»   » మీలో ఎవరు కోటీశ్వరుడు: ఆ మొత్తం దానం చేసాడు!

మీలో ఎవరు కోటీశ్వరుడు: ఆ మొత్తం దానం చేసాడు!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: నాగార్జున హోస్ట్ గా మాటీవీలో ప్రసారం అవుతున్న ‘మీలో ఎవరు కోటీశ్వరుడు' ఎంత పాపులర్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. చిన్న, పెద్ద తేడా లేకుండా అన్ని వర్గాల నుండి ఈ షోకు మంచి ఆదరణ లభిస్తోంది. ఇటీవల ఈ షోలో పాల్గొన్న ఓ 60 సంవత్సరాల వ్యక్తి తాను గెలిచిన 25 లక్షలను స్వచ్ఛంద సంస్థలకు దానం చేయడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.

నిజామాబాద్ జిల్లాకు చెందిన రావణ శర్మ అనే వ్యక్తి తను గెలిచిన రూ. 25 లక్షల్లో రూ. 20 లక్షలు స్వచ్ఛంద సంస్థల పేరుపై ఫిక్డ్స్ డిపాజిట్ చేసారు. మిగిలిన 5 లక్షలు తాను కష్టాల్లో ఉన్న సమయంలో సహాయం చేసిన ఒక మాతృమూర్తి పేరిట ఫిక్డ్స్ డిపాజిట్ చేసాడు. రావణ శర్మ గతం..... ఆయన ఎదుర్కొన్న పరిస్థితులు విని షో చూస్తున్న ప్రేక్షకులు చలించిపోయారు.

Ravan Sharma 25 Lacks in MEK

కర్నూలు జిల్లాకు చెందిన ఆయన కొన్నేళ్ల క్రితం ఎల్లారెడ్డి మండలం లింగారెడ్డిలో స్థిరపడ్డారు. ఆయన ఉద్యోగం నుండి రిటైర్ అయ్యాక వచ్చిన డబ్బులు అప్పలు, ఇతర అవసరాలకు ఖర్చు అయిపోయాయి. అయినవారు ఆదరించక పోవడంతో స్నేహితుల సహాయంతో ఒంటరి జీవితం సాగిస్తున్నరు. తన టాలెంటుతో మీలో ఎవరు కోటీశ్వరుడులో అవకాశం దక్కించుకున్న శర్మ....తనకు వచ్చిన రూ. 25 లక్షల్లో... 10 లక్షలు శ్రీవిద్యా సెంటర్ ఫర్ మెంటల్లీ రిటార్టెడ్ పర్సన్స్ సంస్థకు, మరో రూ. 10 లక్షలు నేషనల్ అసోసియేషన్ ఫర్ బ్లైండ్ సంస్థపేరిట డిపాజిట్ చేసారు.

English summary
Ravan Sharma Quits MEK Season 3 Episode 12 winning 25 Lacks.
Please Wait while comments are loading...