హీరోయిన్‌ను కౌగిలిలో బంధించిన రవితేజ: సోషల్ మీడియాలో ఫొటో వైరల్
ఈ ఏడాది ఆరంభంలోనే 'క్రాక్' మూవీతో భారీ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు టాలీవుడ్ సీనియర్ హీరో మాస్ మహారాజా రవితేజ. టాక్‌తోనే కాకుండా కలెక్షన్ల పరంగానూ దుమ్ము దులిపేసిన ఈ మూవీ.. అతడి కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమా ఇచ్చిన ఉత్సాహంతోనే ఆ వెంటనే రమేశ్ వర్మ దర్శకత్వంలో 'ఖిలాడీ' అనే సినిమాను ప్రారంభించాడు రవితేజ. అయితే, కరోనా వల్ల ఏర్పడిన పరిస్థితుల వల్ల ఇది షూటింగ్ సమయంలోనే బ్రేక్ తీసుకోవాల్సి వచ్చింది. దీంతో ఆ వెంటనే గ్యాప్ లేకుండా మరో ప్రాజెక్టును పట్టాలెక్కించేశాడీ స్టార్ హీరో.
ప్రస్తుతం రవితేజ.. శరత్ మందవ అనే దర్శకుడితో సినిమా చేస్తున్నాడు. సందేశాత్మకంగా రాబోతున్న ఈ చిత్ర షూటింగ్ ఇటీవలే ప్రారంభమైంది. అప్పటి నుంచి శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. ఈ క్రమంలోనే తాజాగా ఈ సినిమా సెట్స్ నుంచి ఓ ఫొటో బయటకు వచ్చింది. ఇందులో హీరో రవితేజ.. హీరోయిన్ దివ్యాన్షా కౌశిక్‌ను వెనుక నుంచి హగ్ చేసుకుని ఉన్నాడు. ఇధి ఒక కెమెరాలో డిస్‌ప్లే అవుతూ కనిపిస్తోంది. దీన్ని స్వయంగా హీరోయిన్ తన సోషల్ మీడియా ఖాతాల్లో షేర్ చేసింది. ఇంకేముందు ఈ పిక్ ఇంటర్నెట్‌లో విపరీతంగా వైరల్ అవుతోంది.

ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న ఈ సినిమాలో రవితేజ మండల రెవెన్యూ ఆఫీసర్ (ఎమ్మార్వో/తహసీల్దార్)గా నటిస్తున్నాడు. ప్రజా సమస్యల కోసం ఉద్యోగాన్ని వదిలేసి పోరాటం చేసిన వ్యక్తి కథతో ఇది తెరకెక్కుతున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇక, ఈ సినిమాను సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. ఇందులో దివ్యాన్షా కౌశిక్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రానికి సామ్ సీఎస్ సంగీతం అందిస్తున్నాడు. ఇది ఈ ఏడాది చివర్లో కానీ, వచ్చే సంవత్సరం ప్రారంభంలో కానీ విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి.


Click it and Unblock the Notifications











