నీ గర్ల్ ఫ్రెండ్ ఉందిగా, ఆమెని అడుగు.. నీచమైన పని చేయమని అందరి ముందు అడిగాడు!
మీటూ ఉద్యమంతో రోజుకు ఒక వేధింపుల ఉందంతం బయటకు వస్తోంది. నటీమణులు బయటపెడుతున్న విషయాలతో చిత్ర పరిశ్రమలో ఇంత దారుణంగా వేధింపులు జరుగుతున్నాయా అని అంతా ఆశ్చర్యపోతున్నారు. మీటూ ఉద్యమం వలన బాలీవుడ్ లో భారీ చిత్రాలే ఆగిపోయిన పరిస్థితి గమనిస్తున్నాం. బుల్లి తెరపై నటీమణులు కూడా దారుణమైన వేధింపుల వ్యవహారాల్ని బయట పెడుతున్నారు. తాజా బిగ్ బాస్ 8 సీజన్ తో పాపులర్ అయిన బుల్లితెర భామ రెనీ ధ్యాని సంచలన వ్యాఖ్యలు చేసింది.

పార్టీలో తాగేసి ఉన్నాం
తమాంతా ఓ పార్టీలో మద్యం సేవించి ఉన్నామా అని రెనీ ధ్యాని తెలిపింది. నేను లిమిట్ గానే ఆల్కహాల్ సేవించాను. ఆ సమయంలో తాన్ సహనటుడు ఒకరు చాలా దారుణంగా ప్రవర్తించాడని అప్పుడు జరిగిన ఉదంతాన్ని బయట పెట్టింది. కానీ ఆ నటుడి పేరు వెల్లడించేందుకు మాత్రం ధ్యాని ఇష్టపడలేదు.

నీచమైన పని చేయమని
తనతో శృంగారంలో పాల్గొనాలని అడిగాడు. అంతకంటే ముందు అసభ్యంగా పేర్కొనలేని పని చేయమని అందరి ముందు అడిగాడని ధ్యాని వెల్లడించింది. నా పట్టరాని కోపం వచ్చింది. చుట్టూ ఉన్నవారంతా సైలెంట్ అయిపో అని నన్ను సముదాయించడానికి ప్రయత్నించారు కానీ అతడిని ఒక్క మాట కూడా అనలేదు.

అతడి గర్ల్ ఫ్రెండ్ కూడా అక్కడే
2016 లో ఓ టీవీ షోలో తన పాత్ర పూర్తయిన సందర్భంగా ఆ పార్టీ నిర్వహించారని రేనీ ధ్యాని తెలిపింది. అలా అసభ్యంగా ప్రవర్తించిన సమయంలో అతడి గర్ల్ ఫ్రెండ్ కూడా అక్కడే ఉంది. రేనీ నువ్వు రియాక్ట్ అవ్వకు.. సైలెంట్ గా ఉండు అంటూ షో దర్శకుడు నాతో అన్నాడు. అతడిని ఊరికే వదిలిపెట్టను. ఆ మాట అనడానికి ఎంత ధైర్యం అంటూ వాదించానని రేనీ తెలిపింది.

అదే మాట ఆమెని అడుగు
తనని చేయమని చెప్పిన నీచమైన పనిని నీ గర్ల్ ఫ్రెండ్ అని అడుగు అంటూ ముఖం మీదే గట్టిగా అరిచేశాను. అప్పటివరకు అతడు నాకు స్నేహితుడిగానే ఉన్నాడు. ఆ క్షణంతో అతడి నుంచి దూరంగా ఉంటున్నట్లు రేనీ ధ్యాని తెలిపింది.

పేరు చెప్పుదామని అనుకున్నా
ముందుగా అతడి పేరు కూడా బయట పెడదామని భావించానని రేనీ ధ్యాని తెలిపింది. కానీ ప్రస్తుతం అతడి తండ్రికి ఆరోగ్యం సరిగా లేదు. అందువల్ల అతడి పేరు బయటపెట్టలేకపోతున్నానని తెలిపింది. నాతో అసభ్యంగా ప్రవర్తించినట్లుగానే అతడి రెండవ ప్రియురాలితో కూడా ప్రవర్తించాడు. ప్రస్తుతం వారిద్దరూ విడిపోయారని రేనీ ధ్యాని తెలిపింది.


Click it and Unblock the Notifications











