Bigg Boss 5 సీక్రెట్ లీక్ చేసిన సీరియల్ హీరోయిన్: మాజీ కంటెస్టెంట్‌తో కలిసి రచ్చ.. లోపల జరిగేది ఇదే

బిగ్ బాస్.. తెలుగు ప్రేక్షకులకు ఆలస్యంగా పరిచయం అయినా.. అదిరిపోయే రెస్పాన్స్‌ను అందుకుని సక్సెస్‌ అయిన రియాలిటీ షో. ఒకటి కాదు.. రెండు కాదు విజయవంతంగా నాలుగు సీజన్లను పూర్తి చేసుకున్న ఇది.. ఇండియన్ టెలివిజన్ రికార్డులను తిరగ రాసింది. అలాగే, ఎంతో మందిని బిగ్ సెలెబ్రిటీలుగా మార్చేసింది. ఈ క్రమంలోనే ఐదో సీజన్ కూడా త్వరలో ప్రారంభం కాబోతుంది. ఇలాంటి పరిస్థితుల్లో సీరియల్ హీరోయిన్ నవ్య స్వామి, మాజీ కంటెస్టెంట్ అయిన రవికృష్ణతో కలిసి బిగ్ బాస్ సెట్ దగ్గర దిగిన ఫొటో ఒకటి బయటకు వచ్చింది. ఆ సంగతులు మీకోసం!

మన షో.. నేషనల్ లెవెల్‌లో ట్రెండ్

మన షో.. నేషనల్ లెవెల్‌లో ట్రెండ్

తెలుగులో బిగ్ బాస్ షో ఎంత సక్సెస్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పటి వరకూ నాలుగు సీజన్లు జరగగా.. అన్నింటికీ ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో రెస్పాన్స్ వచ్చింది. దీంతో ఏ ఏడాదికి ఆ ఏడాది టీఆర్పీ రికార్డులు క్రియేట్ చేసింది. ఈ క్రమంలోనే నాలుగో సీజన్ ప్రీమియర్ ఎపిసోడ్‌కు 18 పైచిలుకు రేటింగ్ దక్కింది. దీంతో టీఆర్పీలో జాతీయ స్థాయి రికార్డులు సృష్టించింది.

 ఐదో సీజన్‌కు అడ్డంకి... కష్టమేనని

ఐదో సీజన్‌కు అడ్డంకి... కష్టమేనని

ఐదేళ్ల క్రితం తెలుగులో ప్రారంభం అయినప్పటి నుంచి ప్రతి ఏడాదీ బిగ్ బాస్ షో ప్రసారం అవుతోంది. ఈ క్రమంలోనే ఇప్పుడు ఐదో సీజన్‌కు సమయం ఆసన్నమైంది. అయితే, ప్రస్తుత పరిస్థితుల్లో ఈ షో మొదలయ్యేది సందేహమే అని టాక్ వినిపించింది. అంతేకాదు, ఈ ఏడాది బిగ్ బాస్ షో ఉండదు అని కూడా పుకార్లు షికార్లు చేశాయి. దీంతో షో ఫ్యాన్స్ తెగ నిరాశకు లోనయిపోయారు.

షో కన్ఫార్మ్... అప్పటి నుంచేనంట

షో కన్ఫార్మ్... అప్పటి నుంచేనంట

ఎన్నో అనుమానాలు వస్తున్నా.. ఐదో సీజన్ ఎట్టి పరిస్థితుల్లో ఈ సారి కూడా ఉంటుందని క్లారిటీ వచ్చేసింది. ఈ క్రమంలోనే దీని ప్రారంభ తేదీ కూడా ఆ మధ్య బయటకు వచ్చింది. దీని ప్రకారం.. ఈ సీజన్ సెప్టెంబర్ 5వ తేదీ ఆదివారం సాయంత్రం నుంచి ప్రారంభం కాబోతుందట. ఐదో సీజన్‌కు సంబంధించిన లోగో ఆగస్టులో.. అలాగే ప్రోమో ఆగస్టు 29న విడుదల కానుందని సమాచారం.

 కంటెస్టెంట్ల ఎంపిక.. ఎవరు వస్తారు?

కంటెస్టెంట్ల ఎంపిక.. ఎవరు వస్తారు?

ప్రస్తుతం పరిస్థితులు బాగోకపోయినా బిగ్ బాస్ ఐదో సీజన్ కోసం కంటెస్టెంట్ల ఎంపిక ప్రక్రియ మాత్రం కొనసాగుతూనే ఉందని మరో న్యూస్ వైరల్ అవుతోంది. దాదాపు వంద మంది ప్రముఖుల్లో ఇటీవలే షార్ట్ లిస్ట్ తయారు చేశారని అంటున్నారు. వీరితో జూమ్ కాల్ ద్వారా ఇంటర్వ్యూలు జరుపుతున్నారని తెలిసింది. ఈ క్రమంలోనే కొందరి పేర్లు కూడా ఒక్కక్కొటిగా లీక్ అవుతున్నాయి.

 సీక్రెట్ లీక్ చేసిన సీరియల్ హీరోయిన్

సీక్రెట్ లీక్ చేసిన సీరియల్ హీరోయిన్

నాలుగు సీజన్ల ద్వారా మజాను అందించిన బిగ్ బాస్‌ షోకు రెట్టించిన రెస్పాన్స్ వస్తోంది. దీంతో ఐదో సీజన్ గురించి తెలుగు ప్రేక్షకుల ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో దీని గురించి ఏ న్యూస్ వచ్చినా వైరల్ అవుతోంది. ఈ నేపథ్యంలో సీరియల్ హీరోయిన్ నవ్య స్వామి తన సోషల్ మీడియా ఖాతాలో బిగ్ బాస్ సెట్ ముందు దిగిన ఓ ఫొటో బయటకొచ్చింది.

Recommended Video

Nanda Kishore, Ushasri Exclusive Interview Part 4 | Narasimhapuram
మాజీ కంటెస్టెంట్‌తో కలిసి రచ్చ చేసి

మాజీ కంటెస్టెంట్‌తో కలిసి రచ్చ చేసి


నవ్య స్వామి షేర్ చేసినట్లు చెబుతోన్న ఓ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో ఆమెతో పాటు మాజీ కంటెస్టెంట్ రవికృష్ణ, మరొకరు కూడా ఉన్నారు. ఇక, బ్యాగ్రౌండ్‌లో బిగ్ బాస్ సెట్ ఫొటో కనిపిస్తోంది. అందులో వర్కర్లు పని చేస్తున్న దృశ్యాలు కూడా కనిపిస్తున్నాయి. అయితే, ఇది ఎప్పటి ఫొటో అన్నది క్లారిటీ లేదు. కానీ, ఐదో సీజన్‌ సెట్టే అని ప్రచారం జరుగుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X