బిగ్‌బాస్‌లో మంచోడు.. మోసం చేసేందుకు బయల్దేరాడు
Recommended Video
బిగ్‌బాస్ హౌస్‌లో ఉన్నంత కాలం మంచోడిగా పేరు తెచ్చుకున్నాడు రవికృష్ణ. కొందరు నిజంగానే మంచోడు అంటే మరికొందరు అతిమంచోడు అంటూ సెటైర్ వేశారు. అయితే బయట తానెలా ఉంటానో బిగ్‌బాస్ హౌస్‌లోనూ అలానే ఉన్నానంటూ చెప్పుకొచ్చాడు.బిగ్‌బాస్ హౌస్‌లో ఉన్నంత కాలం మంచోడిగా పేరు తెచ్చుకున్నాడు రవికృష్ణ. కొందరు నిజంగానే మంచోడు అంటే మరికొందరు అతిమంచోడు అంటూ సెటైర్ వేశారు. అయితే బయట తానెలా ఉంటానో బిగ్‌బాస్ హౌస్‌లోనూ అలానే ఉన్నానంటూ చెప్పుకొచ్చాడు.

శ్రీముఖి, శివజ్యోతికి దగ్గరగా..
అందరితో మంచిగా ఉండేందుకు ప్రయత్నించిన రవి.. కొందరికి చెడ్డగా కనిపించాడు. మొదట్లో వితికా, పునర్నవితో మంచిగానే ఉన్నా.. రానురాను వీరికి దూరమైపోయాడు. శ్రీముఖికి దగ్గరై.. శివజ్యోతికి మరింత క్లోజ్ అయ్యాడు. ఎలిమినేట్ అయ్యే వరకు శివజ్యోతితో కలిసే ఆట ఆడాడు.

విజయవాడకు ఫ్లైట్ టిక్కెట్టు...
ఎలిమినేట్ అయ్యాక విజయవాడ వెళ్తాను.. ఇంట్లో వాళ్లతో సరదాగా గడిపేస్తాను అని చెప్పడంతో విజయవాడకు ఫ్లైట్ టిక్కెట్టు వేసి మరి పంపించాడు బిగ్‌బాస్. మొత్తానికి ఎలిమినేషన్ అనంతరం బయటకు వచ్చిన రవి.. మళ్లీ తన పనిలో నిమగ్నమైనట్లు కనిపిస్తోంది. తాజాగా మరో సీరియల్‌ను ప్రారంభించేశాడు.

కొత్త సీరియల్‌తో..
ఆమె కథ అంటూ ప్రారంభం కానున్న ఈ సీరియల్ శ్రీమంతుడిగా ఉన్న రవి.. ఓ అమ్మాయిని ప్రేమలో పడేయటం కోసం ఏమీ లేనివాడుగా నటించనున్నట్లు కనిపిస్తున్నాడు. అలాగని ఇదేదో గజినీ సినిమాకు సీక్వెల్ అనుకోకండి. దీంట్లో ఇంకెన్ని ట్విస్ట్‌లు ఉంటాయో చూడాలి. ప్రస్తుతం దీనికి సంబంధించిన ప్రోమో వైరల్ అవుతోంది. లగ్జరీ కారులోంచి రవి దిగడం.. అలా నడుచుకుంటూ వస్తూ ఉంటే పక్కన బాడీగార్డులుండటం.. అంతా బాగానే ఉంది.
మీ ప్రేమ ఎప్పుడూ ఇలాగే ఉంటుందని..
త్వరలోనే ఈ సీరియల్ ప్రారంభం కానున్నట్లు సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.‘నేను మళ్లీ ఓ కొత్త ప్రాజెక్ట్‌తో మీ ముందుకు వస్తున్నాను..మీరుఇంతవరకు చూపించిన ప్రేమ నాపై ఎప్పటికీ తరిగిపోదని, ఎల్లప్పుడూ అలాగే ఉంటుందని నమ్ముతున్నాను' అంటూ పోస్ట్ చేశాడు.


Click it and Unblock the Notifications











