పల్లవి ప్రశాంత్ అపరిచితుడు.. కట్టప్పను మించి.. అది నా ఖర్మ.. రతిక రోజ్ ఎమోషనల్ ఇంటర్వ్యూ

బిగ్‌బాస్ తెలుగు 7 రియాలిటీ షోలో అందరూ ఊహించినట్టే రతిక రోజ్ ఇంటి నుంచి బయటకు వెళ్లారు. అయితే బిగ్‌బాస్‌లో హౌస్‌లో అడుగుపెట్టిన తర్వాత మంచి కంటెంట్ ఇచ్చె సెలబ్రిటీగా, గ్లామర్‌తో ఆకట్టుకోనే కంటెస్టెంట్ అనే ఫీలింగ్ కలిగించింది.

అయితే వారాలు గడిచిన కొద్ది పేలవమైన ఫెర్ఫార్మెన్స్‌తో ప్రేక్షకులకు డిస్‌కనెక్ట్ అయింది. ఈ క్రమంలో జరిగిన నామినేషన్‌లో సరైన ఓట్లు సాధించలేక ఎలిమినేట్ అయింది. ఎలిమినేషన్ తర్వాత బిగ్‌బాస్ బజ్‌లో గీతూ రాయల్‌తో రతిక రోజ్ మాట్లాడుతూ..

Geetu Royal

కట్టప్పలా వెన్నుపోటు పొడిచి: బాహుబలి సినిమాలో వెన్నుపోటు పొడిచిన కట్టప్పను మించి పోయావు అని గీతూ అంటే.. నేను ఎవరినీ వెన్నుపోటు పొడవలేదు. నాకు తెలిసి నేను అలా చేయలేదు అని రతిక రోజ్ చెప్పింది. దాంతో రెండు చేతులు కలిస్తేనే చప్పట్లు.. పల్లవి ప్రశాంత్ విషయంలో ముందు చేయి అందించింది నువ్వే అని గీతూ అంటే.. రతిక రోజ్ ఆశ్చర్యం వ్యక్తం చేసింది.

Geetu Royal Rathika Rose

ఎవరినీ వాడుకోలేదు అంటూ: దాంతో రతికను ఉద్దేశించి గీతూ మాట్లాడుతూ... ఇంట్లోనే కాదు.. ఇక్కడ నన్ను కూడా మాన్యుపులేట్ చేస్తున్నట్టు అనిపిస్తున్నది. ఎక్స్ అనే ఎమోషన్స్ బాగా వాడుకొన్నావు. నీకు వాడుకోవడం అలవాటే అని గీతూ పెద్ద ఆరోపణలు చేసింది. దాంతో వాడుకోవాల్సి వస్తే.. ఎప్పుడు వాడుకోవాలో నాకు తెలుసు. కానీ నేను ఎవరిీ వాడుకోలేదు అని రతిక జవాబు చెప్పింది.

 Rathika Rose targets Pallavi Prashanth after Bigg Boss Telugu 7 4th Week Elimination

రతిక రోజ్ ఓ నాగిన్: పల్లవి ప్రశాంత్ నీవల్లే ఉంటున్నాడు అని అమర్ దీప్ చెప్పింది నిజమేనా? అంటే.. ఇంట్లో చాలా విషయాలు జరుగుతుంటాయి. ఒక్క విషయాన్ని బట్టి ఏదీ చెప్పలేం అని రతిక చెప్పింది. కన్నింగ్ స్టార్.. ఫ్లిప్పింగ్ స్టార్ అనే ట్యాగ్‌లను ఆమె ఖండించింది. పాము కంటే రతిక డేంజర్ అని సోషల్ మీడియాలో వచ్చిన ట్రోల్స్‌పై టెన్షన్ పడింది. నా క్యారెక్టర్ అలా ప్రొజెక్ట్ అయితే.. అంతకంటే ఖర్మ ఏమి ఉండదు అని రతిక బాధపడింది.

పల్లవి ప్రశాంత్ అపరిచితుడు: బిగ్‌బాస్ బజ్‌లో భాగంగా ఆడిన గేమ్‌లో రతిక.. పల్లవి ప్రశాంత్ ఫోటోలను కాల్చివేస్తూ కనిపించింది. ప్రశాంత్ రెండు, మూడు రోజుల తర్వాత ఒక్కో యాంగిల్ చూపించడం మొదలుపెట్టాడు. అపరిచితుడిలా వ్యవహరించాడు అని రతిక రోజ్ కామెంట్ చేసింది. తాజా ప్రోమోలో చాలా ఆసక్తికరమైన విషయాలు చర్చించినట్టు కనిపించింది.

ఎలిమినేషన్ తర్వాత రతిక రోజ్: బిగ్‌బాస్‌లో ఆదివారం ప్రసారమైన ఎపిసోడ్‌లో రతిక ఎలిమినేట్ అయినట్టు హోస్ట్ నాగార్జున ప్రకటించాడు. అయితే తాను ఎలిమినేట్ అయ్యాననే విషయాన్ని నమ్మడం పక్కన పెడితే.. జీర్ణించుకోలేకపోయింది. స్టేజ్‌పై తన జర్నీని చూస్తూ కన్నీటి పర్యంతమైంది. ఇంటి నుంచి వెళ్లాలని లేదు అంటూ బాధపడుతూ నాగార్జునను కౌగిలించుకొన్నది. అలా బాధతో రతిక రోజ్ ఇంటి నుంచి బయటకు వచ్చింది. అనంతరం గీతూతో కలిసి బిగ్‌బాస్ తెలుగు బజ్‌లో ముచ్చటించింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X