For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  తమన్నా వల్లే రవికృష్ణకు గాయం.. నూతన్ నాయుడు ముందే చెప్పాడు.. ‘బిగ్ బాస్’లో కలకలం

  |
  Bigg Boss lo Yavariki Apada -- Bigg Boss Telugu 3 --Nutan Naidu

  ట్రాన్స్‌జెండర్ తమన్నా సింహాద్రి వైల్డ్ కార్డ్ ద్వారా ఎంటరైన తర్వాత 'బిగ్ బాస్' రియాలిటీ షోలో ఎన్నో ఊహించని సంఘటనలు జరుగుతున్నాయి. ఇంట్లోకి అడుగు పెట్టినప్పటి నుంచి ఆమె వ్యవహరిస్తున్న తీరుకు కంటెస్టెంట్లతో పాటు షో నిర్వహకులు షాకైపోతున్నారు. అలాగే, షోను వీక్షించే ప్రేక్షకులు సైతం అవాక్కయిపోతున్నారు. ఇక, ఈ వారం నామినేషన్ ప్రక్రియ నుంచి ఆమెలోని వికృతత్వం మరింత బయటకు వచ్చింది. ఈ నేపథ్యంలో గత సీజన్ కంటెస్టెంట్ నూతన్ నాయుడు చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశం అవుతున్నాయి.

  నూతన్ నాయుడు చానెల్

  నూతన్ నాయుడు చానెల్

  ‘బిగ్ బాస్' సీజన్ - 2లో కామన్ మ్యాన్‌గా కంటెస్ట్ చేశాడు నూతన్ నాయుడు. ఆ సీజన్‌లో త్వరగానే ఎలిమినేట్ అయిపోవడం.. తర్వాత ప్రేక్షకులు వేసిన ఓట్ల ద్వారా తిరిగి ఇంట్లోకి రావడం.. అనంతరం గాయంతో వెళ్లిపోవడం.. మళ్లీ ఎలిమినేట్ అవ్వడం ఇలా ఆయన చర్చనీయాంశం అయ్యాడు. ఇప్పుడు మాత్రం యూట్యూబ్‌లో చానెల్ ఓపెన్ చేసి హాట్ టాపిక్ అవుతున్నాడు.

  ఏది చెబితే అదే జరుగుతోంది

  ఏది చెబితే అదే జరుగుతోంది

  నూతన్ నాయుడు తన యూట్యూబ్ చానెల్ ద్వారా ఎన్నో విషయాలను పంచుకుంటున్నాడు. అతడు ఏం చెబుతున్నాడో.. షోలో అదే జరుగుతోంది. ఇప్పటికి చాలా విషయాల్లో అతడి జోస్యం నిజమైంది. దీంతో ఈ చానెల్‌ను ఫాలో అయ్యే వారి సంఖ్య క్రమ క్రమంగా పెరిగిపోతోంది. ఈ క్రమంలో మరిన్ని వీడియోలతో వస్తున్నాడు.

  కంటెస్టెంట్ల లిస్ట్ వంద శాతం చెప్పాడు

  కంటెస్టెంట్ల లిస్ట్ వంద శాతం చెప్పాడు

  ‘బిగ్ బాస్' సీజన్ - 3 ప్రారంభానికి ఒకరోజు ముందు ఈ చానెల్ ద్వారా ఎవరెవరు కంటెస్టెంట్లుగా వస్తున్నారన్న విషయంపై క్లారిటీ ఇచ్చాడు. ఈ మేరకు విడుదల చేసిన వీడియోలు కొన్ని పేర్లు కూడా బయట పెట్టాడు. ఆయన ఏ పేర్లైతే చెప్పాడో కచ్చితంగా వాళ్లే హౌస్‌లోకి ఎంటరయ్యారు. ఆ తర్వాత వచ్చిన వీడియోల్లో కూడా అలాగే జరిగింది.

  పరిస్థితి చేయి జారిపోయింది

  ఇక, తాజాగా నూతన్ నాయుడు ఓ వీడియోను విడుదల చేశాడు. తమన్నా - రవికృష్ణ వ్యవహారాన్ని ఉద్దేశించి ‘ఒక హౌస్ మేట్‌ను నేను బిగ్ బాస్ హౌస్‌లో ఉన్నాను కాబట్టి.. అక్కడ పరిస్థితులపై నాకు అవగాహన ఉంది. ప్రస్తుతం షోని గమనిస్తే పరిస్థితి చేయిజారిపోయినట్టు కనిపిస్తోంది. ఏ క్షణాన ఏం జరుగుతుందో చెప్పలేని పరిస్థితి నెలకొంది' అని అందులో పేర్కొన్నాడు.

   గాయం అవుతుంది

  గాయం అవుతుంది

  రవికృష్ణకు బుధవారం జరిగిన ఎపిసోడ్‌లో గాయం అయిన విషయం తెలిసిందే. దీన్ని నూతన్ ముందుగానే చెప్పాడు. ‘తమన్నా మానసిక స్థితి వల్ల హౌస్‌లో ఉన్న వారిపై ఆమె భౌతిక దాడికి పాల్పడే అవకాశం ఉంది. ఓ సైకాలజిస్ట్‌గా నేను గమనించింది ఏంటంటే.. ఖచ్చితంగా హౌస్‌లో దాడి జరిగే అవకాశం ఉంది. ఎదుటి వ్యక్తులపై దాడి చేయడం కాని.. లేదంటే మానసిక స్థిరత్వం కోల్పోయి తమకు తాము హాని చేసుకోవడం గాని జరగొచ్చు. ముఖ్యంగా తమన్నా- రవిక్రిష్ణల మధ్య ఇది జరగొచ్చు' అని వివరించాడు.

  బిగ్ బాస్‌కు హెచ్చరిక

  బిగ్ బాస్‌కు హెచ్చరిక

  ఈ విషయమై నూతన్ నాయుడు ‘బిగ్ బాస్' షో నిర్వహకులను ముందుగానే అలెర్ట్ చేశాడు. ‘హౌస్‌లో భౌతిక దాడి జరిగే అవకాశం ఉంది. అందుకే బిగ్ బాస్ మీరు హెల్త్ టీం అలర్ట్ చేసి ఉంచండి.. ఎమర్జెన్సీని యాక్టివేట్ చేసి ఉంచండి. జాగ్రత్తగా వ్యవహరించకపోతే పరిస్థితి దారుణంగా ఉంటుంది' అని నూతన్ హెచ్చరించాడు.

  English summary
  Big boss reality show Full success in Telugu Television History. Two seasons succesfully completed. And season 3 Started 21st july. This season Was Host By Akkineni Nagarjuna.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X