Bigg Boss 7 Elimination.. ఎలిమినేషన్‌లో చివరకు ఇద్దరు.. ఇంటి నుంచి అవుట్ అయిన కంటెస్టెంట్ ఎవరంటే?
బిగ్‌బాస్ తెలుగు 7 షోలో తొలివారం ఎలిమినేషన్‌పై పెద్దగా ఆసక్తి కనబడలేదు. ఎందుకంటే వారం రోజుల్లో జరిగినది ఏమీ లేకపోవడం, అలాగే కంటెస్టెంట్లు సెటిల్ కావడానికే చాలా సమయం తీసుకొన్నారు. హౌస్ మేట్స్ కావడానికి టాస్క్ ఆడటంతోనే కాలం గడిచిపోయింది. ఇలాంటి పరిస్థితుల మధ్య తొలివారం ఎలిమినేషన్ ఎలా జరిగిందంటే..
కిరణ్ రాథోడ్ విషయానికి వస్తే.. తమిళ, తెలుగు భాషల్లో సీనియర్ నటి. సీనియర్ హీరోలతో కలిసి పనిచేశారు. దాంతో ఈ తరం నెటిజన్లకు, బుల్లితెర, ఓటీటీ ప్రేక్షకులకు పెద్దగా పరిచయం లేకపోయింది. దాంతో యంగ్ జనరేషన్ ప్రేక్షకులకు కిరణ్ రాథోడ్ పెద్దగా కనెక్ట్ కాలేకపోయింది. ఇక సోషల్ మీడియాలో కూడా అంతగా ఫాలోయింగ్ లేకపోవడం మరో మైనస్‌గా మారింది.

హోస్ట్ నాగార్జున అక్కినేని ఆదివారం చేపట్టిన ఎలిమినేషన్ ప్రక్రియలో చివరకు ప్రిన్స్ యావర్, కిరణ్ రాథోడ్ మాత్రమే మిగిలారు. వారిద్దరిని యాక్టివిటీ ఏరియాలోకి రావాలని హోస్ట్ నాగార్జున పిలిచారు. ఆక్కడ పెట్టిన రెండు డబ్బాలో పెట్టారు. ఏ డబ్బాలో అయితే రెడ్ బల్బ్ వెలిగితే వారు ఎలిమినేట్ అయినట్టు అని నాగార్జున చెప్పారు. ఆ తర్వాత ఉత్కంఠ క్షణాల మధ్య కిరణ్ రాథోడ్ నిలబడి ఉన్న డబ్బాపై రెడ్ లైట్ రావడంతో ఆమె ఎలిమినేట్ అయినట్టు ప్రకటించారు.
బిగ్‌బాస్ తెలుగు 7 రియాలిటీ షోలో అందరూ ఊహించినట్టే కిరణ్ రాథోడ్ ఎలిమినేట్ అయింది. ఇంటిలోకి వెళ్లినప్పటి నుంచి ఆమె వీక్ క్యాండిడేట్ అనే అభిప్రాయం నెటిజన్లు, బుల్లితెర ప్రేక్షకుల్లో నెలకొన్నది. వారం రోజుల్లోనే ఆమె ఇంటి నుంచి తిరిగి రావడం ఆశ్చర్యకరమైన విషయం కాదు. భాషా సమస్య ప్రధానంగా ఆమె ఆటకు అడ్డంకిగా మారింది. ఈ నేపథ్యంలో కిరణ్ రాథోడ్‌కు ఎలిమినేషన్ పెద్దగా ఆశ్చర్యం కలుగులేదు
కిరణ్ రాథోడ్ ఎలిమినేషన్ విషయాల్లోకి వెళితే.. ఇక ఇంటిలోకి వెళ్లిన తర్వాత భాషా సమస్య భారీగా వెంటాడింది. తెలుగులో కొంత కూడా ఆమె మాట్లాడలేకపోవడం వల్ల తోటి కంటెస్టెంట్లు కనెక్ట్ కాలేకపోయారు. ఎంతసేపు హిందీ వచ్చే ప్రిన్స్ యావర్‌తోనే కనెక్ట్ ఉండటం వల్ల ఆమె తన ఫెర్ఫార్మెన్స్ చూపించలేకపోయింది. దాంతో ఓటింగ్ శాతాన్ని మెరుగుపరుచుకోలేక ఇంటి నుంచి నిష్క్రమించాల్సిన పరిస్థితి ఏర్పడింది.
కిరణ్ రాథోడ్ ఎలిమినేట్ కావడంతో ఆమెను హోస్ట్ నాగార్జున తన వేదికపైకి పిలిచారు.ఆమెతో కలిసి వారం రోజుల జర్నీని చూశారు. ఆ తర్వాత ఇంటిలో ఉల్టా పల్టా ఎవరు అనే టాస్క్‌ను ఆమెకు ఇచ్చారు. పుల్టా అంటూ యావర్, షకీలా, శుభ శ్రీ తదితరుల పేర్లను చెప్పారు. ఉల్టా క్యాటగిరీలో పల్లవి ప్రశాంత్, రితికా రోజ్, శోభా శెట్టిని చేర్చారు. ఈ టాస్క్ అనంతరం ఆమె ఇంటి నుంచి వెళ్లిపోయారు.


Click it and Unblock the Notifications











