Bigg Boss Telugu 7 Rathika: రతికకి బిగ్ బాస్ అన్యాయం.. షాకింగ్ కామెంట్స్
బిగ్ బాస్ సీజన్ 7 నాలుగు వారాలు పూర్తి చేసుకుని ఏడో వారంలో అడుగుపెట్టింది. ఇక ఈ సీజన్ అంతా ఉల్టా పుల్టా ఉంటుందని చెప్పుకువచ్చారు. అందుకు తగ్గట్లుగానే ఈ సీజన్ సాగుతోంది. ఇక నాలుగోవారంలో రతిక రోజ్ ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే. ఇక ఆమెపై నెగిటివిటీ ఎక్కువ కావడంతో... ఎలిమినేట్ అయిపోయిందని చెబుతున్నారు. ఇక ఆ విషయం పక్కన పెడితే.. బిగ్ బాస్ హౌజ్ నుంచి బయటకు వచ్చిన రతిక...తన ఇన్ స్టాగ్రామ్ వేదికగా తొలి రియాక్షన్ ఇచ్చింది. ఆమె ఏం చెప్పిందో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
రతికా రోజ్... ఈ పేరు బిగ్ బాస్ తెలుగు సీజన్ 7కి ముందు ఎవరికి తెలియదు. ఎప్పుడైతే బిగ్ బాస్ హౌజ్ లోకి అడుగుపెట్టిందో... ఆరోజే.. ఈమె కచ్చితంగా టాప్ 5 కంటెస్టెంట్స్ లో నిలుస్తుందని అంతా భావించారు. ఇక హౌజ్ లోకి అడుగుపెట్టడంతో అందరి దృష్టిని ఆకర్షించింది ఈ బ్యూటీ. అటు కామన్ మ్యాన్ గా ఎంటర్ అయిన పల్లవి ప్రశాంత్ తో ప్రేమాయణం నడిపి... ఆ తర్వాత రివర్స్ అవ్వడం.. మళ్లీ యావర్ తో లవ్ ట్రాక్... మళ్లీ హ్యాండ్ ఇవ్వడం... ఇదంతా జనాల్లో ఆమెకు నెగిటివిటీ తీసుకువచ్చింది.

ప్రశాంత్ పై టార్గెట్.. :ఆ తర్వాత సీరియల్ బ్యాచ్ తో కలిసి... ఈమె బ్రెయిన్ యూజ్ చేయకుండా వాళ్లు చెప్పింది చేసుకుంటూ వెళ్లింది. ముఖ్యంగా ప్రశాంత్ ను టార్గెట్ చేసి... పర్సనల్ దాడికి దిగింది. ప్రశాంత్ పవర్ అస్త్ర పోటీల్లో ఉన్నప్పుడు... మరీ దారుణంగా బిహేవ్ చేసింది ఈ బ్యూటీ. నోటికి వచ్చింది మాట్లాడుతూ.. మరింత నెగిటివిటీని మూటగట్టుకుంది. ఇక అమర్ దీప్ తో కలిసి... ప్రశాంత్ పై సిగ్గందా... తలకాయలో మన్ను మశానం ఉందంటూ.. ఇంట్లో వాళ్లు ఇలాగే పెంచారా అంటూ పర్సనల్ దాడి చేసింది.

నెగిటివిటీ... :దీనితో ఆడియెన్స్ లో రతికపై నెగిటివ్ ఇంప్రెషన్ పడిపోయింది. ఆమెపై ఎక్కడ చూసిన ట్రోలింగే. మరోవైపు తన ఎక్స్ బాయ్ ఫ్రెండ్ రాహుల్ సిప్లిగంజ్ పేరును వాడోకోవడం... రాహుల్ తన ఇన్ స్టావేదికగా స్పందించి.. రియాక్షన్ ఇవ్వడం కూడా ఆమెకు మైనస్ గా మారిపోయింది. ఇక బిగ్ బాస్ కూడా ఈమె ఉండటం అంత మంచిది కాదనుకున్నాడేమో... నాలుగోవారంలో పెద్ద షాక్ ఇచ్చాడు. టైటిల్ ఫేవరెట్స్ లో ఉండాల్సిన తనను ఎలిమినేట్ చేసి.. ఊహించని దెబ్బ కొట్టాడు బిగ్ బాస్.

ఫస్ట్ రియాక్షన్... :అయితే ఎలిమినేషన్ తర్వాత రతిక తన ఫస్ట్ రియాక్షన్ ఇన్ స్టాగ్రామ్ వేదికగా చెప్పుకువచ్చింది. బిగ్ బాస్ నుంచి వెళ్లిపోయాక తన ఇన్ స్టాగ్రామ్ లో స్టోరీ పోస్ట్ చేసింది. అందులో థ్యాంక్యూ ఎవ్రీ వన్... డోంట్ జడ్జ్ ఏ బుక్ బై ఇట్స్ కవర్ (దేర్ వజ్ మచ్ మోర్ దేన్ వాట్ వు సా) అంటూ రాసుకువచ్చింది. అంటే షో లో తనను చూసి మీరు ఓ అంచనాకు రావొద్దు.. హౌజులో చూసిన దానికంటే మీకు తెలియాల్సింది చాలా ఉంది అంటూ రతిక పోస్ట్ చేసింది.

బిగ్ బాస్ అన్యాయం... :అయితే ఈ పోస్టు చూసిన నెటిజన్స్... బిగ్ బాస్ తనకు అన్యాయం చేశారని... అందుకే నేరుగా చెప్పలేక.. ఇలా పరోక్షంగా పోస్ట్ పెట్టినట్లు నెటిజన్స్ భావిస్తున్నారు. మరి నిజంగానే తనకు బిగ్ బాస్ అన్యాయం చేశాడు.. కావాలని ఆమెను నెగిటివ్ పోట్రెట్ చేశాడా.. కొద్ది రోజులు ఆగితే కానీ ఈ విషయాలు బయటకు రావేమో.. ఇక రతిక ఎలిమినేట్ కావడంతో.. హౌజ్ కేవలం ఇప్పుడు 10 మంది మాత్రమే ఉన్నారు. అందులో శివాజీ పవర్ అస్త్ర వెనక్కిపోవడంతో.. ముగ్గురు హౌజ్ మేట్స్ గా ఉండగా.. 7 మంది కంటెస్టెంట్స్ ఉన్నారు.


Click it and Unblock the Notifications











