Reshma Pasupuleti : టైట్ ఫిట్‌లో బుల్లితెర బ్యూటీ గ్లామర్ ట్రీట్ .. అందం సెగలు కక్కుతోందిగా
సాధారణ న్యూస్ రీడర్‌గా కెరీర్ ప్రారంభించి సెలబ్రెటీలుగా మారినవారు మన చుట్టూ ఎందరో ఉన్నారు. జబర్దస్త్ అనసూయ భరద్వాజ్, కోలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియా భవానీ శంకర్ వీరిలో కొందరు. ఈ కోవలోకే వస్తారు రేష్మా పసుపులేటి. తొలినాళ్లలో ఓ తెలుగు న్యూస్ ఛానెల్‌లో ఇంగ్లీష్ న్యూస్ రీడర్‌గా ఆమె కెరీర్ ప్రారంభించారు. అనంతరం సినిమాలపై ఆసక్తితో ఇండస్ట్రీలో అడుగుపెట్టి సీరియల్స్, షోలలో దున్నేస్తున్నారు.
1983 జూలై 23న చెన్నైలో స్థిరపడిన తెలుగు కుటుంబంలో జన్మించారు రేష్మా పసుపులేటి. అనంతరం అమెరికాలోని అర్కాన్సాస్‌లో ప్రాథమిక విద్యను , టెక్సాస్ ఏ అండ్ ఎం యూనివర్సిటీలో కంప్యూటర్ సైన్స్‌లో ఇంజనీరింగ్ పట్టా పొందారు. చదువు తర్వాత పాటు సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేసిన రేష్మ.. అనంతరం అమెరికన్ ఎవియేషన్ కంపెనీ డెల్టా ఎయిర్‌లైన్స్‌కు ఎయిర్ హోస్టెస్‌గానూ పనిచేశారు. తర్వాతి కాలంలో ఇండియాకు తిరిగొచ్చిన రేష్మా పసుపులేటీ .. అనంతరం ఓ తెలుగు న్యూస్ ఛానెల్‌లో ఇంగ్లీష్ న్యూస్ రీడర్‌గా ఉద్యోగంలో చేరారు.

తర్వాతి రోజుల్లో నటనపై ఆసక్తితో ఉద్యోగానికి రాజీనామా చేసిన రేష్మా పసుపులేటి సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వాలని అనుకున్నారు. తొలుత బుల్లితెరపై సత్తా చాటి ఆ తర్వాత అవకాశాల కోసం ప్రయత్నించాలని ఆమె వ్యూహాత్మకంగా వ్యవహరించారు. దీనిలో భాగంగా తమిళ సీరియల్ వంశంలో కీలక పాత్ర పోషించారు. ఈ సీరియల్‌తో తమిళనాట పాపులర్ అయిన రేష్మ పసుపులేటికి 2015లో మసాల పాదంలో హీరోయిన్‌గా ఛాన్స్ దక్కింది. అనంతరం కో 2, మనల్ కయైరు 2, తిరైక్కు వరద కథై, వనక్కమ్ దా మపిల్లై, పే మామ, 3:33, సతియ సోతనై, సూరగాన్ వంటి తమిళ చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.
తర్వాత మలయాళంలోనూ గర్ల్స్ అనే మూవీలో కనిపించారు. 2022లో ఆనంద్ దేవరకొండ నటించిన సస్పెన్స్ థ్రిల్లర్ హైవేలోనూ రేష్మా కీలకపాత్ర పోషించారు. కేవీ గుహన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద నిరాశ పరిచింది. సినిమాల్లో అవకాశాలు దక్కపోయినా బుల్లితెరపై మాత్రం రేష్మ తిరుగులేని నటిగా వెలుగొందుతున్నారు. తెలుగు, తమిళంలలో సీరియల్స్, షోలలో వరుసపెట్టి అవకాశాలు అందుకుంటూ బిజీగా ఉన్నారు. ఈ పాపులారిటీతో తమిళ్ బిగ్‌బాస్ 3లోనూ అవకాశం దక్కించుకుని తన అంద చందాలతో హౌస్‌కి గ్లామర్ తీసుకొచ్చారు.
ఇకపోతే.. సుచీ లీక్స్ పేరిట గతంలో సింగర్ సుచిత్ర ఇండస్ట్రీలోని చీకటి కోణాలను బయటపెట్టిన సంగతి తెలిసిందే. ఈ సుచీ లీక్స్ బాధితుల్లో రేష్మా పసుపులేటి కూడా ఉన్నారు. ఓఇక సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే రేష్మ.. ఎప్పటికప్పుడు హాట్ హాట్ ఫోటో షూట్‌లతో కుర్రకారుకు నిద్రలేకుండా చేస్తున్నారు. తాజాగా క్రీమ్ కలర్ స్లీవ్ లెస్ టైట్ ఫిట్‌లో భారీ అందాలు చూపెడుతున్న ఫోటోలను రేష్మ షేర్ చేశారు. ప్రస్తుతం ఈ పిక్స్ ఇన్‌స్టాగ్రామ్‌లో ట్రెండ్ అవుతున్నాయి. మరి ఇంకేందుకు ఆలస్యం ఆ అందాలపై మీరూ ఓ లుక్కేయండి.


Click it and Unblock the Notifications











