For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  నవ్యసామితో కలిసి రవికృష్ణ రచ్చ: బయటికొచ్చిన జంట ఫొటో.. ఆ ఒక్క దానితో పెరిగిన డౌట్స్

  |

  బుల్లితెరపైకి నటుడిగా ఎంట్రీ ఇచ్చిన చాలా తక్కువ సమయంలోనే.. అద్భుతమైన యాక్టింగ్‌తో మంచి నటుడిగా పేరు సంపాదించుకున్నాడు హ్యాండ్సమ్ గాయ్ రవికృష్ణ. ఆరంభంలో సపోర్టింగ్ ఆర్టిస్టుగా చేసిన అతడు.. ఆ తర్వాత సోలో హీరోగా మారాడు. ఈ క్రమంలోనే తనలోని వైవిధ్యమైన నటనతో ప్రేక్షకులను మెప్పించాడు. తద్వారా తెలుగు రాష్ట్రాల్లో భారీ ఫాలోయింగ్‌తో పాటు వరుస ఆఫర్లను అందుకున్నాడు. ఇక, బుల్లితెర హీరోయిన్ నవ్యసామితో రవికృష్ణ ప్రేమాయణం సాగిస్తున్నాడని ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో వీళ్లిద్దరూ జంటగా రచ్చ చేశారు. ఆ వివరాలు మీకోసం!

  యామిని భరద్వాజ్ హోమ్లీ ఫోటోషూట్.. సంప్రదాయ పద్దతిలో మరింత అందంగా

  అలా మొదలైన కెరీర్... ఇలా ఫేమస్

  అలా మొదలైన కెరీర్... ఇలా ఫేమస్

  చిన్న చిన్న పాత్రలతో కెరీర్‌ను ఆరంభించాడు రవికృష్ణ. ఈ క్రమంలోనే ‘మొగలిరేకులు' అనే సీరియల్‌లో గుర్తింపు తెచ్చుకున్న అతడు.. వరుసగా సూపర్ హిట్ సీరియల్స్‌లో నటిస్తూ బాగా ఫేమస్ అయ్యాడు. ‘వరూధినీ పరిణయం'తో హీరోగా మారడంతో పాటు ఎనలేని క్రేజ్‌ను సంపాదించుకున్నాడు. ఆ తర్వాత సోలో హీరోగా ఎన్నో సీరియళ్లలో నటించి బుల్లితెర స్టార్‌గా ఎదిగిపోయాడు.

  బిగ్ బాస్ ఆఫర్.. మంచోడిగా బిరుదు

  బిగ్ బాస్ ఆఫర్.. మంచోడిగా బిరుదు

  వరుస సీరియల్స్‌తో బుల్లితెరపై తన హవాను చూపిస్తున్నాడు హీరో రవికృష్ణ. విలక్షణమైన పాత్రలు పోషిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకుంటోన్న టైమ్‌లోనే బిగ్ బాస్‌ షోలోకి కంటెస్టెంట్‌గా వెళ్లాడు. మూడో సీజన్‌లో వచ్చిన కంటెస్టెంట్లు అందరిలోనూ మంచోడిగా పేరు తెచ్చుకున్న రవి.. మరింత ఫేమస్ అయ్యాడు. అంతేకాదు, మరిన్ని అవకాశాలు అందుకుంటూ సత్తా చాటుతున్నాడు.

  విలన్‌గా మారిన బుల్లితెర స్టార్ హీరో

  విలన్‌గా మారిన బుల్లితెర స్టార్ హీరో

  బిగ్ బాస్ షో తర్వాత రవికృష్ణ వరుస ఆఫర్లను అందుకుంటున్నాడు. ఈ క్రమంలోనే కొన్ని సినిమాల్లో నటించే అవకాశాలు కూడా వచ్చినా.. బుల్లితెరపైనే కనిపించేందుకు మొగ్గు చూపాడు. ఈ క్రమంలోనే ‘ఆమెకథ' అనే సీరియల్‌ చేశాడు. ఇందులో అతడు తొలిసారి నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రను పోషించాడు. నవ్యసామీ లీడ్ రోల్ చేసింది. ఈ సీరియల్ కూడా సూపర్ హిట్ అయింది.

  ప్రముఖ షోలో ఆమెకు ముద్దు పెట్టి

  ప్రముఖ షోలో ఆమెకు ముద్దు పెట్టి

  కొద్ది రోజుల క్రితం జరిగిన క్యాష్ షోలో బిగ్ బాస్ షో ద్వారా పరిచయం అయిన శివజ్యోతి, తన సీరియల్ పార్ట్‌నర్ నవ్యసామితో కలిసి రవికృష్ణ పాల్గొన్నాడు. ఇందులో సుమ ఇచ్చిన టాస్కులో భాగంగా హీరోయిన్‌‌కు ప్రియుడిలా నటించాడు. ఆ టాస్క్ కోసం నవ్యసామి... రవికృష్ణకు ప్రపోజ్ చేసింది. అప్పుడామెను హగ్ చేసుకున్న అతడు.. నుదుటిపై ముద్దు పెట్టి హాట్ టాపిక్ అయ్యాడు

  ఆమెతోనే వివాహం అంటూ ప్రచారం

  ఆమెతోనే వివాహం అంటూ ప్రచారం

  బుల్లితెర రంగంలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్‌గా ఉన్న రవికృష్ణ.. కొద్ది రోజులుగా తరచూ వార్తల్లో నిలుస్తున్నాడు. గతంలో అతడు సీరియల్ హీరోయిన్ నవ్యసామితో ప్రేమాయణం సాగిస్తున్నాడని కూడా ప్రచారం జరిగింది. ‘క్యాష్' షోలో చేసిన హడావిడితో వీళ్ల మధ్య బంధం నిజమేనని అంతా అనుకున్నారు. అదే సమయంలో ఇద్దరూ ఒకేసారి కరోనా బారిన పడడంతో దీనికి బలం చేకూరింది.

  నవ్యసామితో రవికృష్ణ మళ్లీ రచ్చ చేసి

  నవ్యసామితో రవికృష్ణ మళ్లీ రచ్చ చేసి

  తాజాగా జరిగిన క్యాష్ షోలోకి నవ్యసామితో కలిసి జంటగా ఎంట్రీ ఇచ్చాడు రవికృష్ణ. ఇప్పటికే వీళ్లిద్దరూ ప్రేమించుకుంటున్నారన్న ప్రచారం జరుగుతుండగా.. ఈ షోలో మరోసారి రెచ్చిపోయి నటించారు. దీనికితోడు యాంకర్ సుమ కూడా తరచూ వీళ్లిద్దరి మధ్య లవ్ ట్రాక్ ఉన్నట్లు పంచులు వేసింది. ఈ ఒక్క కారణంతోనే నవ్యసామి - రవికృష్ణ జంట మరోసారి డౌట్స్ క్రియేట్ చేసింది.

  బయటకు వచ్చిన ఫొటో.. ఒకరికొకరు

  బయటకు వచ్చిన ఫొటో.. ఒకరికొకరు

  తాజాగా నవ్యసామీ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో రవికృష్ణతో కలిసి దిగిన కొన్ని ఫొటోలను షేర్ చేసింది. ఇందులో ఈ జంట చూడముచ్చటగా ఉంది. ఒకరినొకరు చూసుకుంటూ దిగిన ఈ ఫొటో మరిన్ని అనుమానాలు పెంచేస్తోంది. అదే సమయంలో వీళ్ల అభిమానులు ఈ ఫొటోను తెగ వైరల్ చేస్తున్నారు. ఇక, ఇదే ఫొటోను రవికృష్ణ కూడా తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీగా పెట్టుకున్నాడు.

  English summary
  Telugu television Actor Ravi Krishna Very Busy in his Job. Recently he went Cash Show with Actress Navya Swamy. Now These Couple Photo Create Some Doubts.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X