Reshma Pasupuleti : హద్దులు దాటేసిన బుల్లితెర బ్యూటీ.. అసలే టైట్ డ్రెస్, అందాలు దాగుతాయా!
వినోదం రంగం, న్యూస్ టెలివిజన్ ఛానెల్స్‌లో న్యూస్ రీడర్లుగా కెరీర్ ప్రారంభించిన ఎంతో మంది అమ్మాయిలు స్టార్లుగా వెలుగొందుతున్నారు. అనసూయ భరద్వాజ్, శ్రీరెడ్డి, ప్రియా భవానీ శంకర్ వీరిలో కొందరు. ఈ కోవలోకే వస్తారు రేష్మా పసుపులేటి. తొలినాళ్లలో తెలుగు న్యూస్ ఛానెల్‌లో ఇంగ్లీష్ న్యూస్ రీడర్‌గా ఆమె కెరీర్ ప్రారంభించారు. తర్వాత నటన వైపు వెళ్లిన ఈమె సినిమాలు, సీరియల్స్, షోలలో దున్నేయడమే కాకుండా మంచి పాపులారిటీని సంపాదించుకొంటున్నారు..
రేష్మా పసుపులేటి 1983 జూలై 23న జన్మించారు . అమెరికాలోని అర్కాన్సాస్‌లో ప్రాథమిక విద్యను , టెక్సాస్ ఏ అండ్ ఎం యూనివర్సిటీలో కంప్యూటర్ సైన్స్‌లో ఇంజనీరింగ్ పట్టా పొందారు. చదువు పూర్తి చేసిన తర్వాత కొంతకాలం సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేసిన రేష్మ.. అనంతరం అమెరికన్ ఎవియేషన్ కంపెనీ డెల్టా ఎయిర్‌లైన్స్‌కు ఎయిర్ హోస్టెస్‌గానూ పనిచేశారు. తర్వాతి కాలంలో భారతదేశానికి తిరిగొచ్చిన రేష్మా పసుపులేటీ.. ఓ తెలుగు న్యూస్ ఛానెల్‌లో ఇంగ్లీష్ న్యూస్ రీడర్‌గా చేశారు.

న్యూస్ రీడర్ ఉద్యోగానికి స్వస్తి పలికి నటన వైపు మొగ్గు చూపిన రేష్మా పసుపులేటి తమిళ సీరియల్ వంశంలో కీలక పాత్ర పోషించారు. సీనియర్ నటి రమ్యకృష్ణ లీడ్ రోల్‌లో నటించారు. ఈ సీరియల్‌తో తమిళనాట పాపులర్ అయిన రేష్మ పసుపులేటికి 2015లో మసాల పాదంలో హీరోయిన్‌గా ఛాన్స్ దక్కింది. శివ, బాబీ సింహాలు ఇందులో కీలకపాత్రలు పోషించారు. అనంతరం కో 2, మనల్ కయైరు 2, తిరైక్కు వరద కథై, వనక్కమ్ దా మపిల్లై, పే మామ, 3:33, సతియ సోతనై, సూరగాన్ వంటి తమిళ చిత్రాల్లో నటించారు.
తర్వాత మలయాళంలోనూ గర్ల్స్ అనే మూవీలో కనిపించారు. 2022లో ఆనంద్ దేవరకొండ నటించిన సస్పెన్స్ థ్రిల్లర్ హైవేలోనూ రేష్మా పసుపులేటి కీలకపాత్ర పోషించారు. కేవీ గుహన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా పెద్దగా ఆకట్టుకోలేదు. సినిమాల్లో అవకాశాలు దక్కపోయినా బుల్లితెరపై మాత్రం రేష్మ తన హవా చూపిస్తున్నారు. తెలుగు, తమిళ రంగాలలో సీరియల్స్, షోలలో వరుసపెట్టి అవకాశాలు అందుకుంటూ బుల్లితెరపై తిరుగులేని స్టార్‌గా వెలుగొందుతున్నారు. తమిళ్ బిగ్‌బాస్ 3 రియాలిటీ షోలోనూ అడుగుపెట్టి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.
ఇకపోతే.. సుచీ లీక్స్ పేరిట గతంలో సింగర్ సుచిత్ర చిత్ర పరిశ్రమలోని చీకటి కోణాలను బయటపెట్టిన సంగతి తెలిసిందే. ఈ సుచీ లీక్స్ బాధితుల్లో రేష్మా పసుపులేటి కూడా ఉన్నారు. ఓ ఆఫీస్‌లో ఓ వ్యక్తితో ఆమె క్లోజ్‌గా ఉన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీని వల్ల తన పరువు ప్రతిష్టలకు భంగం కలిగినట్లుగా రేష్మ పలుమార్లు వాపోయారు.
ఇక సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే రేష్మ.. ఎప్పటికప్పుడు హాట్ హాట్ ఫోటో షూట్‌లతో కుర్రకారుకు నిద్రలేకుండా చేస్తారు. తాజాగా స్లీవ్ లెస్ టైట్ ఫిట్‌లో భారీ అందాలు చూపెడుతూ.. నిక్కర్‌తో ఉన్న ఫోటోలను రేష్మ షేర్ చేశారు. ప్రస్తుతం ఈ పిక్స్ ఇన్‌స్టాగ్రామ్‌లో ట్రెండ్ అవుతున్నాయి. మరి ఇంకేందుకు ఆలస్యం మీరూ చూసేయండి.


Click it and Unblock the Notifications











