Hyper adhi నిజ స్వరూపం బయట పెట్టిన రైజింగ్ రాజు.. అందుకే షోలో కనపడలేదట!
బుల్లితెర ప్రేక్షకుల ఎవరికీ హైపర్ ఆది గురించి ప్రత్యేకంగా పరిచయం చేయక్కర లేదు.. తెలుగు సినిమాలు చూసే వాళ్ళందరికీ హైపర్ ఆది సుపరిచితం.. జబర్దస్త్ ద్వారా తెలుగు ప్రేక్షకుల అందరికీ పరిచయమైన ఆది గురించి ఆయన టీం లీడర్ రైజింగ్ రాజు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆది నిజస్వరూపం బయటపెట్టిన ఆయన పలు కీలక విషయాలను వెల్లడించారు. ఆ వివరాల్లోకి వెళితే

షార్ట్ ఫిలిమ్స్ చేస్తూ
చక్కగా చదువుకుని ఉద్యోగం చేసుకుంటున్న హైపర్ ఆది సినిమాల మీద ఆసక్తితో చిన్నగా షార్ట్ ఫిలిమ్స్ చేస్తూ ఉండేవాడు. ఒకరోజు హైపర్ ఆది చేసిన షార్ట్ ఫిలిం అదిరే అభి దృష్టిలో పడటంతో వెంటనే ఫేస్బుక్ వేదికగా తనను వచ్చి ఒకసారి కలవాల్సిందిగా హైపర్ ఆది ని కోరాడు.

టీం లీడర్ స్థాయికి
అదిరే అభి పిలుపునందుకుని వెంటనే అక్కడ వాలిపోయిన హైపర్ ఆది చిన్న చిన్న క్యారెక్టర్లు వేయడం మొదలు పెట్టి టీం లీడర్ స్థాయికి ఎదిగాడు.. అనతికాలంలోనే రైజింగ్ రాజు తో కలిసి కొత్త టీం ఏర్పాటు చేసి జబర్దస్త్ లో మిగతా అన్ని టీములు పోటీ ఇస్తూ వస్తున్నాడు. అయితే హైపర్ ఆది టీం లో రైజింగ్ రాజు పేరు ఉన్నా సరే ఆయన గత ఆరు ఏడు నెలల నుంచి జబర్దస్త్ లో అయితే కనిపించడం లేదు.

పేరు మారలేదు
ఆయన మానేసాడు అనుకోవడానికి కూడా లేదు ఎందుకంటే హైపర్ ఆది టీం పేరు మాత్రం మారలేదు. దీంతో రైజింగ్ రాజు ఆరోగ్యం బాగోలేదు ఏమో అని అందుకే ఆయన బయటకు రావడం లేదని అందరూ అనుమానాలు వ్యక్తం చేశారు..అయితే అసలు తాను ఆరు నెలల పాటు ఎందుకు కనబడలేదు అనే విషయం మీద రైజింగ్ రాజు కీలక వివరాలు వెల్లడించారు.

కరోనా సమయంలోనే
సరిగ్గా కరోనా సమయంలోనే తనకు మనవరాలు పుట్టిందని అది చాలా సెన్సిటివ్ పరిస్థితి కావడంతో నేను బయటకు వచ్చి అటు ఇటు తిరిగి ఇంటికి వెళ్ళాక పాపకు ఏమైనా అంటుకుంటే ఎలా అనే భయంతో బయటకు రావడం మానేసి ఇంట్లోనే ఉండిపోయా అని ఆయన చెప్పుకొచ్చాడు.

వెళ్ళకున్నా పేమెంట్
అయితే నేను బయటకు వెళ్లకుండా ఉన్న ఈ ఆరు నెలల సమయానికి కూడా ప్రతి నెలా నా పేమెంట్ బ్యాంక్ అకౌంట్ లో ఆది వేసేవాడిని, చిన్న వాడు అయిపోయాడు కానీ లేకపోతే ఆది కాళ్ళు మొక్కాలి అంటూ రైజింగ్ రాజు ఎమోషనల్ అయ్యాడు. అయితే హైపర్ ఆది గొప్పతనాన్ని రైజింగ్ రాజు మాత్రమే కాదు గతంలో పరదేశి అలాగే దొరబాబు భార్య కూడా బయట పెట్టారు..
Recommended Video

ఏమైపోయేవాళ్ళమో?
పరదేశి, దొరబాబు ఇద్దరూ కూడా వ్యభిచారం కేసులో వైజాగ్ లో చిక్కుకున్నప్పుడు ఆది అన్నీ తానై వ్యవహరించి పోలీసు కేసులు కూడా భర్తించి వాళ్లను బయటకు తీసుకు వచ్చాడట.. అక్కడ జరిగింది ఏంటో తెలియదు కానీ వాళ్ళు వ్యభిచారం కేసులోనే పట్టుబడ్డారు అంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఆ సమయంలో ఆది లేకుండా ఉంటే ఏమై పోయే వాళ్ళమో అని దొరబాబు భార్య గతంలో వెల్లడించింది.


Click it and Unblock the Notifications











