బుల్లితెరపై రేణుదేశాయ్ స్పెషల్ ఎంట్రీ.. పార్వతీ దేవీగా పాపులర్ సీరియల్‌లో రోల్!
ప్రముఖ నటి, దర్శకురాలు, హోస్ట్ రేణు దేశాయ్ మరో సరికొత్త అవతారంలో కనిపించేందుకు సిద్ధమయ్యారు. బుల్లితెరకు కొత్త కాకపోయినప్పటికీ.. ప్రస్తుతం తెలుగు టెలివిజన్ ఇండస్ట్రీలో అత్యంత ప్రేక్షకదారణ పొందిన సీరియల్స్‌లో ఒకటైన ధారావాహికలో కీలక పాత్రను పోషించారు. ఆ పాత్రకు సంబంధించిన వివరాలు, రేణుదేశాయ్ బుల్లితెర ప్రయాణం గురించి మరింత సమాచారం మీ కోసం..

టాలీవుడ్‌లో హీరోయిన్‌గా
హీరోయిన్‌గా టాలీవుడ్‌లోకి అడుగుపెట్టి.. పలు చిత్రాల్లో తనదైన నటనను, గ్లామర్‌ను ప్రదర్శించిన రేణుదేశాయ్ వ్యక్తిగత కారణాల వల్ల కొంతకాలం సినిమా పరిశ్రమకు దూరంగా ఉన్నారు. ఆ తర్వాత తెలుగు డ్యాన్స్ రియాలిటీ షోలో హోస్ట్‌గా తన మార్కును చాటుకొన్నారు.

రచన, నిర్మాణ, దర్శకత్వ విభాగాలపై
అంతేకాకుండా సినిమాలకు సంబంధించిన రచన, దర్శకత్వం విభాగాలపై దృష్టిపెట్టారు. కొన్ని షార్ట్ ఫిలింస్ కూడా చేయడానికి ప్రయత్నించారు. మరాఠీలో కూడా ఓ సినిమాను రూపొందించారు. ఈ క్రమంలో రాధమ్మ కూతురు సీరియల్ ద్వారా టెలివిజన్ రంగంలోకి ప్రవేశించారు.

200 ఎపిసోడ్స్‌తో రాధమ్మ కూతురు
రాధమ్మ కూతురు సీరియల్ ఇటీవలే 200 ఎపిసోడ్స్ పూర్తి చేసుకొన్నది. ఈ సిరియల్‌లో అక్షరగా దీప్తి మానే, గోకుల్‌గా అరవింద్ నటించారు. వీరిద్దరి కెమిస్ట్రీకి సోషల్ మీడియాలో భారీగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. వారిద్దరి లవ్ స్టోరికి మంచి ఆదరణ లభిస్తున్నది.

దివి నుంచి భువికి వచ్చిన దేవతగా
ఇంతటి క్రేజ్ ఉన్న రాధమ్మ కూతురు సీరియల్‌లో పార్వతీదేవిగా రేణుదేశాయ్ నటించనున్నారు. అక్షర, అరవింద్ చేసిన పూజలకు సంతోషించిన పార్వతీదేవి దివి నుంచి భూవికి దిగి వచ్చిన పార్వతీదేవీగా దర్శనం ఇవ్వబోతున్నారు. ఇది కేవలం అతిథి పాత్ర కావడం గమనార్హం.

రేణు దేశాయ్ ఫోటోలు వైరల్
రాధమ్మ కూతురు షూటింగులో అక్షర, అరవింద్‌తో కలిసి దిగిన రేణు దేశాయ్ ఫోటో వైరల్‌గా మారింది. రేణు దేశాయ్‌కి సంబంధించిన ఎపిసోడ్ మార్చి 25, మార్చి 26 అంటే గురువారం, శుక్రవారం ప్రసారం కానున్నది. రేణు దేశాయ్ ప్రత్యేక పాత్ర ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకొంటుందనే అభిప్రాయాన్ని నిర్వాహకులు వ్యక్తం చేస్తున్నారు.

బహుముఖ ప్రతిభాశాలిగా రేణు దేశాయ్
రేణు దేశాయ్ విషయానికి వస్తే.. బద్రి చిత్రంతో హీరోయిన్‌గా కెరీర్ ఆరంభించారు. ఆ తర్వాత జేమ్స్ పాండు, జానీ చిత్రాల్లో నటించారు. ఆ తర్వాత సినీ రంగంలో పలు విభాగాల్లో తన ప్రతిభను చాటుకొన్నారు. ఖుషీ, జానీ, గుడంబా శంకర్, బాలు, అన్నవరం సినిమాలకు క్యాస్టూమ్ డిజైనర్‌గా, ఎడిటర్‌గా పనిచేశారు. మంగళాష్టక్ వన్స్ మోర్, ఇష్క్ వాలా లవ్ చిత్రాలకు నిర్మాతగా, దర్శకురాలిగా తన టాలెంట్‌ను రుజువు చేసుకొన్నారు.


Click it and Unblock the Notifications











