Jabardasth జబర్దస్త్ నుంచి ఇంద్రజ అవుట్.. వెళ్లిపోతుందా? పంపించేస్తున్నారా అంటే?

బుల్లితెరపై కామెడీ షోగా రికార్డు క్రియేట్ చేసింది జబర్దస్త్ కామెడీ షో. నాగబాబు, రోజా జడ్జీలుగా అనసూయ యాంకర్ గా మొదలైన ఈ కామెడీ షో ఆనతి కాలంలోనే టాప్ షో గా పేరు తెచ్చుకుంది.ఇక ఈ షోను కాపీ కొట్టి చాలా షోస్ వచ్చాయి కానీ.. ఏది సక్సెస్ అవ్వలేదు. నాగబాబు నవ్వు, రోజా పంచ్ లు, అనసూయ అందం.. వీటితోనే షో అంతా నడిపించింది. గురువారం వచ్చింది అంటే.. జబర్దస్త్ షో కోసం ఎదురుచూసే కుటుంబాలు ఎన్నో. అలా ఎక్స్ట్రా జబర్దస్త్ ను కూడా స్టార్ట్ చేశారు. రష్మి యాంకర్ గా ఎంట్రీ ఇచ్చింది.

గురువారం జబర్దస్త్.. శుక్రవారం ఎక్స్ట్రా జబర్దస్త్ తో ఈటీవీ టాప్ వన్ ఛానెల్ గా నడిచింది. ఇక ఉన్నాకొద్ది జబర్దస్త్ లో చాలా మార్పులు వచ్చాయి. నాగబాబు జడ్జిగా మానేశాక జబర్దస్త్ కళ తప్పింది. నాగబాబు ప్లేస్ ను రీప్లేస్ చేసిన వాళ్లు లేరని చెప్పాలి. సింగర్ మను వచ్చాడు.. ఆమని, మీనా ఇలా చాలామంది వచ్చారు.

Reason behind heroine indraja quitting jabardasth

ఇక ఆ సమయంలోనే ఇంద్రజ ఎంట్రీ ఇచ్చింది. అందం, అభినయం కలగలిపిన ఆమె.. జబర్దస్త్ తో రీ ఎంట్రీ ఇచ్చింది. సరే.. ఏదో గెస్ట్ లా వచ్చిందేమో అని అభిమానులు అనుకున్నారు. ఇక రోజా మినిస్టర్ గా మారాక ఆమె కూడా జబర్దస్త్ నుంచి బయటకు వ, చ్చేసింది. దీంతో ఇంద్రజ పర్మినెంట్ గా జబర్దస్త్ లో సెటిల్ అయిపోయింది.

ఎంతో అమాయకంగా, అందరిని తనవారు అనుకుంటూ ఇంద్రజ మాట్లాడే తీరుకు అభిమానులు కూడా ఫిదా అయ్యారు. ఇక అలా జబర్దస్త్ నుంచి శ్రీదేవి డ్రామా కంపెనీకి కూడా పర్మినెంట్ జడ్జిగా మారిపోయింది. జబర్దస్త్ తరువాత ఆమె రేంజ్ మారిపోయింది. స్టార్ హీరోలో సినిమాల్లో మంచి అవకాశాలను అందుకుంది. అయితే ఈ నేపథ్యంలోనే ఇంద్రజ షాకింగ్ డెసిషన్ తీసుకుంది.

Reason behind heroine indraja quitting jabardasth

జబర్దస్త్ నుంచి ఆమె గ్యాప్ తీసుకున్నట్లు తెలిపింది. తాజాగా రిలీజ్ చేసిన ప్రోమో లో ఆమె ఈ విషయాన్ని తెలిపింది. చాలా బాధగా ఈ షో నుంచి వెళ్తున్నట్లు తెలిపింది. ఇక ఇంద్రజ కు జబర్దస్త్ టీమ్ ఎమోషనల్ సెండాఫ్ ఇచ్చారు. అయితే ఇంత సడెన్ గా ఆమె ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక కారణం ఏంటి.. ? అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. ఆమెనే తొలగిందా..? లేక తప్పించారా..? అనే విషయం తెలియాల్సి ఉంది. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట వైరల్ గా మారింది.

ఇకపోతే ఇంద్రజ గ్యాప్ తీసుకుంటే ఆమె ప్లేస్ ను రీప్లేస్ చేసే వారు ఎవరు.. ? అనే ప్రశ్న తలెత్తుతుంది. అయితే అందరూ కోవైసరళ ను తీసుకురండి అంటుండగా.. మరికొందరు మరో సీనియర్ హీరోయిన్ ను తీసుకురండి అంటూ కామెంట్స్ పెడుతున్నారు. మరి మల్లెమాల ఎవరిని జడ్జిగా తీసుకొస్తుందో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X