Bigg Boss Telugu 7 ఉల్టా పుల్టా అంటే ఇది కదా.. బిగ్‌బాస్ ఇంట్లోకి ముగ్గురు ఎలిమినేటెడ్ కంటెస్టెంట్లు

బిగ్‌బాస్ తెలుగు 7 సీజన్‌ అంతా ఉల్టా పుల్టా అంటూ మొదటి నుంచి హోస్ట్ నాగార్జున చెబుతూనే వచ్చారు. ఆయన చెబుతున్నట్టే షోలో ఊహించని పరిణామాలు కనిపిస్తున్నాయి. గతవారం ఇంటిలోకి ఐదుగురు కంటెస్టెంట్లు వైల్డ్ కార్డు ద్వారా ఇంటిలోకి వచ్చారు. అయితే ఇప్పటి వరకు ఎలిమినేట్ అయిన వారందరూ లేడీ కంటెస్టెంట్స్ కావడంతో బిగ్‌బాస్ షోపై ఆసక్తి తగ్గిపోతుందనే విషయం సోషల్ మీడియాలో బలంగా కనిపిస్తున్నది. అయితే ఇప్పటి వరకు ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్లలో ముగ్గురిని ఇంటిలోకి పంపించడం మరోసారి ఉల్టా పల్టా అని నిరూపించారు. ఆ వివరాల్లోకి వెళితే..

బిగ్‌బాస్‌ తెలుగు 7 సీజన్‌లో ఆరోవారం వీకెండ్ షోకు హోస్ట్ నాగార్జున ఫైర్ మీద వచ్చారు. ఇంటి సభ్యుల తీరుపై భారీగా కొరడా ఝులిపిస్తున్న నాగ్.. ప్రతీ వారం తన రేంజ్‌ను పెంచుకొంటూ వెళ్తున్నాడు. గత సీజన్‌లో సాఫ్ట్‌గా కనిపించిన ఆయన.. ఈ సీజన్‌లో ఇంటి సభ్యుల భరతం పడుతున్నాడు. ఈ వారం కూడా ఇంటి సభ్యులను రఫ్ ఆడించాడు.

Rathika Rose, Shubha Sri and Singer Damini wild entry Into Bigg Boss Telugu 7

బిగ్‌బాస్ షోలో ఇంటికి రెండో కెప్టెన్‌గా అయిన ప్రిన్స్ యావర్ యాటిట్యూడ్ మారిపోయిందంటూ నాగార్జున క్లాస్ పీకారు. అమర్ దీప్‌, యావర్ గొడవపడుతుంటే.. మధ్యలో వెళ్లిన ఆట సందీప్‌ను ప్రశ్నలతో బెంబేలెత్తించారు. వాళ్లిద్దరూ గొడవ పడుతుంటే.. నీవు మధ్యలో ఎందుకు వెళ్లావు? నీవు వెళ్లి గొడవ తగ్గించకపోగా మరింత పెంచావు అంటూ నాగార్జున గట్టిగా మొట్టికాయలు వేశాడు.

ఇక ప్రిన్స్ యావర్‌ను ఉద్దేశించి నాగార్జున మాట్లాడుతూ.. డిక్టేటటర్లందరూ మట్టి కొట్టికు పోవాల్సిందే. ప్రేమతో పాలించిన వాళ్లనే ప్రపంచం గుర్తు పెట్టుకొంటుంది. ఆ విషయాన్ని గుర్తుంచుకో అంటూ హోస్ట్ సలహా ఇచ్చారు. అయితే కెప్టెన్సీ తర్వాత యావర్‌లో మార్పు రావడంపై సీరియల్ బ్యాచ్ ప్రియాంక, శోభాశెట్టి చర్చించుకోవడం కనిపించింది. 24 గంటలు కాకముందే ఇంత మార్పా? అని అనుకోవడం వినిపించింది.

Rathika Rose, Shubha Sri and Singer Damini wild entry Into Bigg Boss Telugu 7

ఇదిలా ఉండగా, ఇంటిలోకి ఎలిమినేట్ అయిన ముగ్గురు కంటెస్టెంట్లు రావడం షాక్ కలిగించింది. ఇంటి తలుపు తెరువగానే.. ముగ్గురు లేడీ కంటెస్టెంట్లు ఇంటిలోకి వచ్చారు. వారిని చూసి ఇంట్లో ఉన్న వారంతా పరుగులు పెడుతూ వారి వద్దకు ఉరుకులు పరుగులు పెట్టారు. ఇంటిలోకి రతిక రోజ్, శుభ శ్రీ, సింగర్ దామిని ఇంటిలోకి వచ్చారు. వారిని ఇంటిలోకి పంపించిన తర్వాత చెప్పానుగా.. ఈ సీజన్ అంతా ఉల్టా పుల్టా అంటూ నాగార్జున కామెంట్ చేశారు.

Rathika Rose, Shubha Sri and Singer Damini wild entry Into Bigg Boss Telugu 7

ఇదిలా ఉండగా, ఇంటిలోకి వచ్చిన రతిక రోజ్, శుభశ్రీ, దామిని రావడం నిజంగా ఆశ్చర్యం కలిగించిన విషయంగా మారింది. వారిని గెస్టులుగా పిలిపించారా? లేదా వైల్డ్ కార్డు ఎంట్రీలుగా ఇంట్లోకి రప్పించారా? అనేది పూర్తి ఎపిసోడ్ చూస్తే గానీ తెలియదు. ప్రోమో మాత్రం అదరగొట్టేలా ఉండటమే కాకుండా ఎపిసోడ్‌పై అంచనాలు పెంచింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X