పెళ్లి చూపులు: యాంకర్ ప్రదీప్ బిగ్‌బాస్ షోకు రావడం వెనక అసలు కారణం!

By Bojja Kumar

Recommended Video

Bigg Boss Season 2 Telugu : Day 39 Highlights

టీవీ షోలతో బిజీగా ఉండే యాంకర్ ప్రదీప్ మాచిరాజు బిగ్‌బాస్2లోకి రావడం అటు ప్రేక్షకులతో పాటు ఇటు ఇంటి సభ్యులను ఆశ్చర్య పరిచింది. ఆయన బిగ్ బాస్ షోలో ఉంటే టీవీ షోలు ఎవరు చేస్తారు? అనే సందేహం అందరిలోనూ కలిగింది. అయితే బిగ్ బాషోలోకి ప్రదీప్ రావడం వెనక అసలు కారణం వేరే ఉంది. షోలోకి ఎంటరైన తర్వాత ఇంటి సభ్యులతో తాను రావడానికి గల అసలు కారణం వెల్లడించారు.

వేరే బట్టలు ఉండటంతో ముందే అనుమానం!

వేరే బట్టలు ఉండటంతో ముందే అనుమానం!

ప్రదీప్ బిగ్ బాస్‌లో ఎంట్రీ ఇవ్వగానే ఇంటి సభ్యులకు అనుమానం వచ్చింది. ఆయన షోలో పార్టిసిపెంటుగా రాలేదని అంతా అనుకున్నారు. ఆయన సూట్ కేసు చెక్ చేసినపుడు కూడా అందులో ప్రదీప్ వేసుకునే బ్రాండెడ్ దుస్తులు కాకుండా వేరే దుస్తులు ఉండటం కూడా వారిలో మరింత అనుమానాన్ని పెంచింది.

అసలు విషయం వెల్లడించిన ప్రదీప్

అసలు విషయం వెల్లడించిన ప్రదీప్

ఇంటి సభ్యులందరినీ ఒక చోట కూర్చోబెట్టిన ప్రదీప్.... తాను ఈ షోకు రావడానికి గల అసలు కారణం వెల్లడించారు. త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్లు తెలిపారు. ఇందుకోసం ‘పెళ్లి చూపులు’ అనే రియాల్టీ షో చేయబోతున్నట్లు తెలిపారు.

పెళ్లి కోసం... సరికొత్త షో చేయబోతున్న ప్రదీప్

పెళ్లి కోసం... సరికొత్త షో చేయబోతున్న ప్రదీప్

త్వరలో పెళ్లి చేసుకోబోతున్న ప్రదీప్ తన జీవిత భాగస్వామిని స్వయంవరం తరహాలో జరిగే ‘పెళ్లి చూపులు’ అనే రియాల్టీ షో ద్వారా ఎంపిక చేసుకోబోతున్నాడు. బిగ్ బాస్ షో పూర్తయిన తర్వాత ఈ షో ప్రారంభం కాబోతోందట.

 ఆడ పిల్లలకు నన్ను పరిచయం చేసుకుంటాను

ఆడ పిల్లలకు నన్ను పరిచయం చేసుకుంటాను

బిగ్ బాస్ తర్వాత సరికొత్త టీవీ షో చేయబోతున్నాను. ఆడిషన్ కాల్ కూడా ఓపెన్ అయింది. పెళ్లి చూపులు తరహాలో ఈ షో సాగుతుంది. ఈ షో ద్వారా ఆడ పిల్లలకు నన్ను పరిచయం చేసుకుంటాను. నేను వారికి తూగుతానా? లేదా? అనేది వారు డిసైడ్ చేసుకుంటారు... అని ప్రదీప్ తెలిపారు.

వారితో నా జర్నీ మొదలవుతుంది

వారితో నా జర్నీ మొదలవుతుంది

ఆడిషన్స్‌లో ఫైనల్ అయిన వారితో నా షో మొదలవుతుంది. వారితో జర్నీ చేస్తాను. నెక్ట్స్ లెవల్స్ ఏంటనేది పర్సనల్‌గా మా అమ్మా నాన్న సమక్షంలో జరుగుతుంది. దానికంటే ముందు వారి ఫ్యామిలీస్‌కు నన్ను నేను పరిచయం చేసుకోవడం కోసం పెళ్లి చూపులు జరుగుతాయి అని ప్రదీప్ తెలిపారు.

అలాంటి వ్యక్తినే నా లైఫ్ పార్ట్‌నర్‌గా చేసుకుంటా

బిగ్ బాస్ షో పూర్తవ్వగానే పెళ్లి చూపులు షో మొదలవుతుంది. చాలా మంది ఎంట్రీస్ పంపారు. నన్ను ఎవరైతే ఎక్కువ అభిమానిస్తారో వారిని నా లైఫ్ పార్ట్‌నర్‌గా చేసుకుంటాను... అని ప్రదీప్ తెలిపారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X