ప్రేమ మీద నమ్మకం పోయింది, నా పెళ్లికి ఇన్వైట్ చేస్తా: రేణు దేశాయ్ కంటతడి!

‘నీతోనే డాన్స్’ కార్యక్రమానికి జడ్జిగా వ్యవహరిస్తున్న రేణు దేశాయ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.ఒకప్పుడు ప్రేమ మీద నమ్మకం పోయిందని, ఇపుడు ప్రేమతో ప్రేమలో పడ్డానని, త్వరలో పెళ్లి చేసుకుంటానన్నారు.

By Bojja Kumar

Recommended Video

పవన్ మళ్లీ పెళ్లి చేసుకున్నపుడు.. రేణు దేశాయ్ ఎందుకు చేసుకోకూడదు: రేణు దేశాయ్ కంటతడి!

పవన్ కళ్యాణ్ మాజీ భార్య, న‌టి, నిర్మాత ప్రస్తుతం మాటీవీలో ప్రసారం అవుతున్న 'నీతోనే డాన్స్' అనే డాన్స్ రియాల్టీషోకు జడ్జిగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. తొలిసారిగా ఆమె బుల్లితెరపై చేస్తున్న కార్యక్రమం కావడంతో మంచి రెస్పాన్స్ వస్తోంది.

వచ్చే శని, ఆదివారాల్లో ప్రసారం అయ్యే కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదలైంది. ఇందులో ఓ సందర్భంలో రేణు దేశాయ్ స్పందించిన తీరు హాట్ టాపిక్ అయింది. తనకు ప్రేమ మీద నమ్మకం పోయిందంటూ ఆమె భావోద్వేగానికి గురయ్యారు.

ఆ జంటను చూసిన తర్వాత రేణు దేశాయ్ భావోద్వేగం

ఆ జంటను చూసిన తర్వాత రేణు దేశాయ్ భావోద్వేగం

బుల్లితెరకు చెందిన ఓ జంట ఈ కార్యక్రమంలో డాన్స్ చేశారు. వారు డాన్స్ చేసిన అనంతరం రేణు దేశాయ్ భావోద్వాగానికి గురయ్యారు. ఆమెకు ఏ విషయం గుర్తొచ్చిందో తెలియదు కానీ ఒక్కసారిగా ఆమె కళ్లలో కన్నీళ్లు ఉప్పొంగాయి.

ప్రేమ మీద నమ్మకం పోయిందంటూ...

ప్రేమ మీద నమ్మకం పోయిందంటూ...

నాకు ప్రేమ మీద నమ్మకం పోయింది. కానీ మీ జంటను చూసిన తర్వాత ఇప్పుడు మరోసారి నేను ప్రేమతో ప్రేమలో పడ్డాను... అంటూ రేణు దేశాయ్ ఎమోషనల్ అయ్యారు.

నా వివాహానికి ఇన్వైట్ చేస్తాను

నా వివాహానికి ఇన్వైట్ చేస్తాను

నేను ఎప్పుడు పెళ్లి చేసుకోవాల‌నుకుంటానో అప్పుడు మిమ్మ‌ల్ని త‌ప్ప‌కుండా ఇన్వైట్ చేస్తాను.... అంటూ రేణు దేశాయ్ ఆ జంటను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఓ వైపు ఆమె రెండో వివాహంపై రకరకాల చర్చ జరుగుతున్న తరుణంలో ఆమె ఇలాంటి వ్యాఖ్యలు చేయడం హాట్ టాపిక్ అయింది.

 ఉదయభాను కూడా

ఉదయభాను కూడా

రేణు దేశాయ్ కన్నీటి పర్యంతం అవ్వడంతో.... ఈ షోకు యాంకరింగ్ చేస్తున్న ఉదయభాను కళ్లు కూడా చమర్చాయి.

మరో పెళ్లి చేసుకుని సంతోషంగా ఉండండి

మరో పెళ్లి చేసుకుని సంతోషంగా ఉండండి

రేణు దేశాయ్ నోట పెళ్లి విషయం రగానే..... మీరు మళ్లీ పెళ్లి చేసుకుని సంతోషంగా ఉండండి అంటూ చాలా మంది అభిమానులు కామెంట్స్ పెట్టారు. అయితే కొందరు మాత్రం మీరు మళ్లీ పెళ్లి చేసుకోవద్దంటూ కామెంట్స్ చేశారు. పవన్ మళ్లీ పెళ్లి చేసుకున్నపుడు... రేణు దేశాయ్ ఎందుకు చేసుకోకూడదు అంటూ కొందరు ప్రశ్నించారు.

వీడియో ఇదే

ఈ కార్యక్రమంలో రేణు దేశాయ్ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియా ద్వారా రిలీజ్ చేశారు. ఆ వీడియోపై మీరూ ఓ లుక్కేయండి. రాబోయే శ‌ని, ఆదివారాల్లో రాత్రి 9 గంట‌ల‌కు ఈ కార్యక్రమం ప్రసారం కానుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X