Bigg Boss Finale: అతను ఫ్లర్టింగ్ లో కింగ్.. మీకేం తెలియదు పాపం అంటూ నాగార్జునతో రవితేజ!

ఎట్టకేలకు బిగ్ బాస్ తెలుగు 6 సీజన్ పూర్తి కానుంది. డిసెంబర్ 18న నిర్వహించనున్న గ్రాండ్ ఫినాలే మరి కొన్ని గంటల్లో ప్రసారం కానుంది. అతిరథ ప్రేక్షకులు, సెలబ్రిటీల మధ్య సీజన్ టైటిల్ విన్నర్ ను ప్రకటించనున్నారు. గ్రాండ్ ఫినాలే అంటే సెలబ్రిటీల రాకతో సందడిగా ఉంటుందన్న విషయం తెలిసిందే. అందులో భాగంగానే ఈ గ్రాండ్ ఫినాలేలో మాస్ మహారాజా రవితేజ, నిఖిల్ సిద్ధార్థ్ తోపాటు పలువురు సందడి చేశారు. దీనికి సంబంధించిన ప్రోమోను తాజాగా విడుదల చేశారు. ఆ వివరాల్లోకి వెళితే..

2017లో

2017లో

బిగ్ బ్రదర్ అనే పేరుతో అమెరికాలో ప్రారంభమైన రియాలిటీ షో ఎల్లలు దాటి ఇండియాలోకి బిగ్ బాస్ గా వచ్చింది. రావడమే కాకుండా అశేషమైన ప్రేక్షకాదరణ పొందింది. దీంతో ముందుగా హిందీలో ప్రారంభమైన ఈ రియాలిటీ షోను క్రమేణా మిగతా భాషల్లోకి సైతం తీసుకొచ్చారు. ఇక తెలుగులో 2017లో అనేక అనుమానాల నడుమ ప్రారంభమైన ఈ రియాలిటీ షో వరుస సీజన్లతో దూసుకుపోతూ ప్రస్తుతం ఆరో సీజన్ నడుస్తోంది. ఇంకొక్క రోజులో పూర్తి కానుంది.

21 మంది సెలబ్రిటీలతో సీజన్..

21 మంది సెలబ్రిటీలతో సీజన్..

ఇదిలా ఉంటే సెప్టెంబర్ 4న ప్రారంభమైన బిగ్ బాస్ తెలుగు ఆరో సీజన్ లోకి మొత్తంగా 21 మంది సెలబ్రిటీలు ఎంట్రీ ఇచ్చారు. వీరిలో కీర్తి భట్, సుదీప పింకీ, శ్రీహాన్, నేహా చౌదరి, చలాకీ చంటి, శ్రీ సత్య, అర్జున్ కల్యాణ్, గీతూ రాయల్, అభినయ శ్రీ, రోహిత్ సాహ్నీ, మెరీనా అబ్రహం, బాలాదిత్య, వాసంతి కృష్ణన్, షానీ సాల్మన్, ఆర్జే సూర్య, ఫైమా, ఆదిరెడ్డి, రాజశేఖర్, ఇనయా సుల్తానా, అరోహీ రావు, రేవంత్‌‌ ఉన్నారు.

16 మంది ఎలిమినేట్..

16 మంది ఎలిమినేట్..

బిగ్ బాస్ తెలుగు సీజన్ 6లోకి వచ్చిన 21 మందిలో ఫస్ట్ వీక్ ఎలిమినేషన్ తీసేసి.. రెండో వారంలో డబుల్ ఎలిమినేషన్ పెట్టారు. ఆ తర్వాత ఒక్కొక్కరినే పంపించి.. మళ్లీ పదో వారంలో డబుల్ ఎలిమినేషన్ చేశారు. ఇలా ఇప్పటికే షానీ, అభినయ, నేహా, ఆరోహి, చంటి, సుదీప, అర్జున్‌, సూర్య, గీతూ, బాలాదిత్య, వాసంతి కృష్ణన్, మెరీనా అబ్రహం, రాజశేఖర్, ఫైమా, ఇనయా సుల్తానాతోపాటు మిడ్ వీక్ ఎవిక్షన్ ప్రకియలో భాగంగా శ్రీసత్య ఎలిమినేట్ అయింది. ఇలా హౌజ్ నుంచి 16 మంది వెళ్లిపోయారు.

ఇల్లంతా బోసిపోయిందా..

ఇల్లంతా బోసిపోయిందా..

ప్రస్తుతం హౌజ్ లో టాప్ 5 కంటెస్టెంట్స్ రేవంత్, రోహిత్, శ్రీహాన్, కీర్తి భట్, ఆదిరెడ్డి ఉన్నారు. డిసెంబర్ 18న అంటే ఇవాళ చాలా గ్రాండ్ గా ఫినాలే జరగనుంది. తాజాగా దీనికి సంబంధించిన ప్రోమోను విడుదల చేశారు. ఇందులో స్టైలిష్ లుక్ లో గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చారు హోస్ట్ నాగార్జున. హాయ్ టాప్ 5 అని ఇంటి సభ్యులకు చెబితే అందరూ మంచి హుషారుతో కనిపించారు. ఎలా ఉంది ఇల్లంతా బోసిపోయిందా అని నాగార్జున అడిగితే అవును సార్ అని కీర్తి అంది.

దెయ్యాలే వెళ్లిపోయారు..

దెయ్యాలే వెళ్లిపోయారు..

అంటే దెయ్యాల కథలు చెప్పేవాళ్లు లేరా అని నాగార్జున అంటే.. దెయ్యాలే వెళ్లిపోయారు అని శ్రీహాన్ అన్నాడు. దీనికి ఏంటీ నేను నీకు దెయ్యంలా కనిపిస్తున్నానా నీకు అని ఇనయా సుల్తానా అరవడంతో.. నేను నా మాటలు వెనక్కి తీసుకుంటున్నాను అని శ్రీహాన్ అన్నాడు. దీంతో అందరూ నవ్వేశారు. తర్వాత భూమ్ బద్దలు సాంగ్ కి అభినయశ్రీ అదిరిపోయే స్టెప్పులు వేసింది. తర్వాత మాస్ మహారాజా రవితేజ, హీరోయిన్ శ్రీలీల స్టేజిపైకి ఎంట్రీ ఇచ్చారు.

నీకు ఎంత వీలు అయితే అంత..

ఆదిరెడ్డి పక్కనున్నది శ్రీహాన్. అతను ఫ్లర్టింగ్ లో కింగ్.. అని నాగార్జున అంటే.. శ్రీహాన్ కంగారుపడిపోతూ సార్ అన్నాడు. దీనికి గుడ్.. గుడ్.. సార్ ఏంటీ.. నీకు ఎంత వీలు అయితే అంత చేయు అని రవితేజ అన్నాడు. దీనికి ఆ ఫ్లర్టింగ్ స్కూల్ లో రవి మాస్టారు అని నాగార్జున అన్నాడు. అప్పుడు వెంటనే.. మీరు తక్కువ బాగా.. మీకు ఏం తెలియదు పాపం అంటూ రవితేజ తన స్టైల్ లో అన్నాడు. దీనికి నాగార్జునతో పాటు అందరూ నవ్వేశారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X