రష్మీ, సుధీర్ పెళ్లి చేసుకొన్నారా? ఎప్పుడు.. ఎక్కడ?
Recommended Video

తెలుగు టెలివిజన్ పరిశ్రమలో యాంకర్లు, నటులు రష్మీ గౌతమ్, సుడిగాలి సుధీర్ మధ్య అఫైర్ గాసిప్స్‌కు ఎంత క్రేజ్ చెప్పనక్కర్లేదు. వారి అఫైర్ గురించి మీడియాలో వస్తున్న గాసిప్స్‌కు తగినట్టే ఆన్‌స్క్రీన్ రొమాన్స్‌ను పండిస్తారు. దాంతో ఆ వార్తలకు మరింత బలం చేకూరుతుంది. తాజాగా రష్మీ, సుధీర్ పెళ్లి చేసుకొన్న వీడియో ఒకటి సంచలనం రేపింది. ప్రస్తుతం యూట్యూబ్‌లో టాప్ ట్రెండింగ్‌గా నిలిచింది.

రోజాకు వెడ్డింగ్ కార్డు
వీడియోలో తొలుత నటి రోజా దగ్గరకు వెళ్లి వెడ్డింగ్ కార్డును రష్మీ, సుధీర్ అందజేసి తాము పెళ్లి చేసుకొంటున్నామని చెబుతారు. ఆ తర్వాత నాగబాబు, డ్యాన్స్ మాస్టర్ శేఖర్ వద్దకు వెళ్లి పెళ్లి కార్డులు అందిస్తారు.

నాగబాబు కామెంట్
పెళ్లి కార్డులు అందించిన రష్మీ, సుధీర్‌ను చూసి నాగబాబు చాలా స్పీడ్‌గా ఉన్నారు. హ్యాపీ మ్యారేజ్ లైఫ్ అంటూ విషెస్ చెబుతాడు. అలాగే వారి కార్డు చూసి శేఖర్ మాస్టర్ బిత్తరపోతాడు. వెంటనే పెళ్లి శుభకాంక్షలు అంటూ విష్ చేస్తారు.

పెళ్లికూతురుగా రష్మీ
ఆ తర్వాత అందంగా పెళ్లికూతురిలా ముస్తాబు చేసిన రష్మీని పెళ్లి మంటపంపైకి తీసుకొస్తారు. వెంటనే పెళ్లికొడుకు గెటప్‌లో ఉన్న సుధీర్‌ను వేదికపైకి తెస్తారు.

పెళ్లి కొడుకుగా సుధీర్
పెళ్లిపీటల మీద కూర్చోబెట్టిన తర్వాత రష్మీ సంతోషంలో మునిగిపోయినట్టు కనిపిస్తుంది. అలాగే సుధీర్ నుదుటికి బాసింగం కట్టుకొని పెళ్లి కళ ముఖంపై కదలాడుతుండగా ఆనందంగా ఉంటాడు.

అక్షింతలు చల్లుకొని
పెళ్లి పీటలపై అక్షింతలు వేసుకోవడం, పెళ్లి తర్వాత కార్యక్రమాలు ఆశ్చర్య పరిచే విధంగా ఉంటాయి.

అక్షింతలు వేసి దీవెనలు
ఆ తర్వాత పెళ్లి చేసుకొన్న రష్మీ, సుధీర్ దంపతులపై నాగబాబు, రోజా, శేఖర్ మాస్టర్ ఇంకా పలువురు అక్షింతలు వేసి దీవించారు.

పెళ్లి తర్వాత డ్యాన్సులు
పెళ్లి తర్వాత అందరితో కలిసి రష్మీ, సుధీర్ పాటకు అనుగుణంగా నృత్యాలు చేస్తారు. ఇదంతా చూసి నిజంగా పెళ్లి అనుకొంటే పొరపాటు పడినట్టే.

అహ నా పెళ్లంట షో కోసం
ఉగాది సందర్భంగా త్వరలో ప్రసారం కాబోతున్న అహ నా పెళ్లంట అనే కార్యక్రమం కోసం ఈ పెళ్లి వీడియోను ప్రోమోగా చిత్రీకరించారు. ఈ ప్రోమో షూటింగ్‌లో జబర్దస్త్ టీమ్ సభ్యులు కూడా పాల్గొన్నారు.


Click it and Unblock the Notifications











