Bigg Boss Telugu 7: అప్పుడు,ఇప్పుడు అదే తప్పు... అయినా రతికా హౌస్‌లో గేమ్ ఛేంజర్!
బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 లో రతికా రోజ్ ఎంట్రీ ఇచ్చినప్పుడు ఎవరు ఈ భామ అంటూ అందరూ ఆరా తీశారు. ఇక ఈ భామ ఎంట్రీ తర్వాత సెన్సేషన్ సృష్టించింది. ప్రశాంత్ తో ప్రేమాయణం.. ఆ తర్వాత యావర్, అమర్ తో కలిసి రచ్చ చేయడం నెగిటివిటీ మూటగట్టుకుంది. ఇక ఎలిమినేట్ తర్వాత మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చింది. రీ ఎంట్రీ తర్వాత కూడా మళ్లీ అవే తప్పులు చేసింది రతికా రోజ్. అసలు రీఎంట్రీకి ముందు.. ఆ తర్వాత రతికా చేసిన తప్పులు ఏంటి.. అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.
రతికా రోజ్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. బిగ్ బాస్ దెబ్బకు ఆమె తెలుగు రాష్ట్రాల్లో ఫేమస్ అయిపోయింది. రతికా రోజ్ బిగ్ బాస్ తెలుగు 7లో అడుగుపెట్టినప్పుడు మొదటగా అందరినీ ఆకట్టుకుంది. ముఖ్యంగా ఈ భామ ఎంట్రీ తర్వాత నాగార్జున లవ్ బ్రేకప్ అంటూ మాట్లాడటం అందరిలో ఆసక్తి కలిగింది. ఇక రాహుల్ తో బ్రేకప్ విషయం నెటిజన్స్ కనపెట్టేశారు. ఇక రాహుల్ తో బ్రేకప్ తర్వాత హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చి రైతు బిడ్డ ఫేంను కొట్టేసేందుకు ట్రై చేసింది..

మొదటి వారం రైతు బిడ్డ చుట్టూ తిరిగిన రతికా ఆ తర్వాత లవ్ ట్రాక్ మొదలు పెట్టింది. ఆ తర్వాత అమర్ సరసన చేరి.. రైతు బిడ్డకు వెన్నుపోటు పొడిచింది. రీఎంట్రీకి ముందు రతిక చేసిన తప్పు... పల్లవి ప్రశాంత్ నెగిటివ్ ఉన్నాడు అనుకుని... టార్గెట్ చేసింది. ఇక పల్లవి ప్రశాంత్ విషయంలో తప్పులు చేస్తూ.. మరింత నెగిటివిటీ మూటగట్టుకుంది. నాలుగవ వారంలో ఎలిమినేట్ అయిపోయింది.
ఇక ఆ తర్వాత బిగ్ బాస్ పిలిచి మరీ అవకాశం ఇచ్చాడు. దీంతో ఈ భామ మళ్లీ తప్పు మార్గంలోనే వెళ్లింది. రీ ఎంట్రీ తర్వాత అమర్ దీప్ నెగిటివ్ అనుకుని... మళ్లీ పప్పులో కాలేసింది. అమర్ దీప్ ను టార్గెట్ చేస్తూ.. ఈ సారీ కూడా నెగిటివిటీ మూట గట్టుకుంది. దీంతో ఈ భామ ఎప్పుడు ఎిలిమినేట్ అవుతుందా అంటూ నెటిజన్స్ చూశారు. చివరకు ఈ వారం ఈ భామ ఔట్ అయినట్లు తెలుస్తోంది.

బిగ్ బాస్ హౌస్ లో మొత్తానికి రతికా రోజ్ గేమ్ చేంజర్ అని చెప్పవచ్చు. ఎందుకంటే... పల్లవి ప్రశాంత్ కు సింపతి రావడానికి ఒక కారణం రతికా రోజ్ అని చెప్పవచ్చు. ఆమె అతన్ని టార్గెట్ చేస్తూ.. ప్రశాంత్ కు సింపతి వచ్చేసింది. రీ ఎంట్రీ తర్వాత అమర్ కు సింపతి రావడానికి కారణం రతికానే. ఎందుకంటే.. బ్రిక్స్ గేమ్ లో రతికా రోజ్ అమర్ ను టార్గెట్ చేయడం...అమర్ ఎమోషనల్ అయిపోవడం.. ఇదంతా అమర్ కు పాజిటివ్ తీసుకువచ్చింది.

ఇక రతికారోజ్ కు నెగిటివిటీ తీసుకువచ్చింది. ఇక మూడో కారణం.. యావర్ గేమ్ ట్రాక్ తప్పడంలోనూ రతిక హస్తం ఉంది. టాప్ ప్లేయర్ ను టాప్ 5లో కూడా ఉండకుండ చేసింది మాత్రం రతికానే. ఇన్ని చేసిన రతికా రోజ్ నిజంగా గేమ్ చేంజర్ అనే చెప్పవచ్చు. ఇలా రతికా రోజ్ రీ ఎంట్రీ తర్వాత, ముందు చేసిన తప్పులు.. రతికాకు కాకుండా అమర్ ప్రశాంత్ లకు కలిసి వచ్చాయి.


Click it and Unblock the Notifications











