Dhamaka: బుల్లితెరపైనా రవితేజ రచ్చ.. ధమాకాకు ఎంత రేటింగ్ వచ్చిందో తెలిస్తే!
తెలుగు సినీ ఇండస్ట్రీలో మాస్ ఇమేజ్‌ను సొంతం చేసుకున్న హీరోలు చాలా తక్కువ మందే ఉన్నారని చెప్పొచ్చు. అందులోనూ కొందరు మాత్రమే కమర్షియల్ హీరోలుగా సత్తా చాటుతోన్నారు. వారిలో మాస్ మహారాజాగా పేరు తెచ్చుకున్న రవితేజ ఒకడు. బ్యాగ్రౌండ్ లేకుండానే సినిమాల్లోకి ఎంటరైన అతడు..
తనదైన టాలెంట్‌లతో స్టార్‌గా ఎదిగాడు.అప్పటి నుంచి ఏమాత్రం వెనక్కి తిరిగి చూడకుండా దూసుకెళ్తోన్నాడు. అలాగే, ఏడాదికి కనీసం మూడు సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్నాడు. ఈ క్రమంలోనే గత ఏడాది చివర్లో రవితేజ 'ధమాకా' అనే మూవీతో వచ్చాడు.

రవితేజ హీరోగా నక్కిన త్రినాథరావు దర్శకత్వం వహించిన 'ధమాకా' మూవీ గత డిసెంబర్‌లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దీనికి ఆరంభంలోనే మిక్స్‌డ్ టాక్ వచ్చింది. కానీ, దీనికి అస్సలు సంబంధమే లేకుండా ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కింది.
దీంతో రవితేజ నటించిన ఈ మూవీకి దాదాపు రెండు మూడు వారాల పాటు బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిసింది. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్‌ను వారం లోపులోనే చేరుకోవడంతో పాటు వంద కోట్ల గ్రాస్‌ను కూడా వసూలు చేసింది. తద్వారా రవితేజ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్ అయింది.
థియేటర్లలో చాలా రోజుల పాటు ఓ రేంజ్‌లో సందడి చేసిన మాస్ మహారాజా రవితేజ 'ధమాకా' మూవీ.. ఓటీటీలోనూ సత్తా చాటింది. ఈ క్రమంలోనే కొద్ది రోజుల క్రితమే ఈ చిత్రం స్టార్ మా ఛానెల్‌లో వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్‌గా ప్రదర్శితం అయింది.

అక్కడ కూడా దీనికి ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో రెస్పాన్స్ లభించింది. ఫలితంగా ఈ చిత్రానికి అర్బన్ ఏరియాలో 10.08 రేటింగ్ దక్కింది. అలాగే, అర్బన్ ప్లస్ రూరల్ ఏరియాలకు సంబంధించి ఏకంగా 9.04 టీఆర్పీ రేటింగ్ వచ్చింది. ఈ మధ్య కాలంలో ఇది మంచి టీఆర్పీ రేటింగ్ అని చెప్పుకోవచ్చు.
ఇదిలా ఉండగా.. రవితేజ - త్రినాథరావు నక్కిన తెరకెక్కించిన సినిమానే 'ధమాకా'. ఈ సినిమాను పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్లపై టీజీ విశ్వ ప్రసాద్ నిర్మించారు. శ్రీలీలా ఇందులో హీరోయిన్‌గా నటించింది. భీమ్స్ ఈ మూవీకి మ్యూజిక్ ఇచ్చాడు. ఇందులో జయరాం, సచిన్ ఖేడ్కర్, రావు రమేష్, తణికెళ్ల భరణి కీలక పాత్రలు చేశారు.


Click it and Unblock the Notifications











