Bigg Boss 7 Telugu: మరో కంటెస్టెంట్‌తో రతిక ట్రాక్.. ఒకే దాంట్లో ఇద్దరూ.. వీళ్ల సరసాలు తగలెయ్యా!
కొంత మంది సెలెబ్రిటీలను ఒక ఇంట్లో ఉంచి.. వాళ్లకు చిత్ర విచిత్రమైన టాస్కులను ఇచ్చి.. చివరకు ప్రేక్షకుల ఓట్ల ద్వారా విజేతను నిర్ణయించే కాన్సెప్టుతో నడిచే షోనే బిగ్ బాస్. మిగిలిన అన్ని భాషల కంటే తెలుగులోనే ఇది ఎక్కువ రెస్పాన్స్‌ను అందుకుని చాలా సీజన్లను విజయవంతంగా నడుపుకుంది. ఈ క్రమంలోనే నిర్వహకులు కొద్ది రోజుల క్రితమే ఏడో సీజన్‌ను మొదలెట్టారు. ఉల్టా పుల్టా కాన్సెప్టుతో నడిచే ఇది సక్సెస్‌ఫుల్‌గా సాగుతోంది.
బిగ్ బాస్ ఏడో సీజన్‌లోకి 14 మంది సెలెబ్రిటీలు కంటెస్టెంట్లుగా అడుగు పెట్టారు. అందులో కొందరు మాత్రమే స్పెషల్ ఫోకస్ అయ్యారు. అందులో ముందుగా చెప్పుకోవాల్సిన పేరు మాత్రం లోకల్ బ్యూటీ రతికా రోజ్‌దే. బిగ్ బాస్ విన్నర్ రాహుల్ సిప్లీగంజ్ మాజీ ప్రేయసిగా ఫేమస్ అయిన ఈ భామ.. హౌస్‌లోకి అడుగు పెట్టిన తర్వాత తనదైన ప్రజెన్స్‌తో యమ హైలైట్ అవుతోంది.

ముఖ్యంగా రతికా రోజ్ పల్లవి ప్రశాంత్‌తో లవ్ ట్రాక్ నడుపుతున్నట్లు కనిపించి హల్చల్ చేసింది. మొదట్లో హౌస్‌లో ఉండేందుకు కాస్త ఇబ్బంది పడిన అతడితో ఆమె క్లోజ్‌గా మాట్లాడింది. తర్వాత ప్రశాంత్ తన లేడీ లక్ రతికానేనని చెప్పడంతో స్నేహం మొదలైంది. అప్పటి నుంచి వీళ్లిద్దరూ హౌస్‌లో ఎంతో క్లోజ్‌గా ఉంటున్నారు. తర్వాత గొడవలు జరగడంతో దూరం అయ్యారు.
ఈ మధ్యన ప్రశాంత్‌తో రతికా రోజ్ కాస్త ఎడమొహం, పెడమొహంగానే ఉంటోంది. అదే సమయంలో ప్రిన్స్ యావర్‌తో కాస్త క్లోజ్‌గా ఉండేందుకు ప్రయత్నిస్తున్నట్లు కనిపించింది. అలాంటిది గత ఎపిసోడ్‌లో రతికా పవర్ అస్త్ర టాస్క్ కోసం బిగ్ బాస్ సెలెక్ట్ చేసిన ప్రిన్స్ యావర్‌ను అనర్హుడు అంటూ చెప్పి షాకిచ్చింది. దీంతో వీళ్లిద్దరి మధ్య గొడవ జరుగుతుందని అంతా అనుకున్నారు.
ఈరోజు (సెప్టెంబర్ 20) ప్రసారం అయ్యే ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమోను తాజాగా రిలీజ్ చేశారు. ఇందులో రతికా రోజ్.. ప్రిన్స్ యావర్‌ను కొంటెగా చూస్తూ కవ్విస్తున్న విజువల్స్ చూపించారు. ఆ తర్వాత ఇద్దరూ ఒకే ప్లేట్‌లో తిన్నారు. ఈ విషయాన్ని హౌస్‌మేట్స్ అంతా చర్చించుకున్నారు. ముఖ్యంగా శుభశ్రీ 'ప్రిన్స్‌కు వ్యతిరేకంగా ఓట్ వేసి.. ఇప్పుడు అతడితో కలిసి ఒకే ప్లేట్‌లో తింటుంది' అని అందరికీ చెప్పింది.
కిచెన్‌లో ఉన్నప్పుడు సైతం రతికా రోజ్ అందరి ముందే రెచ్చిపోయింది. కన్నార్పకుండా ప్రిన్స్‌ను చూస్తూ అతడిని సైతం టెంప్ట్ చేసేందుకు ప్రయత్నించింది. వీళ్లను అలా చూసిన ప్రశాంత్ 'మీ సరసాలు తగలెయ్యా' అనుకుంటూ వెళ్లిపోయాడు. మరోవైపు, తన పవర్ అస్త్రాన్ని కొట్టేసిన కంటెస్టెంట్‌పై శివాజి ఫైర్ అయ్యాడు. దీంతో అమర్‌దీప్ సైతం యుద్దానికి సిద్దం అన్నట్లు సిగ్నల్ ఇచ్చాడు.


Click it and Unblock the Notifications











