పెద్దోళ్లతో గడిపితేనే.. ఆ నటుడి రూమ్‌కి ఒక్కదాన్నే .. రీతూ చౌదరి షాకింగ్ కామెంట్స్
భారతీయ చిత్ర పరిశ్రమతో పాటు టెలివిజన్ రంగంలో క్యాస్టింగ్ కౌచ్ మహమ్మారికి చిక్కి ఎందరో ఆడపిల్లల జీవితాలు నాశనమయ్యాయి. అవకాశాల పేరుతో అమ్మాయల్ని ట్రాప్ చేసి కోరికలు తీర్చుకుని వదిలేస్తున్నారు కొందరు. ఇలాంటి వారి చేతికి చిక్కి ఎందరో ప్రతిభావంతులైన నటీమణులు అడ్రస్ లేకుండా పోతున్నారు. ఇండస్ట్రీలోని ఈ చీకటి బాగోతాలపై కొందరు సైలెంట్‌గా ఉంటే, మరికొందరు మాత్రం బయటపెడుతున్నారు. తాజాగా బుల్లితెర నటి , జబర్దస్త్ ఫేమ్ రీతూ చౌదరి తన జీవితంలో జరిగిన ఘటనను బయటపెట్టింది.
సోషల్ మీడియా, బుల్లితెర ద్వారా ఫేమస్ అయినవారిలో రీతూ చౌదరి ఒకరు. షార్ట్ గ్యాప్‌లోన యూత్‌లో మంచి ఫేమ్ సంపాదించిన రీతూ ఓ వైపు సీరియల్స్, మరోవైపు షోలతో దున్నేస్తోంది. షార్ట్ ఫిల్మ్స్, సీరియల్స్ ద్వారా పరిచయమైన రీతూ చౌదరి కెరీర్‌ను జబర్దస్త్ కార్యక్రమం మలుపు తిప్పింది. హైపర్ ఆదితో పాటు పలు టీమ్స్‌లోనూ మెంబర్‌గా నవ్వించింది. ఈటీవీతో పాటు ఇతర టాప్ ఛానెల్స్‌లోనూ అవకాశాలు దక్కించుకుంది. వీటితో పాటు హాట్ హాట్ ఫోటో షూట్స్‌తో యూత్‌ని ఫిదా చేసి మరింత పాపులారిటీ సంపాదించుకుంది.

కొద్దినెలల క్రితం రీతూ చౌదరి పేరు ఏపీ రాజకీయాల్లో చక్కర్లు కొట్టడం కలకలం రేపింది. రూ.700 కోట్ల భూ కుంభకోణం వెలుగు చూడటం అందులో రీతూతో పాటు ఆమె భర్త శ్రీకాంత్ పేర్లు తెరపైకి వచ్చాయి. అయితే తాము పెళ్లయిన కొద్దిరోజులకే విడిపోయినట్లు చెప్పింది రీతూ. ఇటీవల ఓ ఛానెల్‌కు ఇంటర్వ్యూలో తన కెరీర్, వ్యక్తిగత జీవితంపై కీలక వ్యాఖ్యలు చేసింది. చిన్నప్పటి నుంచి తనకు సినిమాలంటే పిచ్చి అని చెప్పింది. ఫేస్‌బుక్ ద్వారా డైరెక్టర్లు, ఇతర ఇండస్ట్రీ వ్యక్తులకు పర్సనల్‌గా మెసేజ్‌లు చేసి అవకాశాల కోసం ప్రయత్నించినట్లు చెప్పింది.
ఖమ్మంలో పదో తరగతి చదువుతున్నప్పుడే తనకు ఓ సీరియల్‌లో అవకాశం ఉందని ఆడిషన్ కోసం హైదరాబాద్‌కు రమ్మని కబురు వచ్చిందనట. దీంతో తన తండ్రిని తీసుకుని హైదరాబాద్ వెళ్లిన రీతూతో ఆడిషన్ ముగిసిన తర్వాత మేనేజర్ కలిశాడట. బంజారాహిల్స్ దగ్గర ఓ ప్లేస్ చెప్పి ఒక్కదానివే రమ్మని చెప్పాడని.. నీ జీవితం ఇలా ఉంటని, ఇలాంటి డ్రెస్‌లు వేసుకోవాలని అన్నాడని రీతూ చెప్పింది. ఒక ఫేమస్ నటుడి పేరు చెప్పి ఆయనని కలవాలని , అలా ఉంటేనే మీకు ఛాన్స్ వస్తుందని చెప్పారని ఆమె బయటపెట్టింది.
చిన్నప్పుడు నేను సీరియల్‌లో చూసిన వ్యక్తి అని .. ఆయనతో అలా ఉండాలా? ఆయన ఇలాంటోడా? అని తెలిసి షాక్ అయ్యానని రీతూ చౌదరి తెలిపింది. తన కెరీర్ మొదలయ్యాక ఆ నటుడితోనే కలిసి నటించానని, దీని గురించి ఆయనని అడగాలని అనుకున్నానని కానీ అడగలేదని ఆమె వెల్లడించింది. ఈ సంఘటన తర్వాత తనకు మరోసారి ఇలాంటి పరిస్ధితి ఎదురుకాలేదని రీతూ చౌదరి స్పష్టం చేసింది.
తనకు ఫ్రెండ్‌లా, గైడ్‌లా ఉన్న నాన్న ఇప్పుడు లేకపోవడం జీవితంలో తీరని లోటని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. నాన్నని నేను ఒరేయ్ అని పిలుస్తానని.. షూటింగ్ ఉదంటే ఉదయాన్నే లేచి నా కోసం ఫుడ్, జ్యూస్ తయారు చేసి ఇచ్చేవారని రీతూ పేర్కొంది. నాన్నతో కలిసి మందు కొట్టానని.. నేను ఇలా ఉండాలి? అలా ఉండాలి? అని నాన్న ఎప్పుడూ రిస్ట్రిక్షన్స్ పెట్టలేదని ఆమె గుర్తుచేసుకుంది. ప్రస్తుతం రీతూ చౌదరి వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


Click it and Unblock the Notifications











