి.. పల్లవి ప్రశాంత్, శివాజీపై తీవ్రమైన వ్యాఖ్యలు చేసింది రతిక. అలా ఫుల్లుగా నెగిటివిటీ సంపాధించుకొని ఇంట్లోంచి వెళ్లిపోయింది.
కానీ మళ్లీ ఇంట్లోకి ఎంట్రీ ఇచ్చిన రతికా రోజ్.. గతంలో జరిగినదంతా చూసి వచ్చి సరికొత్తగా గేమ్ ఆడుతోంది. ఇంట్లోకి రావడం రావడమే.. శివాజి కాళ్లు మొక్కి తన తప్పును క్షమించమని అడిగింది. అలాగే పల్లవి ప్రశాంత్ తో కూడా బాగానే ఉంటోంది. ముఖ్యంగా ప్రిన్స్ యావర్, భోలె షావళితో కూడా తన స్నేహాన్ని కొనసాగిస్తోంది. అయితే తాజాగా వచ్చిన ఓ ఎపిసోడ్ లో రతిక తనకు సంబంధించిన కొన్ని షాకింగ్ విషయాలను చెబుతూ తన అసలు రంగును బయట పెట్టింది. ఆమె గేమ్ ప్లాన్ ఏంటి, స్ట్రాటజీ ఏంటో ప్రిన్స్ యావర్ తో చెప్పింది.

ప్రస్తుతం తాను శివాజి, ప్రిన్స్ యావర్, తనతో సరిగ్గా మాట్లాడితే ప్రశాంత్ తో తప్ప మెరవరితోనూ స్నేహం సాగించనని యావర్ తో చెప్పుకొచ్చింది. గతంలో మనం ఇద్దరం ఒక ప్లేట్ లో కలిసి తింటే.. ప్రియాంక లవ్ బర్డ్స్ అంటూ కామెంట్లు చేసిందని.. అలా ఎలా ఆమె స్టేట్ మెంట్ ఇస్తుందంటూ రతికా రోజ్ యావర్ దగ్గర బాధ పడింది. ఓహో అవునా, అలా ఎలా చెప్పిందంటూ యావర్ కూడా మాట్లాడాడు. ఇంట్లో వాళ్లంతా కలిసి ముఖ్యంగా ప్రియాంక, శోభా శెట్టి, సందీప్ మాస్టర్, టేస్టీ తేజ కలిసి గేమ్ ఆడుతున్నారని వివరించింది. అలాగే వాళ్ల మాటలు వినడం వల్లే తనకు ఆ పరిస్థితి వచ్చిందంటూ వాపోయింది.

ఇదంతా అయిపోయాకా.. మళ్లీ భోలె షావళితో కూర్చున్న రతికా రోజ్ మరికొన్ని షాకింగ్ విషయాలు చెప్పింది. ముఖ్యంగా పల్లవి ప్రశాంత్ తనతో సరిగ్గా మాట్లాడకపోవడం గురించి తెలిపింది. గతంలో తనతో చాలా క్లోజ్ గా బిహేవ్ చేసి... నిజంగా ప్రేమిస్తున్నావా అంటే అదేం లేదంటూ చెప్పాడని గుర్తు చేసింది. అలా చేశాక కూడా అతని బిహేవియర్ లో అదే తేడా కనిపించిందని.. దాని వల్లే తాను బ్యాడ్ అయ్యానంటూ బాధను వ్యక్తం చేసింది. ఎప్పుడూ విపరీతంగా మాట్లాడె భోలె షావళి ఈ విషయంపై ఎలాంటి కామెంట్లు చేయకపోవడం గమనార్హం.

ఇదంతా చూస్తున్న అభిమానులు.. రతికా రోజ్ గేమ్ మార్చిందని అంటున్నారు. మాటలు చెప్పడమే కాదు, వారితో సరిగ్గా ఉండి గేమ్ ఆడితే ఇంకా కొంత కాలం పాటు ఇంట్లో కొనసాగే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. చూడాలి మరి గతంలో జరిగిన దాన్ని, ముఖ్యంగా తనపై వచ్చిన నెగిటివిటీని దృష్టిలో ఉంచుకునే ఈ పాప గేమ్ ఆడుతుందా, లేదా మరెవరి మాటలు అయినా నమ్మి మరోసారి తన విశ్వరూపం చూపిస్తుందా తెలియాలంటే ఇంకా కొంత కాలం ఆగాల్సిందే.


Click it and Unblock the Notifications











