‘బిగ్ బాస్’లో కొత్త కపుల్స్.. హౌస్‌లోనే హనీమూన్ మొదలెట్టేశారు.. ఎగతాళి చేసిన కంటెస్టెంట్లు

Recommended Video

#BBExpress Task...#BabaBhaskar

తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో 'బిగ్ బాస్'లో ఆసక్తికర సన్నివేశాలు చోటు చేసుకుంటున్నాయి. అందుకే ఈ షో విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఇప్పటికే రెండు సీజన్లు పూర్తి చేసుకున్న ఈ రియాలిటీ షో.. మూడో సీజన్‌ను కూడా ప్రేక్షకాదరణ పొందుతోంది. గత రెండు సీజన్లతో పోల్చుకుంటే ఇందులో కంటెస్టెంట్ల మధ్య సమన్వయం కుదరడం లేదు. దీంతో తరచూ గొడవలు జరుగుతున్నాయి. దీంతో సీజన్ -3లో ఎన్నో కొత్త కొత్త సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. అందుకే ఫన్నీ టాస్కులు క్రియేట్ చేస్తున్నారు బిగ్ బాస్ నిర్వహకులు.

అరుదైన అవకాశం ఇచ్చాడు

అరుదైన అవకాశం ఇచ్చాడు

బిగ్ బాస్ హౌస్‌లో గతంలో ఎన్నడూ జరగని విధంగా ఓ అరుదైన సన్నివేశం కనిపించింది. ఈవారం నామినేట్ అయిన ఆరుగురు సభ్యులు రాహుల్, రవికృష్ణ, వరుణ్ సందేశ్, మహేష్ విట్టా, పునర్నవి, హిమజలను యాక్టివిటీ ఏరియాలోకి రావాలని బిగ్ బాస్ కోరాడు. ఈ ఆరుగురిలో ముగ్గురు ఈవారం ఇంటి నుంచి బయటికి వెళ్లకుండా ఉండటానికి బిగ్ బాస్ ఒక డీల్‌ ఇచ్చాడు. బిగ్ బాస్ చరిత్రలోనే నామినేట్ అయిన సభ్యులకు లభించే అరుదైన డీల్ ఇదని చెప్పాడు.

మంగళవారం హాట్ హాట్‌గా...

మంగళవారం హాట్ హాట్‌గా...

మంగళవారం ఎపిసోడ్ హాట్ హాట్‌గా సాగింది. దీనికి కారణం ముగ్గురు సభ్యులకు సీక్రెట్ టాస్క్‌లు ఇవ్వడమే. ఆరుగురిలో రాహుల్, వరుణ్ సందేశ్, రవిలు మిగిలిన కంటెస్టెంట్లకు చిరాకు తెప్పించేందుకు పోటీ పడ్డారు. ఒకరు తర్వాత ఒకరు ఈ సీక్రెట్ టాస్క్‌లు పూర్తి చేసి ఇమ్యూనిటీని పొందారు. ఈ క్రమంలో కొందరు నిజంగానే సీరియస్ అవడంతో ఈ ఎపిసోడ్ ఉత్కంఠభరితంగా సాగింది.

ఛలో ఇండియా అంటూ సరికొత్తగా...

ఇక, లగ్జరీ బడ్జెట్‌తో పాటు కెప్టెన్‌ను ఎంచుకునేందుకు బిగ్ బాస్ ఇచ్చే వీక్లీ టాస్క్‌కు సంబంధించిన ప్రోమోను స్టార్ మా విడుదల చేసింది. దీని ప్రకారం.. హౌస్‌లోని కొందరు గార్డెన్ ఏరియాలో ఉన్న ట్రైన్ సెట్టింగ్‌లో ప్రయాణం చేయాల్సి ఉంటుంది. ఇందులో కొందరు కంటెస్టెంట్లకు బాస్ కొన్ని పాత్రలను కేటాయించాడు. దీంతో ఈ ఎపిసోడ్ సందడి సందడిగా సాగనుందని అర్థం అవుతోంది. దీనిపై అందరిలో ఆసక్తి నెలకొంది.

బిగ్ బాస్‌ హౌస్‌లో కొత్త జంట

బిగ్ బాస్‌ హౌస్‌లో కొత్త జంట

ఈ టాస్క్‌లో భాగంగా పునర్నవి - రవిని హానీమూన్ కపుల్స్ చేశాడు బిగ్ బాస్. వీళ్లిద్దరూ హనీమూన్ కోసం ట్రైన్‌లో ప్రయాణించాల్సి ఉంటుంది. ఈ ట్రైన్ డ్రైవర్లుగా రాహుల్, వరుణ్ ఉంటారు. అలాగే ఇదే ట్రైన్‌లో టీ అమ్మే వ్యక్తిగా బాబా భాస్కర్ వ్యవహరిస్తాడని బిగ్ బాస్ చెప్పాడు. మిగిలిన వాళ్లందరూ ట్రైన్‌లో ప్రయాణికులుగా ఉంటారని ప్రోమో చూస్తే తెలుస్తోంది. కంటెస్టెంట్లకు క్యారెక్టర్లు చెప్పే సమయంలో అందరూ బాబాను ఎగతాళి చేయడం కనిపించింది.

రాహుల్ - పునర్నవి విడిపోయారు

రాహుల్ - పునర్నవి విడిపోయారు

గతంలో జరిగిన ఎపిసోడ్స్‌లో రాహుల్ - పునర్నవి కలిసి ఆడారు. వేరే జట్లలో ఉన్నా.. పునర్నవికి రాహుల్ మద్దతుగా ఆడాడు. ఇప్పుడు మాత్రం ఆమె మరొకరితో పెయిర్ అవడంతో రాహుల్ ఎలా ఆడుతాడోనని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. దీనికి కారణం వీళ్లిద్దరి మధ్య సంథింగ్ సంథింగ్ జరుగుతుందని ప్రచారం జరగడమేనన్న విషయం అందరికీ తెలిసిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X