త్రినయిని సీరియల్ యాక్టర్ చందు సూసైడ్.. ఆత్మహత్యకు కారణం ఇదేనంటూ..!
త్రినయిని సీరియల్ నటుడు చందు చల్లా అలియాస్ చంద్రకాంత్ ఆకస్మిక మరణం టెలివిజన్ ఇండస్ట్రీని షాక్ గురిచేసింది. గత ఆరేళ్లుగా స్వర్గీయ పవిత్ర జయరాంతో వివాహేతర బంధం కొనసాగిస్తున్న ఆయన.. ఆమె మరణించిన రెండు, మూడు రోజులకే ఉరి వేసుకొని మరణించడం అనేక అనుమానాలకు తావిచ్చింది. అయితే ఈ మరణం వెనుక కారణాల్లోకి వెళితే..
పవిత్ర జయరాంతో చందు చల్లాకు సుదీర్ఘంగా వివాహేతర బంధం కొనసాగుతున్నది. అయితే దిగ్బ్రాంతికరమైన పరిస్థితుల్లో ఆమె మరణించడం అతడిని తీవ్ర వేదనకు గురి చేసింది. ఆమె మరణం తర్వాత గత కొద్ది రోజుల ఆయన మానసికంగా కుంగిపోయాడు. అయితే ఎవరితో మాట్లాడుకుండా ఒంటరిగా ఉంటున్నాడు అని స్నేహితులు తెలిపారు.

అయితే పవిత్ర జయరాం మరణం తర్వాత తీవ్రమైన డిప్రెషన్‌కు గురైన ఆయన శుక్రవారం సాయంత్రం నార్సింగిలోని అల్కాపూర్ కాలనీలోని తన నివాసంలో ఉరి వేసుకొని మరణించారు. ఈ ఘటన నార్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకోవడంతో పోలీసులు కేసు నమోదు చేసుకొని ప్రాథమికంగా దర్యాప్తు చేస్తున్నారు.
అయితే చందు వ్యక్తిగత జీవితానికి వస్తే.. శిల్ప అనే మహిళను 2015లో వివాహం చేసుకొన్నారు. రాధమ్మ పెళ్లి, కార్తీకదీపం సీరియల్ ద్వారా మంచి పాపులారిటిని సంపాదించుకొన్నారు. ఇక త్రినయిని సీరియల్‌తో మంచి పేరు వచ్చింది. అయితే లైఫ్‌లో మంచి పొజిషన్ సాధిస్తున్నారని అనుకొంటున్న సమయంలోనే అర్ధాంతరంగా ఈ లోకం నుంచి వెళ్లిపోయారు.
అయితే పవిత్ర జయరాం మరణంతో ఆయన తీవ్రంగా కుంగిపోయాడు. ఆమె మృతిని తట్టుకోలేక ఆత్మహత్య చేసుకొన్నాడనే ప్రచారం టెలివిజన్ ఇండస్ట్రీలో జరుగుతున్నది. ఈ క్రమంలో పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లి మృతికి ప్రేరేపించిన కారణాలపై ఆరా తీస్తున్నారు. ఆయన మృతిని అనుమానాస్పద మృతిగా నమోదు చేసి కేసు దర్యాప్తు చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











