డైరెక్ట్‌గా మీ ఇంట్లోకి ఎన్టీఆర్.. లాక్‌డౌన్ సమయంలో మళ్లీ రచ్చ రచ్చ!
తెలుగు అతిపెద్ద రియాలిటీ షో బిగ్‌బాస్ ఆరంభం నుంచి విశేషమైన ఆదరణతో బుల్లితెర ప్రేక్షకుల గుండెల్లోకి దూసుకెళ్లింది. ఎన్టీఆర్ హోస్ట్‌గా రూపొందిన ఈ షో తొలి సీజన్ బ్రహ్మండమైన రేటింగ్‌ను సాధించింది. ఆ తర్వాత హోస్ట్‌గా ఎన్టీఆర్ తప్పుకోవడం ప్రేక్షకులను నిరుత్సాహ పరిచింది. అయితే మళ్లీ ఎన్టీఆర్ బుల్లితెర మ్యాజిక్‌ను చూసేందుకు మా టెలివిజన్ సిద్ధమైంది. ఎప్పుడూ, ఎన్నడూ ప్రారంభం అవుతుందంటే..

ఎన్టీఆర్ తన మార్కుతో
బిగ్‌బాస్ తెలుగు రియాలిటీ షోకు తొలి హోస్ట్‌గా జూనియర్ ఎన్టీఆర్ తనదైన మార్కును ప్రదర్శించాడు. బుల్లితెర మీద రాణిస్తారా అనే అనుమానాలను పటాపంచలు చేశాడు. ఆ తర్వాత వచ్చిన హోస్ట్‌లు చేరుకోని విధంగా ఓ మైలురాయిని సెట్ చేశాడు. అలా ప్రతి ఇంటిలోని బుల్లితెర ప్రేక్షకులకు అభిమానిగా మారిపోయాడు.

టాప్ రేటింగ్‌తో బిగ్‌బాస్
ఇక బిగ్‌బాస్ తెలుగు రియాలిటీ షోకు తెలుగు టెలివిజన్ చరిత్రలో ఏ షోకు రాని విధంగా రేటింగ్ నమోదైంది. అందంతా ఎన్టీఆర్ వల్లే అనే వాదన కూడా అప్పట్లో వచ్చింది. ఏది ఏమైనా మళ్లీ ఎన్టీఆర్ బుల్లితెర ద్వారా ఈ లాక్‌డౌన్ సమయంలో వినోదాన్ని అందించేందుకు సిద్దమవుతున్నాడు.
మళ్లీ రీ టెలికాస్ట్
లాక్‌డౌన్ కారణంగా టెలివిజన్ షూటింగ్స్ అన్నీ క్యాన్సిల్ కావడంతో మళ్లీ పాత సీరియల్స్‌ను ప్రేక్షకులకు అందించాలనే ప్రయత్నం చేస్తున్నాయి పలు టెలివిజన్ ఛానెల్స్. అందులో భాగంగానే బిగ్‌బాస్ తొలి సీజన్‌ను ఆదివారం సాయంత్రం 6 గంటలకు, మళ్లీ రాత్రి 10 గంటలకు ప్రసారం చేయబోతున్నారు.
Recommended Video

ఎన్టీఆర్ కెరీర్‌లో
ఇక ఎన్టీఆర్ విషయానికి వస్తే.. ప్రస్తుతం RRR మూవీలో రాంచరణ్‌తో కలిసి నటిస్తున్నారు. ఇక త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో కలిసి మరో సినిమాకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. త్వరలో ప్రారంభం కావాల్సి ఉండగా, కరోనావైరస్ కారణంగా వాయిదా పడినట్టు తెలుస్తున్నది. 1


Click it and Unblock the Notifications











