రాహుల్ నిజస్వరూపం బయటపెట్టిన రతికా సిస్టర్: బ్రేకప్ అందుకే అయింది.. ఫొటోలు లీక్ చేసింది వాళ్లేనంటూ!
బిగ్ బాస్ ఏడో సీజన్ ఆసక్తికరంగా సాగుతోంది. ఇందులో ఆరంభంలోనే హైలైట్ అయిన వారిలో రతికా రోజ్ ఒకరు. హౌస్‌లో వ్యవహరించిన తీరుతో పాటు బయట ఆమె రాహుల్ సిప్లీగంజ్‌తో లవ్ స్టోరీ నడిపిన విషయం వెలుగులోకి రావడంతో సెన్సేషన్ అయింది. ఆ తర్వాత దీనిపై ఎన్నో రకాల వార్తలు వచ్చాయి. ఈ క్రమంలోనే రాహుల్ తన పేరును వాడుకుంటుందని రతికాపై పరోక్షంగా ఆరోపణలు చేశాడు. ఇక, తాజాగా రతికా - రాహుల్ వ్యవహారంపై ఆమె సోదరి స్పందించింది. ఈ సందర్భంగా ఎన్నో సీక్రెట్లు లీక్ చేసింది. అవి ఏంటో మీరే చూడండి!
ఫొటోలు లీక్.. ఆమె చేసిందని:రతికా రోజ్ బిగ్ బాస్ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత రాహుల్ సిప్లీగంజ్‌తో కలిసి తీసుకున్న ఫొటోలు, కొన్ని వీడియోలు వైరల్ అయ్యాయి. దీంతో వీళ్లిద్దరూ గతంలో ప్రేమించుకున్నారన్న విషయం బయటకు వచ్చింది. దీంతో రాహుల్ స్పందిస్తూ.. కావాలనే తన ఫేమ్‌ను వాడుకోవడం కోసం రతికానే ఈ మేటర్ బయట పెట్టడంతో పాటు ఫొటోలు లీక్ చేయించిందని ఆరోపించాడు.

రాహులే లీక్ చేశాడేమో అని:రతికా సోదరి తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఇందులో ఆమె 'మా అక్క బిగ్ బాస్‌లోకి వెళ్లిన తర్వాత రాహుల్ సిప్లిగంజ్‌తో గతంలో దిగిన కొన్ని ఫొటోలు బయటకు వచ్చాయి. తనని యూజ్ చేసుకోవడానికి మా అక్కే అలా చేసిందని అన్నారు. అసలు ఆ ఫొటోలు బయటకు ఎలా వచ్చాయో మాకే తెలియదు. రాహులే ఆ ఫొటోలను లీక్ చేశాడని మేం అనుకున్నాం' అని చెప్పింది.
అక్క ఎలా లీక్ చేస్తుందంటూ:ఆ తర్వాత ఆమె కంటిన్యూ చేస్తూ.. 'రాహుల్ - రతికా ప్రైవేట్ ఫొటోలు ఉంటే ఈమె దగ్గర ఉండాలి. లేదంటే రాహుల్ దగ్గర ఉండాలి. బిగ్ బాస్ హౌస్‌లో అక్క దగ్గర మొబైల్ లేదు. అలాంటప్పుడు తను ఎలా లీక్ చేస్తుంది. ఒక అమ్మాయి తనకి సంబంధించిన ప్రైవేట్ ఫొటోలను లీక్ చేసుకుని బ్యాడ్ చేసుకుంటుందా? గతం గుర్తు చేసుకుంటుందా' అని వివరించింది.

పెళ్లికి అంతా ఒప్పుకున్నారు:రతికా - రాహుల్ ప్రేమ గురించి ప్రస్తావిస్తూ.. 'మా అక్క, రాహుల్ లవ్ చేసుకున్న మాట వాస్తవమే. ఇద్దరూ పెళ్లి కూడా చేసుకోవాలని అనుకున్నారు. రతికా వచ్చి మా డాడీతో చెప్పింది. ఆయన పెళ్లికి ఒప్పుకున్నారు. దీంతో వాళ్ల ఫ్యామిలీ, మా ఫ్యామిలీ మధ్య చర్చలు కూడా జరిగాయి. కానీ, ఫైనల్ స్టేజ్‌కు వెళ్లిన తర్వాత కొన్ని గొడవలు జరిగాయి' అని చెప్పుకొచ్చింది.
ఆ కండీషన్ల వల్లే బ్రేకప్ చెప్పి:రతికా - రాహుల్ మధ్య బ్రేకప్ గురించి ఆమె మాట్లాడుతూ.. 'పెళ్లికి ముందే రాహుల్ సిప్లీగంజ్.. మ్యారేజ్ తర్వాత నువ్వు ఇండస్ట్రీలో ఉండొద్దు. బయటకు వెళ్లడానికి వీళ్లేదు అని కండిషన్స్ పెట్టాడు. అవి అక్కకు అస్సలు నచ్చలేదు. దీంతో ఇద్దరి అంగీకారంతోనే బ్రేకప్ అయిపోయింది. ఆ తర్వాత ఎవరి లైఫ్ వాళ్లు చూసుకుంటూ హ్యాపీగానే ఉన్నారు' అని వెల్లడించింది.

ఇష్యూను పెద్దది చేసేశాడు:అనంతరం ఆమె కొనసాగిస్తూ.. 'రాహుల్ అలా స్టోరీ ఎందుకు పెట్టాడో అర్థం కాలేదు. వాళ్ల ఫొటోలు ఎలా లీక్ అయ్యాయో తెలీదు. అప్పుడు అతడిని మేము అడగలేదు. వాళ్లకూ ఫ్యామిలీ ఉందని ఇష్యూను పెద్దది చేయలేదు. కానీ, రాహుల్ మాత్రం స్టోరీ పెట్టి దీన్ని పెద్దది చేశాడు. అందరిలో డౌట్లు పెంచాడు. దానివల్ల రతికాకు చెడ్డపేరు వచ్చింది' అంటూ ఆవేదన వ్యక్తం చేసింది.
ఆడపిల్లలం.. అలా చేస్తామా:రతికా సోదరి మాట్లాడుతూ.. 'రాహుల్ ఫేం వాడుకోవాలంటే నేరుగా సహాయం అడుగుతుంది కదా. ఇలా ఎందుకు మిస్ యూజ్ చేస్తుంది? ఆ ఫొటోలు మా ఇంటి నుంచి బయటకు రాలేదు. మేము ముగ్గురం ఆడపిల్లలం ఉన్నాం. కావాలని ఎందుుక చేస్తాం. రతికాను బ్యాడ్ చేయాలనే కొంత మంది ఇలా చేస్తున్నారు' అంటూ ముగించింది.


Click it and Unblock the Notifications











