అనసూయ- హైపర్ ఆది, రష్మీ- సుధీర్ రిలేషన్‌.. సీక్రెట్స్ చెప్పేసిన రైజింగ్ రాజు

టెలివిజన్ చరిత్రలో ఓ సరికొత్త అధ్యాయానికి తెరలేపిన షో జబర్దస్త్. నవ్వులే ఈ షో లో స్పెషల్ అట్రాక్షన్. జడ్జ్ స్థానంలో రోజా, నాగబాబు.. యాంకర్ ప్లేస్‌లో అనసూయ, స్కిట్స్ వేసే కంటిస్టెంట్స్ ఇలా ఎవరికీ వారు ప్రత్యేకమే. అందుకే గత కొన్నేళ్లుగా బుల్లితెరపై నవ్వుల హరివిల్లులు కురిపిస్తూ సక్సెస్‌ఫుల్‌గా సాగిపోతోంది జబర్దస్త్ షో. కాగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న జబర్దస్త్ కంటిస్టెంట్ రైజింగ్ రాజు.. అనసూయ, రష్మీ ఇలా అందరిపై ఆసక్తికర కామెంట్స్ చేశాడు. ఆ వివరాలు చూద్దామా..

రష్మీ- సుధీర్ రిలేషన్‌..

రష్మీ- సుధీర్ రిలేషన్‌..

రష్మీ - సుధీర్‌ను యూట్యూబ్ జోడీగా పిలుస్తుంటారు. సామాన్య ప్రజలే కాదు.. చాలా మంది ఫ్రెండ్స్ కూడా వాళ్లను ఇలాగే అంటుంటారు. టీవీ షోలలో కూడా ఇదే తరహా పిలుపుతో ఏడిపిస్తుంటారు. దీనికి కారణం వీళ్లిద్దరిపై యూట్యూబ్‌ చానెళ్లలో వచ్చినన్ని రూమర్లు మరే ఇతర సెలెబ్రిటీలపై కూడా రాకపోవడమే. వీళ్లిద్దరూ ప్రేమలో ఉన్నారని, డేటింగ్ చేసుకుంటున్నారని, పెళ్లి చేసుకోబోతున్నారని.. ఇలా ఎన్నో పుకార్లు షికార్లు చేశాయి.

అనసూయ- హైపర్ ఆది కెమిస్ట్రీ

అనసూయ- హైపర్ ఆది కెమిస్ట్రీ

ఇక జబర్దస్త్ జోడీల్లో మరో పాపులారిటీ ఉన్న జంట అనసూయ- హైపర్ ఆది. యాంకర్ స్థానంలో అనసూయ కూర్చుందంటే చాలు.. ఇక హైపర్ ఆది ఆమె పంచులు మీద పంచులేస్తుంటాడు. అలాగే అనసూయ అందాన్ని తెగ పొగిడేస్తూ రక్తి కట్టిస్తుంటాడు. అందుకే అనసూయ- హైపర్ ఆది జంటను కూడా మరోలా ఊహించుకుంటూ ఉంటారు ఆడియన్స్.

నేరుగా విషయానికి వచ్చిన రైజింగ్ రాజు

నేరుగా విషయానికి వచ్చిన రైజింగ్ రాజు

ఈ నేపథ్యంలో జబర్దస్త్ కమెడియన్ రైజింగ్ రాజు తాజాగా జరిగిన ఇంటర్వ్యూలో నేరుగా విషయానికొచ్చేశాడు. బుల్లితెరపై వైవిధ్యభరితమైన డైలాగ్ డెలివరీతో ఆకట్టుకునే ఆయన ఇంటర్వ్యూలో కూడా కుండబద్దలు కొట్టేస్తూ మాట్లాడాడు. రష్మీ- సుధీర్, అనసూయ- హైపర్ ఆది రిలేషన్‌‌పై నోరు విప్పి విషయాన్ని హాట్ టాపిక్ చేసేశాడు.

అందరూ అనుకుంటారు.. కానీ అసలు విషయం

అందరూ అనుకుంటారు.. కానీ అసలు విషయం

రష్మీ- సుధీర్, అనసూయ- హైపర్ ఆది కెమిస్ట్రీపై అందరూ ఏదో అనుకుంటారు గానీ అలాంటిదేమీ ఉండదని అన్నాడు రైజింగ్ రాజు. స్కిట్స్‌లో భాగంగా ఏదో ఒక చిన్న పంచ్ జనం లోకి వెళ్లిందంటే దాన్నే వాడుకుంటూ ఎక్కువ ఎపిసోడ్స్ ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. అంతే తప్ప అక్కడేమీ ఉండదని చెప్పాడు రైజింగ్ రాజు.

Recommended Video

Jabardast Comedy Show Judges,Team Leaders Remuneration Details || Filmibeat Telugu
అనసూయ నన్ను ఏమని పిలుస్తుందంటే..

అనసూయ నన్ను ఏమని పిలుస్తుందంటే..

జబర్దస్త్ వేదికపై పనిచేసే మా అందరిలో తల్లిదండ్రులు, పిల్లలకు ఉన్న రిలేషన్ షిప్ మాత్రమే ఉంటుందని రైజింగ్ రాజు చెప్పుకొచ్చాడు. అనసూయ తనను బాబాయ్ అని పిలుస్తుందని, అలాగే మిగిలిన కమెడియన్స్‌ని వాళ్ళ వాళ్ళ ఏజ్‌కి తగ్గట్టుగా అన్నయ్య, తమ్ముడు ఇలా పిలుస్తుందని.. అంతే తప్ప వేరే భావన ఉందని రైజింగ్ రాజు తెలిపాడు.

బూతద్దంలో పెట్టి చూస్తే ఎలా.. అసలు సీక్రెట్

బూతద్దంలో పెట్టి చూస్తే ఎలా.. అసలు సీక్రెట్

జబర్దస్త్ వేదికపై ఉన్న తామందరిలో సోదరభావాలు, తల్లిదండ్రుల అనుబంధాలు మాత్రమే ఉంటుంది.. అన్నింటినీ ఇలా బూతద్దంలో పెట్టి చూస్తే ఎలా అని అన్నాడు రైజింగ్ రాజు. మేమంతా ఓ కుటుంబంలా ఉంటామే తప్ప బయట చెప్పుకునేవన్నీ ఉత్తి మాటలే అని అసలు సీక్రెట్ బయటపెట్టేశాడు రైజింగ్ రాజు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X