RAVANASURA: రవితేజకు బిగ్ షాక్.. చిన్న సినిమాల కంటే తక్కువగా!
తెలుగు చిత్ర పరిశ్రమలో ఫలితాలతో ఏమాత్రం సంబంధం లేకుండా సినిమాలు చేసే హీరోలు చాలా తక్కువ మందే ఉన్నారు. అందులో మాస్ మహారాజా రవితేజ ఒకడు. కెరీర్ ఆరంభం నుంచీ ఇదే విధంగా దూసుకుపోతోన్న ఈ స్టార్ హీరో.. ఏడాదికి కనీసం రెండు, మూడు సినిమాలతో వచ్చి ప్రేక్షకులను అలరిస్తున్నాడు. ఇలా ఈ ఏడాది ఆరంభంలో 'వాల్తేరు వీరయ్య'తో వచ్చి మరో హిట్‌ను కూడా ఖాతాలో వేసుకున్నాడు. ఈ క్రమంలోనే కొద్ది రోజుల క్రితమే రవితేజ 'రావణాసుర' అనే క్రైమ్ థ్రిల్లర్ మూవీతో ఆడియెన్స్ ముందుకు వచ్చాయి.
మాస్ మహారాజా రవితేజ హీరోగా సుధీర్ వర్మ తెరకెక్కించిన క్రైమ్ థ్రిల్లర్ మూవీనే 'రావణాసుర'. విడుదలకు ముందే భారీ అంచనాలను ఏర్పరచుకున్న ఈ చిత్రానికి ఊహించని విధంగా మిక్స్‌డ్ టాక్ వచ్చింది. దీంతో తెలుగు రాష్ట్రాల్లో దీనికి చాలా తక్కువ కలెక్షన్లు వచ్చాయి. ఇలా ఫుల్ రన్‌లో ఈ సినిమా రూ. 12 కోట్లు వరకూ షేర్‌తో పాటు రూ. 21 కోట్లు వరకూ గ్రాస్‌ను వసూలు చేసింది. ఫలితంగా రూ. 23.00 కోట్లు టార్గెట్‌తో బరిలోకి దిగిన రవితేజ సినిమా.. ఏకంగా రూ. 11 కోట్లకు పైగానే నష్టాలను ఎదుర్కొని డిజాస్టర్‌గా మిగిలింది.

థియేటర్లలో ఆశించిన రీతిలో సందడి చేయలేకపోయిన మాస్ మహారాజా రవితేజ 'రావణాసుర' మూవీ.. ఓటీటీలోనూ పెద్దగా రాణించలేదు. ఈ క్రమంలోనే కొద్ది రోజుల క్రితమే ఈ చిత్రం జీ తెలుగులో వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్‌గా ప్రదర్శితం అయింది. అక్కడ కూడా దీనికి ప్రేక్షకుల నుంచి తక్కువ స్పందనే లభించింది. ఫలితంగా ఈ చిత్రానికి అర్బన్ ఏరియాలో 4.61 రేటింగ్ దక్కింది. అలాగే, అర్బన్ ప్లస్ రూరల్ ఏరియాలకు సంబంధించి ఏకంగా 4.29 టీఆర్పీ రేటింగ్ వచ్చింది. ఈ మధ్య కాలంలో చిన్న సినిమాల కంటే తక్కువ రేటింగే అని చెప్పాలి.
ఇదిలా ఉండగా.. రవితేజ - సుధీర్ వర్మ కలయికలో తెరకెక్కిన 'రావణాసుర' సినిమాను పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్లపై టీజీ విశ్వ ప్రసాద్ నిర్మించారు. దీనికి హర్షవర్ధన్ రామేశ్వర్, భీమ్స్ సంగీతం ఇచ్చారు. ఇందులో అను ఇమాన్యూయేల్, మీనాక్షి చౌదరి, ఫరియా అబ్ధాల్లా, దక్ష, పూజితలు కీలక పాత్రల్లో నటించగా.. సుశాంత్ మరో కీ రోల్ చేశాడు.


Click it and Unblock the Notifications











