టీవీలో కూడా క్రాక్ సూపర్ హిట్.. TRPతో కిక్కిచ్చేశాడు!
మాస్ మహారాజా రవితేజ నటించిన హై వోల్టేజ్ మాస్ ఎంటర్టైనర్ క్రాక్ సినిమా ఏ రేంజ్ లో హిట్టయ్యిందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. గతంలో ఎప్పుడు లేని విధంగా రవితేజ బాక్సాఫీస్ వద్ద అత్యదిక వసూళ్లను అందుకోవడమే కాకుండా డిజిటల్, టీవీలలో కూడా సరికొత్త రికార్డులను క్రియేట్ చేశాడు.
క్రాక్ సినిమా దాదాపు 50కోట్ల బిజినెస్ తో నిర్మాతలకు మంచి లాభాలను అందించింది. అసలు లాక్ డౌన్ అనంతరం సినిమాలు ఆడతాయా లేదా అని అనుకున్న తరుణంలో క్రాక్ విమర్శకుల నోళ్ళను మూయించేసింది. క్రాక్ హిట్టుతో రవితేజ అభిమానులు బాగానే సెలబ్రేట్ చేసుకుంటున్నారు. అయితే సినిమా టీవీలో కూడా సాలీడ్ టీఆర్పీని అందుకుంది.

ఇటీవల కాలంలో వచ్చిన ఏ సినిమా కూడా ఈ రేంజ్ లో రెస్పాన్స్ అందుకోలేదు. పైగా ముందే ఓటీటీలో వచ్చినప్పటికీ టీవీల్లో కూడా భారీగా రెస్పాన్స్ అందుకోవడం విశేషం. మార్చి 14న స్టార్ మాలో మొదటిసారి ప్రీమియర్స్ పడగా సినిమాకు 11.7 TRP వచ్చింది.
అభిమానులకు ఈ న్యూస్ కూడా మంచి కిక్కిచ్చింది. మొత్తానికి మాస్ రాజా వరుస అపజయాలను దాటేసి హిట్ ట్రాక్ లోకి వచ్చేశాడు. అలాగే టాలీవుడ్ కు ఒక మంచి బూస్ట్ కూడా ఇచ్చాడు.


Click it and Unblock the Notifications











