Bigg Boss: శ్రీ సత్య, శ్రీహాన్ రిలేషన్‌పై నోరు జారిన రేవంత్.. దానితో పోల్చుతూ మరీ ఘోరంగా!
తెలుగు బుల్లితెరపై వివాదాలకు కేరాఫ్ అడ్రెస్‌గా నిలుస్తూ సంచలనంగా మారిపోయిన షోనే బిగ్ బాస్. ఎవరూ ఊహించని కంటెంట్‌తో సాగే దీనికి ప్రేక్షకులు ఆశించిన దానికంటే ఎక్కువ స్పందననే అందించారు. ఫలితంగా తెలుగులో ఇది వరుసగా సీజన్లను పూర్తి చేసకుంటూ వస్తోంది. ఈ క్రమంలోనే ఇప్పుడు ఆరోది కూడా ప్రారంభం అయింది. దీనికి ఇప్పుడిప్పుడే ఆదరణ క్రమంగా పెరుగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఇందులో స్ట్రాంగ్ కంటెస్టెంట్‌గా ఉన్న రేవంత్.. శ్రీ సత్య, శ్రీహాన్ రిలేషన్‌పై నోరు జారాడు. ఇంతకీ ఏం జరిగింది? ఆ పూర్తి వివరాలు మీకోసం!

తగ్గిన రేటింగ్.. మొత్తం మార్చేసి
ఏమాత్రం ఆశలు, అంచనాలు లేకుండా వచ్చినా బిగ్ బాస్ షో తెలుగులో చాలా సీజన్లను వరుసగా పూర్తి చేసుకోగలిగింది. దీంతో నిర్వహకులు ఇటీవలే ఆరో దాన్ని కూడా మొదలు పెట్టారు. కానీ, ఈ సీజన్‌కు మాత్రం ప్రేక్షకుల నుంచి సరైన రేటింగ్ మాత్రం రావట్లేదు. దీంతో నిర్వహకులు ఇప్పుడు కంటెంట్‌ను మారుస్తున్నారు. తద్వారా ఈ సీజన్‌ను మరింత రంజుగా సాగిస్తున్నారు.

లవ్ ట్రాక్‌లు.. రిలేషన్ ఉందని
బిగ్ బాస్ షో దేశ వ్యాప్తంగా సక్సెస్ అయిందంటే దానికి కారణం అందులో కనిపించే చిత్ర విచిత్రమైన సన్నివేశాలే అని చెప్పొచ్చు. మరీ ముఖ్యంగా ఈ షోలో కంటెస్టెంట్ల మధ్య కనిపించే లవ్ ట్రాకులు మరింత ఎలివేట్ అవుతుంటాయి. వీటికి ప్రేక్షకుల నుంచి రెస్పాన్స్ భారీగా వస్తోంది. అంతేకాదు, ఇద్దరు క్లోజ్‌గా ఉంటే వాళ్ల మధ్య రిలేషన్ ఉందని కూడా టాక్ నడుస్తుంటుంది.

ఆరో సీజన్‌లో జోడీలు ఫెయిల్
ఆరో సీజన్‌లో కూడా కొన్ని జంటలు బాగా హైలైట్ అయ్యాయి. అందులో ముందుగా ఆర్జే సూర్య - ఆరోహి జోడీగా మారి తెగ హల్‌చల్ చేసింది. ఆమె వెళ్లిపోయిన తర్వాత అతడు ఇనాయా సుల్తానాతో ఓ రేంజ్‌లో రొమాన్స్‌ను పండించాడు. మరోవైపు, ఆర్జున్ కల్యాణ్ కూడా శ్రీ సత్య కోసం తెగ ప్రయత్నాలు సాగించాడు. కానీ, ఈ జంటలన్నీ ఫెయిల్ అవడం షోపై ప్రభావం చూపింది.

శ్రీహాన్‌తో కలిసి శ్రీ సత్య ఓవర్‌గా
బిగ్ బాస్ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చిన సమయంలో శ్రీ సత్యకు మంచి పేరు ఉంది. కానీ, క్రమంగా ఆమె ఇమేజ్ డ్యామేజ్ అవుతూనే ఉంది. దీనికి కారణం శ్రీహాన్‌తో కలిసి ఈ బ్యూటీ తెగ ఓవర్ యాక్టింగ్ చేసేస్తోంది. వీళ్లిద్దరూ గొడవలు చేయడం, వెటకారంగా మాట్లాడడం, ఎదుటి వాళ్లను వెక్కిరించడం వంటివి చేస్తోన్నారు. ఫలితంగా వీళ్ల వ్యవహార శైలిపై విమర్శలు వస్తున్నాయి.

కలిసి పడుకుని.. దుప్పటి అని
బిగ్ బాస్ హౌస్‌లో శ్రీహాన్, శ్రీ సత్య నడుచుకుంటోన్న తీరుపై అనుమానాలు కూడా వస్తున్నాయి. దీనికి కారణం వీళ్లిద్దరూ కలిసి ఒకే బెడ్‌పై పడుకోవడంతో పాటు బాగా క్లోజ్ అవుతుండడమే. అంతేకాదు, వాళ్ల క్లోజ్ ఫ్రెండ్ రేవంత్ సైతం ఇటీవలే 'నేను రమ్మంటే ఎందుకు వస్తావ్? శ్రీ సత్య పిలిస్తే దుప్పటి పట్టుకుని వెళ్లిపోతావ్' అని దారుణంగా మాట్లాడి డౌట్లను పెంచేశాడు.

రిలేషన్‌పై రేవంత్ కామెంట్లు
తాజాగా జరిగిన ఎపిసోడ్‌లో రేవంత్ 'శ్రీ సత్య, శ్రీహాన్ వాళ్లిద్దరే మాట్లాడుకుంటూ నన్ను ఆటలో అరటి పండును చేసేస్తున్నారు. అందుకే నేను రాజ్ గాడికి క్లోజ్ అయ్యాను' అంటూ నోరు జారాడు. దీంతో శ్రీహాన్, శ్రీ సత్యకు బాగా కోపం వచ్చేసింది. ఆ సమయంలో వాళ్లిద్దరూ 'మేము క్లోజ్ అని పది మందికి చెప్పి బ్యాడ్ చేస్తున్నావా' అంటూ రేవంత్‌పై గొడవకు దిగారు.

మళ్లీ వచ్చి బుజ్జగించడంతో
ఆ తర్వాత శ్రీ సత్య 'ఇప్పుడేంటి రేవంత్? నేను శ్రీహాన్‌తో మాట్లాడకూడదా' అంటూ రేవంత్‌ను సూటిగా ప్రశ్నించింది. దీనికి శ్రీహాన్ కూడా కోపంగా అతడిపై విరుచుకు పడ్డాడు. దీంతో రేవంత్ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. అయినా వాళ్లిద్దరూ ఆపకుండా ఏదోటి అంటూనే ఉన్నారు. దీంతో రేవంత్ మళ్లీ వచ్చి వాళ్లను బుజ్జగించాడు. దీంతో ఈ గొడవ అప్పటి వరకూ సర్ధుమణిగిపోయింది.


Click it and Unblock the Notifications











