Krishna Mukunda Murari సీరియల్ యాక్టర్ ప్రియా రెమ్యునరేషన్ ఎంతో తెలుసా? యంగ్ హీరోయిన్లకు ధీటుగా!

తెలుగు వినోద పరిశ్రమలో నటి ప్రియ అంటే అందరికి సుపరితులే. సినిమాలు, షోలు, టెలివిజన్ సీరియల్స్‌తో పాపులారిటీని సొంతం చేసుకొన్న ఆమె అసలు పేరు మామిళ్ల శైలజా ప్రియ. అందం, అభినయంతో ఆకట్టుకొనే ఆమె.. తన నటనా ప్రతిభతో ఎంతో మంది అభిమానులను బుల్లితెర మీదనే కాకుండా వెండితెరపై సొంతం చేసుకొన్నది. ఆమె తాజాగా నటిస్తున్న సీరియల్ కృష్ణా ముకుంద మురారీ. ఈ సిరియల్‌లో నటించినందుకు గాను.. ప్రియా అందుకొంటున్న రెమ్యునరేషన్ వివరాల్లోకి వెళితే..

చిన్నతనంలోనే పెళ్లి.. సంతానం
ఏపీలోని బాపట్లకు చెందిన ప్రియ చిన్నతనం నుంచే సినిమాలంటే ఆమెకు ఆసక్తి. యాక్టర్ కావాలని కలలుకన్న ఆమె డిగ్రీ పూర్తి చేసుకొన్న వెంటనే సినిమా పరిశ్రమలోకి అడుగుపెట్టింది. అయితే వివాహం చేసుకొని పిల్లాడికి జన్మనిచ్చింది. ఆ తర్వాత సంతానం కోసం ఆమె సినిమా పరిశ్రమకు దూరంగా ఉండి.. చాలా ఏళ్ల తర్వాత రీ ఎంట్రీ ఇచ్చింది.

Remuneration for Mamilla Shailaja Priya for Top Rated Krishna Mukunda Murari Serial

1997 సంవత్సరంలో ఇండస్ట్రీలోకి
ప్రియ విషయానికి వస్తే..1997 సంవత్సరంలో దొంగాట సినిమా ద్వారా తెలుగు సినిమా పరిశ్రమలోకి అడుగుపెట్టింది. సంవత్సరానికి ఆరేడు సినిమాలతో జోష్ కొనసాగించింది. 2000 సంవత్సరం వరకు ఆమె బిజీగా షూటింగులతో గడిపింది. 2000 తర్వాత వ్యక్తిగత సమస్యల కారణంగా ఆమె సినిమా పరిశ్రమకు 10 ఏళ్లు దూరంగా ఉంది.

రీ ఎంట్రీ తర్వాత టాప్ హీరోలతో
కత్తి కాంతారావు సినిమాతో ప్రియా రీ ఎంట్రీ ఇచ్చింది. ఇప్పటి వరకు నాగార్జున, చిరంజీవి, బాలకృష్ణ లాంటి సీనియర్లతోపాటు యువ హీరోలతో జతకట్టింది. నటనపరంగా తన ప్రతిభతో భారమైన పాత్రల్లో మెప్పిస్తున్నది. వదిన, అక్క, అమ్మ లాంటి పాత్రలంటే ప్రియా అనే విధంగా గుర్తుండిపోయే పాత్రల్లో కనిపిస్తున్నారు.

Remuneration for Mamilla Shailaja Priya for Top Rated Krishna Mukunda Murari Serial

టెలివిజన్ సీరియల్స్‌తో బిజీగా
ఓ పక్క సినిమాలతో బిజీగా ఉంటూనే.. టెలివిజన్ సీరియల్స్‌తో బిజీగా మారింది. ప్రియా సాక్షి సీరియల్‌తో కెరీర్ మొదలుపెట్టి.. ప్రియా నిను చూడాలని, ప్రియా ఓ ప్రియా, సంఘర్షణ, లేడీ డిటెక్టివ్, శశిరేఖ పరిణయం, కల్యాణీ, నెంబర్ 1 కోడలు, ఒంటరి గులాబీ, కృష్ణా ముకుంద మురారీ సీరియల్స్‌తో బిజీగా ఉన్నారు.

కృష్ణా ముకుందా మురారీ సీరియల్స్‌తో
ప్రస్తుతం ఆమె నటిస్తున్న కృష్ణా ముకుందా మురారీ సీరియల్‌తో కీలక పాత్రలో నటిస్తున్నది. ఈటీవీ ప్రభాకర్ నిర్మిస్తున్న ఈ సీరియల్ ప్రస్తుతం తెలుగు సీరియల్స్‌లో టాప్ రేటింగ్ సొంతం చేసుకొన్నది. ఈ సిరియల్‌కు విశేష ఆదరణ లభిస్తున్నది. ఇతర సీరియల్స్‌కు ధీటుగా దీనిని ఆదరిస్తున్నారు. ఈ సీరియల్‌లో నటించినందుకు ప్రియా భారీ రెమ్యునరేషన్ అందుకొంటున్నది.

Remuneration for Mamilla Shailaja Priya for Top Rated Krishna Mukunda Murari Serial
రెమ్యునరేషన్ ఎంత తీసుకొంటుందంటే?
కృష్ణా ముకుందా మురారీ సీరియల్‌లో నటించిందుకు గాను.. శైలజా ప్రియాకు ప్రతీ రోజు 45 వేల రూపాయలు రెమ్యునరేషన్ అందుకొంటున్నారు. ప్రతీ నెలకు ఆమె సుమారుగా 20 రోజులు ఈ సీరియల్ కోసం పనిచేస్తుంటారు. అంటే.. నెలకు ఈ సీరియల్ ద్వారా 10 లక్షల రూపాయలు సంపాదిస్తుంటారని టెలివిజన్ వర్గాలు వెల్లడించాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X