Bigg Boss Telugu7: నా ప్రాపర్టీ అని ఎట్లా అంటావ్... నేను ఎవర్రా బై నీకు... మళ్లీ ప్రశాంత్‌పై రెచ్చిపోయిన రతిక
బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 ఉల్టా పుల్టా అంటూ ఆసక్తికరంగా సాగుతోంది. ఇక నాలుగో వారంలోకి అడుగుపెట్టిన ఈ షో... ఈ వారం నామినేషన్లు ఫుల్ హీటెక్కించేలా సాగుతున్నాయి. నిన్నటి ఎపిసోడ్ లో ముగ్గురు నామినేట్ అవ్వగా... ఈరోజు మరో ముగ్గురు నామినేట్ అయ్యారని తెలుస్తోంది. ఇక తాజాగా ఈ షోకు సంబంధించిన ప్రోమో రిలీజ్ అయింది. ఇక ఈ ప్రోమోలో పల్లవి ప్రశాంత్, గౌతమ్, రతికలా మధ్య వార్ నడిచింది. ఆ వివరాల్లోకి వెళితే...
బిగ్ బాస్ సీజన్ 7 ఆసక్తికరంగా సాగుతోంది. ఇక ఇప్పటికే మూడు వారాలు కంప్లీట్ చేసుకుని.. తాజాగా నాలుగో వారంలోకి అడుగుపెట్టింది ఈ షో. ఇక గతవారం నామినేషన్ల ప్రక్రియ చప్పగా సాగడంతో.. అంతగా ఆకట్టుకోలేకపోయింది. ఇక వీకెండ్ ఎపిసోడ్ లో నాగార్జున సైతం అందరూ సేఫ్ గేమ్ ఆడుతున్నారంటూ కామెంట్స్ చేశారు. ఇక ఈ వారం నామినేషన్ల ప్రక్రియ చూస్తే... హీట్ ఎక్కించేలా ఉంది. హౌజ్ లోని కంటెంస్టెంట్స్ గొడవలతో కొట్టుకునేంత పని చేస్తున్నారు.

బిగ్ బాస్ సీజన్ 7 కు సంబంధించిన ప్రోమో రిలీజ్ అయింది. ఇక ఆ ప్రోమో గమనిస్తే... అందులో పల్లవి ప్రశాంత్... గౌతమ్ ను నామినేట్ చేస్తున్నాడు. ఇక ఆయన అభ్యంతరం ఏంటంటే... శోభా శెట్టితో గొడవ పడినప్పుడు గౌతమ్ షర్ట్ విప్పి తిరగడం నచ్చలేదని చెప్పుకొచ్చాడు ప్రశాంత్. ఇక దానికి రెచ్చిపోయిన గౌతమ్... రతిక వన్ పీస్ డ్రెస్ వేసుకువచ్చినప్పుడు ఏంది ఈ పొట్టి పొట్టి బట్టలు అన్నావా లేదా అని గుర్తు చేశాడు గౌతమ్.

నేను ఆమెకు దొస్తానాలో చెప్పినా... అంటూ పల్లవి ప్రశాంత్ చెబితే... నేను ఎట్లా బట్టలు వేసుకుంటే నీకెందుకు అని రతిక అంటుంది. దానికి ప్రశాంత్ నా దగ్గరకు వచ్చి ఇట్లా ఇట్లా ఎందుకు అన్నావ్ అంటాడు ప్రశాంత్. దానికి రెచ్చిపోయిన రతిక... నోటికి ఏది వస్తే అది వాడకు అంటుంది. ఇక గౌతమ్.. నువ్వు లాస్ట్ వరకు నామినేట్ చేసుకో నా బాడీ నా ఇష్టం నేను షర్ట్ ఇప్పిసే తిరుగుతా అని ప్రశాంత్ కు చెప్తాడు.
ఇక రతిక... నా ప్రాపర్టి అనే వర్డ్ ఎట్లా యూజ్ చేస్తావ్ అంటూ రతిక ఫైర్ అవుతుంది. మజాక్ లో అన్న అంటుంటే మజాక్ లో ఎట్లా అంటావ్ అని రతిక.. ప్రశాంత్ పై విరుచుకుపడుతుంది. అప్పుడెప్పుడో అమర్ దీప్ ప్రశాంత్ పై ఫైర్ అయినప్పుడు రతిక రివర్స్ అయిన విషయం తెలిసిందే. మళ్లీ ప్రశాంత్ కు ఈసారి రివర్స్ అయింది. దానికి కారణం... ముందే సీరియల్ బ్యాచ్ తో రతిక... ప్రశాంత్, యావర్ లను దూరం పెడుతా అంటూ చెప్పుకురావడం అని తెలుస్తోంది.

ఇక అమర్ దీప్ శుభ శ్రీని నామినేట్ చేస్తాడు. ఇక ప్రియాంక, అమర్ దీప్ క్లోజ్ విషయం గురించి మట్లాడుతాడు. అదంతా మా స్ట్రాటజీ.. అందులో సేఫ్ గేమ్ లేదంటూ వెల్లడించాడు. ఈ క్రమంలో శుభ శ్రీ, అమర్ దీప్ కొట్టుకునేంత పని చేశారు. వీరి మధ్య మాటల యుద్దం నడిచింది. ఈ నేపథ్యంలో శుభ శ్రీ కన్నీళ్లు పెట్టుకుంటుంది. ఇంతటితో ప్రోమో ముగుస్తుంది. చూడాలి ఇక ఏం జరగనుందో ఈరోజు ఎపిసోడ్ లో అనేది.


Click it and Unblock the Notifications











