రతికా రోజ్‌తో పల్లవి ప్రశాంత్.. ఆ రొమాంటిగ్ సాంగ్‌కు స్టెప్పులు.. ఇది కదా ట్విస్ట్ అంటే!

బిగ్ బాస్ తెలుగు 7 గురించి అందులో పాల్గొన్న కంటెస్టెంట్లు అందరి గురించి తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు తెలిసిందే. ముఖ్యంగా బిగ్ బాస్ తెలుగు 7 విన్నర్ రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్, ఆయనను ఓ ఆట ఆడుకున్న రతికా రోజ్ గురించి మరింత ఎక్కువగా తెలుసు. వీరిద్దరి మధ్య జరిగిన ప్రతీ సంఘటన అందరికీ గుర్తు ఉండే ఉంటుంది. అయితే బిగ్ బాస్ లో ఉండగా అనేక సార్లు ప్రేమగా ఉండి, అంతకు మించి గొడవలు పెట్టుకున్నారు.

అయితే మొదటి సారి రైతుబిడ్డతో జరిగిన గొడవ వల్లే బయటకు వచ్చేసిన రతికా రోజ్.. నెగిటివిటీని పోగొట్టుకోవడానికి రెండో సారి హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చింది. అనేక సార్లు సారీ చెప్పి ఆ తర్వాత స్నేహంగా ఉండి.. చివరకు వచ్చేటప్పుడు మళ్లీ గొడవ పడింది. ఇక బయటకు వచ్చిన తర్వాత వీరిద్దరూ అసలు కలవలేదు. కానీ తొలిసారి ఓ షోలో పాల్గొని అదిరిపోయే రొమాంటిక్ పాటకు స్టెప్పులు వేశారు. అలాగే ఎప్పటిలాగే రతికా రోజ్ మరోసారి ప్రశాంత్ కు సారీ చెప్పింది. ఆ వివరాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

 Rathika Rose Special Dance Performance With Pallavi Prashanth Chekc Details

రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ తో గొడవ పెట్టుకుని.. ఎంతో నెగిటివిటీని సంపాధించుకున్న రతికా రోజ్ దాన్ని పోగొట్టుకోవడానికి చాలానే ప్రయత్నాలు చేసింది. కానీ ఆమె అవేవీ జరగలేదు. ఇక ఆమె అంతే అని చాలా మంది లైట్ తీసుకున్నారు. ఇప్పుడిప్పుడే బిగ్ బాస్ తెలుగు 7 సీజన్ గురించి, అందులో జరిగిన సంఘటనల గురించి మాట్లాడడం మానేశారు. కానీ తాజాగా బీబీ ఉత్సవం నిర్వహించి బిగ్ బాస్ తెలుగు 7 కంటెస్టెంట్లు అందిరినీ ఒకే స్టేజీపైకి తీసుకు వచ్చారు.

 Rathika Rose Special Dance Performance With Pallavi Prashanth Chekc Details

ముఖ్యంగా ఈషోలో కంటెస్టెంట్లు అంతా పాల్గొనగా.. తొలిసారి రతికా రోజ్ తో కలిసి రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ స్టెప్పులు వేశాడు. ఒకే ఒక్కడు సినిమాలోని రొమాంటిక్ సాంగ్.. ఉట్టి మీద కూడు, ఉప్పుచాప తోడు పాటకు అదిరిపోయే స్టెప్పులు వేశాడు. ఓ కర్రును ఇద్దరి మధ్య పెట్టుకుని మరీ చాలా రొమాంటిక్ స్టెప్పులు వేశారు. ఇది చూసిన ప్రతీ ఒక్కరూ షాక్ అవ్వక తప్పదు. అక్కా, అక్కా అని పిలుస్తూనే.. అదిరిపోయే రొమాంటిక్ సాంగ్ కు స్టెప్పులు వేయడం గమనార్హం.

 Rathika Rose Special Dance Performance With Pallavi Prashanth Chekc Details

ఇక డ్యాన్స్ అయిపోయాకా రతికా రోజ్ మాట్లాడుతూ.. లోపల చిన్న మిస్ అండస్టాండింగ్ వచ్చింది.. మనసులో ఉంటే సారి అంటూ చెప్పుకొచ్చింది. ఇప్పటికే రతికా చాలాసార్లు ప్రశాంత్ కు సారీ చెప్పగా మరోసారి సారీ చెప్పి తనపై ఉన్న నెగిటివిటీనీ పోగొట్టుకునే ప్రయత్నం చేసింది. దీనికి రైతుబిడ్డ తెగ సిగ్గు పడిపోగా.. అంతా నవ్వుకున్నారు. ఈ వీడియోపై ఒక్కొక్కరూ ఒక్కో విధంగా స్పందిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X