Karthika Deepam 2 వంటలక్కకు భారీ రెమ్యునరేషన్.. కార్తీకదీపం 2 కు ప్రేమీ విశ్వనాథ్ పారితోషికం ఎంతో తెలుసా?

దక్షిణాదిలో టెలివిజన్ రంగంలో అత్యధిక పారితోషికం తీసుకొనే యాక్టర్లలో ప్రేమీ విశ్వనాథ్ ఒకరు. కార్తీకదీపం సీరియల్‌లో వంటలక్కగా, దీపగా తెలుగు వారి ఇంటింటికి చేరువైన ఈ నటికి బుల్లితెర ప్రేక్షకుల నుంచి విశేషమైన అభిమాన ఆదరణలు ఉన్నాయని కొత్తగా చెప్పనక్కర్లేదు. అయితే సుదీర్ఘంగా నెంబర్‌వన్ స్థానంలో సాగిన ఈ సీరియల్‌కు ప్రీక్వెల్‌గా వస్తున్న కార్తీకదీపం నవవసంతం సీరియల్‌తో మరోసారి వంటలక్క ప్రేక్షకులకు దగ్గరైంది. ప్రేమీ విశ్వనాథ్ కెరీర్, ఆమె తీసుకొనే రెమ్యునరేషన్ వివరాల్లోకి వెళితే..

తెలుగు బుల్లితెర మీదనే కాకుండా దక్షిణాది భాషల్లో టాప్ సీరియల్ నటిగా ప్రేమీ విశ్వనాథ్ గుర్తింపు తెచ్చుకొన్నారు. కేవలం కార్తీకదీపంతోనే ఆమె పేరు కూడా మర్చిపోయి వంటలక్కగా అందర్నీ ఆకట్టుకొన్నారు. దీపగా ఆమె తనదైన నటనతో తెలుగు మహిళాలోకానికి అత్యంత ఫేవరేట్‌గా మారింది.

Remuneration for Premi Viswanath for Karthika Deepam 2 Serial in Telugu

ప్రేమీ విశ్వనాథ్ కెరీర్ విషయానికి వస్తే.. కేవలం ఆరు సీరియల్స్‌లోనే నటించింది. 2014 నుంచి సుమారు 8 సంవత్సరాల కాలంలో దక్షిణాదిలో ఫుల్ ఫాలోయింగ్ ఉన్న బుల్లితెర నటిగా పాపులారిటీ సంపాదించింది. కరుతముత్తు అనే మలయాళ సీరియల్ ద్వారా వినోద పరిశ్రమలోకి ప్రవేశించింది.

Remuneration for Premi Viswanath for Karthika Deepam 2 Serial in Telugu

కరుతముత్తు సీరియల్ తర్వాత కుట్టికలవరా, మౌనమ్‌మణి, కాయంకులనమ్ కోచినున్నయుడే మకన్, కార్తీకదీపం, కార్తీకదీపం 2 సీరియల్‌లో నటించింది. మలయాళంలో ఆమె నటించిన కరుతముత్తు సీరియల్‌నే తెలుగులో కార్తీకదీపం సీరియల్‌గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

ఇక కార్తీకదీపం సీరియల్ 2 లో నటించిన ప్రేమీ విశ్వనాథ్ అలియాస్ వంటలక్క భారీ రెమ్యునరేషన్ అందుకొంటున్నారు. ఒక్క రోజు సీరియల్‌లో నటించినందుకు గాను 35 వేల రూపాయలు తీసుకొంటున్నారు. దాదాపు ఈ సీరియల్ కోసం సుమారుగా 20 రోజులు షూటింగులో పాల్గొంటారు. దాంతో నెలకు ఆమె ఆదాయం 7 నుంచి 8 లక్షల రూపాయలు ఉంటుంది అని టీవీ ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

Remuneration for Premi Viswanath for Karthika Deepam 2 Serial in Telugu

ఇక ప్రేమీ విశ్వనాథ్.. సినిమా రంగంలో కూడా మెప్పించే ప్రయత్నం చేశారు. అకమే అనే మలయాళ చిత్రంలో నటించింది. ఇక కస్టడీ అనే తెలుగు సినిమాలోను, సాల్మన్ 3డీ తమిళ చిత్రంలో నటించి మెప్పించే ప్రయత్నం చేసింది. ఇది కాకుండా చెల్లెలి కాపురం, గోరింటాకు, జాతరో జాతర సీరియల్స్‌లో కనిపించింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X