రేణు దేశాయ్ స్పందన: బిగ్ బాస్ షో హోస్ట్ చేయాలనుకుంటోంది, నటిగా రీ ఎంట్రీ!

Recommended Video

Renu Desai To Host Bigg Boss Telugu Season 3? || Filmibeat Telugu

ఇండియాలో బాగా పాపులర్ అయిన, వివాదాలకు కేంద్ర బిందువుగా ఉండే రియాల్టీ షోలలో బిగ్ బాస్ ముందు వరుసలో ఉంటుంది. హిందీలో సక్సెస్ కావడంతో ఇతర భాషల్లోనూ ఈ షో మొదలైంది. తెలుగులో ఆల్రెడీ రెండు సీజన్లు విజయవంతంగా పూర్తి చేసుకోవడంతో పాటు... త్వరలో 3వ సీజన్ మొదలు పెట్టేందుకు నిర్వాహకులు ఆల్రెడీ తెర వెనక ప్రయత్నాలు మొదలు పెట్టారు. కంటెస్టెంట్స్ ఎంపిక జరుగుతోంది.

ఏ షో అయినా మొదలయ్యకే హాట్ టాపిక్ అవుతుంది. అయితే బిగ్ బాస్ షో మాత్రం అందుకు పూర్తి భిన్నం. రెండు మూడు నెలల ముందు నుంచే ఇందులో పాల్గొనబోయే కంటెస్టెంట్ ఎవరు? అనే అంశంపై ఆసక్తికర చర్చసాగుతుంది. నిర్వాహకులు కూడా చివరి నిమిషం వరకు ఈ విషయాన్ని రహస్యంగా ఉంచి ఆడియన్స్‌ను సర్‌ప్రైజ్ చేస్తుంటారు.

తెరపైకి రేణు దేశాయ్ పేరు

తెరపైకి రేణు దేశాయ్ పేరు

బిగ్ బాస్ తెలుగు సీజన్ 3లో పాల్గొనబోయేది వీరే అంటూ ఇటీవల పలువురు సెలబ్రిటీల పేర్లు తెరపైకి వచ్చాయి. ఇందులో పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ పేరు కూడా వినిపించడంతో అందరిలోనూ ఆసక్తి నెలకొంది. ఆమె ఈ షోలోకి ఎంటరైతే షో మరింత రసవత్తరంగా మారుతుందనే అభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి.

క్లారిటీ ఇచ్చిన రేణు దేశాయ్

క్లారిటీ ఇచ్చిన రేణు దేశాయ్

తాను బిగ్ బాస్ షోలో పాల్గొనబోతున్నట్లు వస్తున్న వార్తలపై రేణు దేశాయ్ క్లారిటీ ఇచ్చారు. ఈ విషయంలో తనకు చాలా మంది నుంచి సందేశాలు, ఫోన్లు వస్తున్నాయని, వారందరికీ నేను ఒకటే చెబుతున్నాను. బిగ్ బాస్ షోలో కంటెస్ట్ చేయడం లేదు. అదంతా తప్పుడు ప్రచారమే అని స్పష్టం చేశారు.

బిగ్ బాస్ షో హోస్ట్ చేయడం అంటే ఇష్టం

బిగ్ బాస్ షో హోస్ట్ చేయడం అంటే ఇష్టం

అయితే తనకు బిగ్ బాస్ షోలో కంటెస్ట్ చేయడం కంటే ఆ షోను హోస్ట్ చేయడాన్ని చాలా ఇష్టపడతాను. అయితే అలాంటి అవకాశం నాకు వస్తుందో లేదో తెలియదు. కానీ ఇలాంటి హిట్ షోను హోస్ట్ చేస్తే ప్రజెంటర్‌గా నా స్కిల్స్ మరింత డెవలప్ చేసుకోవచ్చని భావిస్తున్నాను... అని ఓ ఆంగ్లపత్రికతో రేణు దేశాయ్ తెలిపారు.

ప్రస్తుతం స్క్రిప్టు పనిలో బిజీ, త్వరలో నటిగా రీ ఎంట్రీ

ప్రస్తుతం స్క్రిప్టు పనిలో బిజీ, త్వరలో నటిగా రీ ఎంట్రీ

దర్శకురాలు, నిర్మాత, రచయిత అయిన రేణు దేశాయ్ ప్రస్తుతం స్క్రిప్టు వర్కులో బిజీగా ఉన్నట్లు వెల్లడించారు. అంతే కాకుండా నటిగా కూడా సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వాలనే ఆలోచనలో ఉన్నారట. రేణు దేశాయ్ నుంచి త్వరలో ఓ సినిమా రానుందనే విషయం స్పష్టమవుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X