నవ్యస్వామితో పెళ్లిపై పెదవి విప్పిన రవికృష్ణ.. అప్పుడు రొమాన్స్ అందుకే చేశానంటూ!

చాలా భాషల మాదిరిగానే తెలుగు గ్లామర్ ఫీల్డులో కూడా లవ్ ట్రాకులు బాగానే హైలైట్ అవుతున్నాయి. మరీ ముఖ్యంగా బుల్లితెరపై సైతం ఎంతో మంది లవ్ ట్రాకులతో హైలైట్ అవుతున్నారు. అలాంటి వారిలో టెలివిజన్ సెలెబ్రిటీలు నవ్య స్వామి, రవికృష్ణ జంట కూడా ఒకటి.. ఆ మధ్య ఓ సీరియల్‌లో కలిసి నటించిన వీళ్లిద్దరూ ప్రేమలో ఉన్నారని ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నాయి. అందుకు అనుగుణంగానే వీళ్లిద్దరూ తరచూ కలిసే కనిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా రవికృష్ణ.. నవ్య స్వామితో పెళ్లిపై క్లారిటీ ఇచ్చాడు. ఆ పూర్తి వివరాలేంటో మీరే చూడండి!

అలా వచ్చిన నవ్యస్వామి
నవ్య స్వామి మోడల్‌గా కెరీర్‌ను ఆరంభించి యాక్టింగ్ వైపు వచ్చింది. మొదట్లో కన్నడంలో పలు సీరియల్స్ చేసి ఫేమస్ అయింది. అక్కడ ఎన్నో ధారావాహికల్లో నటించిన ఆమె.. 'తన్‌గాలి'తో విశేషమైన గుర్తింపును అందుకుంది. అలా దక్షిణాదిలో ఫుల్ పాపులర్ అయిపోయింది. ఈ క్రమంలోనే తెలుగులోకి కూడా ఎంట్రీ ఇవ్వడంతో పాటు ఆరంభంలోనే యమా పేరు తెచ్చుకుంది.

Ravi Krishna Gives Clarity On Marriage With Navya Swamy

రవికృష్ణ ఇలా పాపులర్

రవికృష్ణ చిన్న చిన్న పాత్రలు చేసుకుంటూ కెరీర్‌ను ఆరంభించాడు. ఈ క్రమంలోనే 'మొగలిరేకులు' సీరియల్‌లో నటించి గుర్తింపు అందుకున్నాడు. ఆ తర్వాత వరుసగా సూపర్ హిట్ సీరియల్స్‌లో నటిస్తూ ఫేమస్ అయ్యాడు. ఇక, 'వరూధినీ పరిణయం'తో హీరోగా మారడంతో పాటు ఎనలేని క్రేజ్‌ను సంపాదించుకున్నాడు. ఆ తర్వాత సీరియల్ హీరోగా పాపులర్ అయ్యాడు.

జంటగానే ఫుల్ హైలైట్
నవ్యస్వామి, రవికృష్ణ కలిసి 'ఆమె కథ' అనే సీరియల్‌లో జంటగా నటించారు. అప్పటి నుంచి వీళ్లిద్దరూ ప్రేమలో ఉన్నారని చాలా రోజులు ప్రచారం జరుగుతోంది. అంతేకాదు, వీళ్లిద్దరూ త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నారని ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నాయి. దీంతో రవికృష్ణ - నవ్యస్వామిని చాలా కాలంగా జంటగానే చూస్తున్నారు. ఇలా వీళ్లు హాట్ టాపిక్ అయ్యారు.

Ravi Krishna Gives Clarity On Marriage With Navya Swamy

అలా రచ్చ.. సినిమాల్లో

బుల్లితెరపై చాలా కాలం పాటు సత్తా చాటిన నవ్య స్వామి, రవికృష్ణ క్రేజ్‌ను పలు షోల నిర్వహకులు బాగానే క్యాష్ చేసుకున్నారు. ఇలా గతంలో ఎన్నో షోలలో జంటగా రొమాన్స్‌ను సైతం పండించారు. ఆ తర్వాత వీళ్లిద్దరూ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. అలా చాలా చిత్రాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా గడుపుతున్నారు. ముఖ్యంగా రవి 'విరూపాక్ష' తర్వాత ఫుల్ బిజీ అయ్యాడు.

Ravi Krishna Gives Clarity On Marriage With Navya Swamy

నవ్యస్వామిపై క్లారిటీగా
గతంలో మాదిరిగా ఇప్పుడు బుల్లితెరపై కనిపించకపోవడంతో రవికృష్ణ, నవ్యస్వామి లవ్ ట్రాక్ గురించి పెద్దగా వార్తలు రావడం లేదు. దీంతో వీళ్ల గురించి చర్చలు కూడా జరగడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా రవికృష్ణ ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా నవ్యస్వామి గురించి యాంకర్ ప్రశ్నించడంతో ఆమె తనకు బెస్ట్ ఫ్రెండ్ మాత్రమే అని స్పష్టం చేశాడు.

Ravi Krishna Gives Clarity On Marriage With Navya Swamy

అవన్నీ షో కోసమే అని

ఆ తర్వాత రవికృష్ణ కొనసాగిస్తూ.. 'నేను గతంలో నవ్యస్వామితో షోలలో చేసినవి అన్నీ స్కిట్లు మాత్రమే. వాస్తవానికి మా ఇద్దరి మధ్యా అలాంటి రిలేషన్ అయితే లేదు. మా వరకూ మాకు ఆ విషయంలో చాలా క్లారిటీ ఉంది. కానీ, చాలా మంది మా గురించి ఏవేవో అనుకున్నారు' అని చెప్పుకొచ్చాడు. తద్వారా తమ మధ్య లవ్ లాంటిది ఏమీ లేదని రవికృష్ణ తేల్చి చెప్పేశాడు.

More from Filmibeat

Read more about: navya swamy ravi krishna
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X