Bigg Boss Telugu 7: రతిక లేడి లక్ కాదట.. శని అంటూ రూటుమార్చిన పల్లవి ప్రశాంత్
బిగ్ బాస్ సీజన్ 7 ప్రారంభం అయి రోజురోజుకు ఆసక్తిగా మారుతోంది. ముఖ్యంగా పల్లవి ప్రశాంత్ వర్సెస్ రతిక వార్ జనాల్లో ఇంట్రెస్టింగ్ గా మారింది. దానికి కారణం వారు మొదట లవ్ ట్రాక్ నడిపి... ఇప్పుడు అక్కా అంటూ పల్లవి ప్రశాంత్ రూటు మార్చాడు. ఇక అంతేనా.. నామినేషన్స్ గొడవలో రతికను లేడి లక్ కాదని... శనిలాగా పట్టుకుందని చెప్పుకువచ్చాడు. ఆరోజు నుంచి తనకు శని చుట్టుకుందని రైతు బిడ్డ అనడంతో నెటిజన్స్ అంతా షాక్ అయ్యారు. ఆ వివరాల్లోకి వెళితే...
బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 సెప్టెంబర్ 3వ తేదీన ప్రారంభం అయిన సంగతి తెలిసిందే. ఇక ఆరోజున 14 మంది కంటెస్టెంట్స్ ఎంటర్ అయ్యారు. ఇక అందులో ఇప్పటికే ముగ్గురు లేడిస్ ఎలిమినేట్ అయ్యారు. కిరణ్ రాథోడ్, షకీలా, దామిని ఎలిమినేట్ అవ్వగా హౌజ్ లో 11 మంది మిగిలారు. ఇక ఇందులో ఆట సందీప్, శివాజీ, శోభా శెట్టి హౌజ్ మెట్స్ గా ఎంపిక అయ్యారు. ఇక మిగిలింది 8 మంది కంటెస్టెంట్స్ గా ఉన్నారు.

అయితే ఆ విషయం పక్కన పెడితే హౌజ్ లో కామన్ మ్యాన్ గా అడుగుపెట్టిన పల్లవి ప్రశాంత్... రతికతో లవ్ ట్రాక్ నడిపిన విషయం తెలిసిందే. వీరు మొదటి వారంలో లవ్ బర్డ్స్ లాగా తిరిగారు. దానికి కారణం షో ప్రారంభం అయిన మొదటి రోజు... హీరో నవీన్ పోలిశెట్టి గెస్టుగా హౌజ్ లోకి అడుగుపెట్టాడు. ఇక అక్కడి వారితో లేడి లక్ అంటూ ఓ గేమ్ ఆడాడు. హౌజ్ లో ఉన్న మేల్ కంటెస్టెంట్స్... ఫీమేల్ కంటెంస్టెంట్స్ ఎవరు మీ లేడి లక్ అని అడిగారు.
అయితే నవీన్ పోలిశెట్టి తెచ్చిన బ్యాండ్స్ ను ఆ లేడి లక్ కు కట్టాలని సూచించాడు. అయితే అందరూ తమ తమ లేడి లక్ ను సెలెక్ట్ చేసుకున్నారు. ఇక పల్లవి ప్రశాంత్ విషయానకిి వచ్చే సరికి లేడి లక్ గా రతికను సెలెక్ట్ చేసుకున్నాడు. నవీన్ అప్పటికీ ఆమెనే ఎందుకు సెలెక్ట్ చేసుకున్నావ్ అని అడిగాడు. దానికి ప్రశాంత్... ఆమె నేను ఇంట్లోకి రాగానే బాగా మాట్లాడింది. అంతే కాదు.. ఆమె ఫ్యామిలీ సైతం రైతు ఫ్యామిలీ అంటూ చెప్పుకువచ్చాడు.
అలా రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్... రతికకను దగ్గరయ్యాడు. హౌజ్ లో వారు మాట్లాడుకోవడం... సరదా సరదాగా తిరగడం స్టార్ట్ చేశారు. ప్రతి సీజన్ లో లాగానే ఈ సీజన్ లో కూడా లవ్ ట్రాక్ ఇదే అని ప్రేక్షకులు అనుకున్నారు. ఇక సడెన్ గా రతిక నామినేషన్స్ లో ప్రశాంత్ పై విరుచుకుపడింది. దీంతో ప్రేక్షకులు షాక్ అయ్యారు. వీరి మధ్య గొడవలు స్టార్ట్ అయ్యాయి. రతిక వర్సెస్ ప్రశాంత్ అనేలా రెండో వారం గడిచింది. అయితే సారీ చెప్పాడనే ఉద్దేశంతో మళ్లీ మాట్లాడుకోవడం స్టార్ట్ చేశారు.
ఇక నిన్న నామినేషన్స్ లో భాగంగా ప్రశాంత్... గౌతమ్ ను నామినేట్ చేశాడు. అమ్మాయి ముందు చొక్కా విప్పడం తప్పు అంటూ అదే కారణంతో నామినేట్ చేశాను అని చెప్పుకు వచ్చాడు. ఇక నేను షర్ట్ విప్పితే నీకెంటి అని అంటూ రతికను మధ్యలో ఇన్ వాల్వ్ చేశాడు. దీంతో రతిక వర్సెస్ ప్రశాంత్ పంచాయితీగా మారిపోయింది. నేను ఏ బట్టలు వేసుకుంటే నీకెంటి... అంటూ రతిక ప్రశాంత్ పై విరుచుకుపడింది.
సారీ చెప్పాడు కదా మాట్లాడుతుంటే... ఏయ్ అంటూ పిలుస్తున్నాడు అంటూ రతిక ఫైర్ అయింది. ఇకపై నిన్న అక్క అని పిలుస్తా అని ప్రశాంత్ చెప్పుకు వచ్చాడు. ఇది చూసిన నెటిజన్స్ షాక్ అయ్యారు. ఇక నామినేషన్స్ తర్వాత కూడా మళ్లీ పంచాయితీ కావడంతో... రతిక నా లేడి లక్ కాదు.. అది కట్టుకున్నప్పటి నుంచి శని చుట్టుకుందని ప్రశాంత్ చెప్పాడు. ఇక లవ్ ట్రాక్ నడిపి.. తర్వాత గొడవ పడి.. ఇప్పుడు అక్క అంటూ... లేడి లక్ కాదు శని అనడం.. ఇన్ని సార్లు రూటు మార్చడంతో పల్లవి ప్రశాంత్ ను క్యారెక్టర్ ఇలా ఉందేంటి అనుకుంటున్నారు నెటిజన్స్.


Click it and Unblock the Notifications











