వితిక అనుకుంటే జాఫర్ ఎలిమినేట్ అయ్యాడు.. దీని వెనుక అసలు కథ ఇదేనట

Recommended Video

Bigg Boss Telugu 3 : Real Reason Behind Jaffar Elimination || Filmibeat Telugu

'బిగ్ బాస్' సీజన్ - 3 రోజు రోజుకూ ఆసక్తికరంగా సాగుతోంది. రెండు వారాలు ముగిసే సమయానికే హౌస్‌లో ఎన్నో చిత్ర విచిత్ర సంఘటనలు కనిపించాయి. ముఖ్యంగా మొదటి నామినేషన్‌లో హేమ వెళ్తుందని అంతా ఊహించినా.. వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఉంటుందని మాత్రం ఎవరూ అనుకోలేదు. అలాగే, రెండో వారంలో మాత్రం చాలా మంది జాఫర్ ఎలిమినేట్ అవుతాడని అనుకోలేదు. ఆయన స్థానంలో వితికా షేరు వెళ్లిపోతుందని అనుకున్నారు. కానీ, దీనికి భిన్నంగా జరిగింది. అసలు జాఫర్ ఎలిమినేట్ అవడానికి కారణాలు ఇవేనంటూ కొన్ని వార్తలు బయటకు వచ్చాయి.

ఎనిమిది మంది నామినేట్

ఎనిమిది మంది నామినేట్

నామినేషన్ ప్రక్రియ పూర్తయ్యే సరికి గత వారం ఎలిమినేషన్ జోన్‌లోకి వచ్చే కంటెస్టెంట్లుగా శ్రీముఖి, హిమజ, జాఫర్, మహేష్, వరుణ్, వితిక, పునర్నవి, రాహుల్‌లు నామినేట్ అయ్యారు. ఒకేసారి ఎనిమిది మంది నామినేట్ కావడం షో చరిత్రలోనే మొదటిసారి కావడం విశేషం. గతంలో ఇలాంటి పరిస్థితులు తలెత్తకపోవడంతో ఏమౌతుందా అన్న ఆసక్తి కనిపించింది.

మొదట నలుగురు సేఫ్

మొదట నలుగురు సేఫ్

నామినేట్ అయిన ఎనిమిది మందిలో నలుగురు సేఫ్ అయ్యారు. చాలా మంది నామినేషన్‌లో ఉండడంతో సేఫ్ అయిన కంటెస్టెంట్లను త్వరగానే ప్రకటించారు నాగ్. తొలి సేఫ్ కంటెస్టెంట్ మహేష్ విట్టా కాగా.. ఆ తరువాత హిమజ, రాహుల్‌లుసేఫ్ అయినట్లు నాగార్జున ప్రకటించారు. నాలుగో సేఫ్ కంటెస్టెంట్‌గా శ్రీముఖి గట్టెక్కడంతో ఊపిరి పీల్చుకుని కన్నీళ్లు పెట్టుకుంది.

వితిక అనుకుంటే జాఫర్

వితిక అనుకుంటే జాఫర్

ఎనిమిది మందిలో నలుగురు కంటెస్టెంట్లు సేఫ్ అవడంతో, మిగిలిన వితికా, వరుణ్, జాఫర్, పునర్నవిలలో ఎవరు ఎలిమినేట్ కాబోతున్నారన్నది సస్పెన్స్‌గా మారింది. వితికా షెరు ఎలిమినేట్ కావడం ఖాయమని చాలా మంది భావించారు. సోషల్ మీడియాలో కూడా వితికాకు వ్యతిరేకంగా బోలెడంత ప్రచారం జరిగింది. అయితే, ఆమె సేఫ్ జోన్‌లోకి వెళ్లిపోయింది. దీంతో జాఫర్ ఇంట్లో నుంచి బయటకు వచ్చేశారు. ఆయన వచ్చే ముందు హౌస్‌లో భావోద్వేగ సన్నివేశాలు కనిపించాయి.

జాఫరే ఎందుకంటే..

జాఫరే ఎందుకంటే..

జాఫర్ ఎలిమినేట్ అవడానికి స్వతహాగా ఆయన చేసుకున్న పనులే కారణం అన్నది అందరికీ తెలిసిందే. నన్ను ఎలిమినేట్ చేసేయండి.. నేను ఇంటికి వెళ్లిపోతా అని ఆయన అనడానికి తోడు, టాస్కులు చేయకుండా ఉండడం వల్ల జాఫర్‌కు ఓట్లు పడలేదనేది స్పష్టమవుతోంది. అయితే, రెండు వారాల్లో కలిసున్న వ్యక్తులు దూరమవుతుండడంతో ఆయన ఏడ్చుకుంటూ వచ్చేశారు.

రొమాన్స్ కోసమే ఉంచారంటూ..

రొమాన్స్ కోసమే ఉంచారంటూ..

మరోవైపు, వితికను ‘బిగ్ బాస్' హౌస్‌లో కావాలనే ఉంచారన్న టాక్ వినిపిస్తోంది. సోషల్ మీడియా వేదికగా చాలా మంది తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. ఇందులో ముఖ్యంగా.. వితిక వెళ్లిపోతే భార్య భర్తల రొమాన్స్ మిస్ అవుతారు. అదే జరిగితే రేటింగ్ పడిపోతుంది అని కొందరు కామెంట్లు చేస్తున్నారు. మరోవైపు, ఎలిమినేట్ అయిన జాఫరే ఇక్కడ అంతా సిస్టమాటిక్‌గా జరుగుతుందని చెప్పడం విశేషం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X