బతికి ప్రాణాలతో తిరిగొచ్చిన రిషి.. గుప్పెడంత మనసు ఫ్యాన్స్ సంబురాలు
ఎన్నాళ్ళో వేచిన ఉదయం ఈరోజే ఎదురయ్యింది అంటూ పాడుకుంటున్నారు గుప్పెడంత మనసు సీరియల్ అభిమానులు. ఎందుకు అని అనుకుంటున్నారా.. రిషి మళ్లీ ఎంట్రీ ఇస్తున్నాడు కాబట్టి. స్టార్ మాలో టాప్ రేటింగ్ సీరియల్స్ లో గుప్పెడంత మనసు ఒకటి. కుమార్ పంతం దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సీరియల్ లో రిషి- వసు జంటకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది అంటే అతిశయోక్తికాదు.
సినిమాలో హీరో హీరోయిన్ కలిస్తే ఎంత సంబరపడతారో.. ఈ సీరియల్ లో ఈ జంట కలిస్తే ఫ్యాన్స్ అంతే సంబురాలు చేసుకుంటారు. అయితే కొన్ని నెలల క్రితం ఈ సీరియల్ లో రిషి- వసుకు పెళ్లి అవుతుంది.. కొన్నిరోజులకే రిషిని శైలేంద్ర చంపేస్తాడు. కానీ, రిషి చనిపోలేదని వసు నమ్ముతుంది. రిషిని తానే తీసుకువస్తానని అందరి ముందు ప్రమాణం చేస్తుంది.

ఇక సీరియల్ విషయం పెడితే రిషి పాత్రలో నటించిన ముకేశ్ గౌడ.. కొన్ని కారణాల వలన సీరియల్ నుంచి తప్పుకున్నాడు. అందుకే ఆ పాత్రను హోల్డ్ లోపెట్టి చనిపోయాడా.. ? బతికి ఉన్నాడా.. ? అనేది కూడా చూపించకుండా డైరెక్టర్ సీరియల్ ను కొనసాగిస్తున్నారు.ఇక రిషిని మర్చిపోవడానికి మనును సీరియల్ లో దింపారు. కానీ, ఫ్యాన్స్ మాత్రం కచ్చితంగా రిషినే కావాలి అని మంకుపట్టు పట్టుకొని కూర్చున్నారు. రిషిని ఎందుకు మధ్యలోనే తొలగించారు.. ఏమైంది.. కనీసం ముకేశ్ అయినా అభిమానులకు సమాధానం చెప్పాలి కదా అని ఫైర్ అయ్యారు.
ఇక ఎప్పుడైతే రిషి సీరియల్ నుంచి తప్పుకున్నాడో అప్పటినుంచి చాలామంది ఈ సీరియల్ ను చూడడానికి ఇష్టపడడం లేదు. అయితే అందుతున్న సమాచారం ప్రకారం ఇందులో డైరెక్టర్, మేకర్స్ తప్పు కూడా ఏమిలేదట. ముకేశ్.. సినిమాలు చేస్తున్న కారణముగా ఆయన ఈ సీరియల్ నుంచి తప్పుకున్నట్లు తెలుస్తోంది. అయితే ముందు ముందు ముకేశ్ రాడు అనుకున్న ఫ్యాన్స్ కు మేకర్స్ ప్రైజ్ ఇచ్చారు.
తాజాగా రిషి గుప్పెడంత మనసు లోకి రీఎంట్రీ ఇచ్చాడు. రిషి గా కాకుండా ఆటో డ్రైవర్ గా కనిపించాడు. ప్రమాదంలో అతనికి గతం గుర్తులేకపోవడంతో కుటుంబం గుర్తులేక ఆటో డ్రైవర్ గా వచ్చినట్లు తెలుస్తోంది. ఇక ఈ ఆటో డ్రైవర్ నురిషిగా వసు ఎలా మార్చింది.. వీరిద్దరి మళ్లీ ప్రేమ చిగురిస్తుందా.. ? అనేది ఇకనుంచి చూడాలి. ఏదిఏమైనా రిషి మళ్లీ రీఎంట్రీ ఇవ్వడంతో అంబిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. మరి ఈసారి రిషి ఎన్నిరోజులు ఉంటాడో చూడాలి


Click it and Unblock the Notifications











