నీ కూతురు అలాంటిది అంటూ.... అమ్మతో ఆ ఆర్టిస్ట్‌లు దారుణంగా.. రీతూ చౌదరి

ఈటీవీలో ప్రసారమయ్యే జబర్దస్త్ షో ద్వారా తెలుగు వారికి బాగా దగ్గరయ్యారు రీతూ చౌదరి. హైపర్ ఆది సహా పలువురు టీమ్ లీడర్స్ కింద చేస్తూ పాపులారిటీ సంపాదించారు. అయితే పలువురు స్టార్ కమెడియన్స్ షోను వదిలి వెళ్లిపోవడంతో రీతూ కెరీర్ డైలమాలో పడింది. దాంతో వేరే షోలు, కార్యక్రమాలు, ప్రైవేట్ ఈవెంట్స్‌పై ఫోకస్ పెట్టి కెరీర్‌ను విజయవంతంగా నడిపిస్తున్నారు. ఈ దశలో బిగ్‌బాస్ తెలుగు 9లో కంటెస్టెంట్‌గా అవకాశం దక్కించుకున్నారు రీతూ చౌదరి. ఈ షో తర్వాత రీతూ కొత్తగా తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైంది. ఈ నేపథ్యంలో జబర్దస్త్ వర్ష నిర్వహిస్తోన్న కిస్సిక్ టాక్స్ కార్యక్రమానికి హాజరైన రీతూ చౌదరి తన కెరీర్, బిగ్‌బాస్ అనుభవాలు, ప్రేమ, బ్రేకప్ తదితర కీలక విషయాలను పంచుకున్నారు.

సోషల్ మీడియాలో బాడ్ కామెంట్స్ పెట్టేవాళ్లకి మనం ఏం చేయలేం... వాళ్లు పెట్టడానికి పెట్టేస్తారు, కానీ చదివిన వాళ్లు హార్ట్‌కు తీసుకుని చాలా అంటే చాలా ఫీల్ అవుతారు, దయచేసి బాడ్ కామెంట్స్ పెట్టకండి. మమ్మల్ని చూసే విధానం కొంచెం మారితే బెటర్‌గా ఉంటుంది. సోషల్ మీడియాతో ప్లస్ ఉంది, మైనస్ ఉంది. ఒక ఫోన్‌లో నువ్వు ప్రపంచంలో ఏం జరుగుతుందో చూడొచ్చు.. ఇలా ఎన్నో ప్లస్‌లు ఉన్నాయి. చాలామంది ఇన్‌‌ఫ్లూయెన్సర్లుగా మారి సంపాదిస్తున్నారు. ఎంటర్‌టైన్‌మెంట్ కూడా ఉంటుంది, ఉదయం లేచిన దగ్గరి నుంచి రీల్స్ కూడా చూడొచ్చు. కానీ ఇష్టం వచ్చినట్లు బ్యాడ్‌ కామెంట్స్ పెట్టొచ్చు. బయట ఎక్కడైనా కనిపిస్తే రీతక్క... రీతక్క అని పిలిచి నీకు నేను పెద్ద ఫ్యాన్ అక్క అంటాడు. వీడే కామెంట్ పెడతాడు. వాళ్లకు అనిపిస్తేనే వాళ్లు మారతారు.. మనం మారాలని చెబితే మారరు అంటూ రీతూ చౌదరి షాకింగ్ కామెంట్స్ చేశారు.

Rithu Chowdary Alleges Character Assassination During Bigg Boss Voting Controversy

సోషల్ మీడియా ద్వారా నాకు మంచి తమ్ముడు దొరికాడు. నేను ఇంటిగుట్టు అనే సీరియల్ చేస్తుండగా ఆ సీరియల్ నుంచి నేనంటే ఆ ఫ్యామిలీలో ఇష్టం. అతని పేరు సాయి.. తిరుపతి దగ్గర అతని ఊరు. తిరుపతికి వెళ్లినట్లు స్టోరీ పెట్టగానే.. ఎయిర్‌పోర్ట్‌కి వెళ్లినప్పటి దగ్గరి నుంచి కాల్స్ వస్తూనే ఉన్నాయి. ఎవర్రా బాబు ఇన్నిసార్లు ఫోన్ చేస్తున్నారని చూస్తే.. నేను ఎయిర్‌పోర్ట్‌లోనే ఉన్నాను అక్కా.. అతని చేతిపై రీతూ అక్క అనే టాటూ ఉంది. నా గురించి ప్రతి విషయం చెబుతున్నాడు. అతను నా జీవితంలోకి రావడం లక్కీ. ఇప్పటికీ ఒక బ్రదర్‌లా నాకు సపోర్ట్ చేస్తున్నాడు. నాకు ఏం కావాలన్నా.. ఎలా ఉన్నా నన్ను చూసుకుంటూ ఉంటాడు అని రీతూ చెప్పింది.

పెళ్లయిన తర్వాత భర్త ఎలా ఉండాలి అని రీతూ చౌదరి చెప్పింది. లుక్స్ పెద్ద మేటర్ కాదు, ఫస్ట్ చాలా అర్ధం చేసుకోవాలి. డబ్బు లేకపోయినా పర్లేదు కానీ, నన్ను మంచిగా చూసుకుని నన్ను అర్ధం చేసుకోవాలి. ఇద్దరు మనుషులు కూర్చొని మాట్లాడుకునేంత ఫ్రీడమ్ ఇద్దరికీ ఉండాలి. నా తప్పు ఉన్నా.. వాళ్లదని ఏమైనా తప్పు ఉన్నా నా మీద పడి అరవకుండా ఫస్ట్ కూర్చొని మాట్లాడాలి. ఓపిక కూడా ఉండాలి. నేను చాలా హైపర్‌గా ఉంటాను కాబట్టి... ఇద్దరం వర్కింగే ఉండాలి, నువ్వు పనిచేయి నేను తిని కూర్చొంటానని చెప్పే రకం కాదు. ఇద్దరం ఇండిపెండెంట్‌గా ఉందామని చెబుతా.. అమ్మని, అన్నయ్యని బాగా చూసుకోవాలి. అలాగని బిజినెస్‌మెన్‌లు వద్దు... డబ్బులు తప్పించి ప్రేమలు, అభిమానాలు ఉండవు. ప్రతి అమ్మాయికి రెస్పెక్ట్ ఇవ్వాలి అని రీతూ చౌదరి చెప్పింది.

బిగ్‌బాస్‌లో నేను టాప్ 5లో ఉంటానని అనుకున్నాను. కానీ నా బ్రెయిన్, హార్ట్ కూడా బలంగా ఇదే చెప్పింది. మనం వచ్చాం.. ఎంజాయ్ చేశాం. బిగ్‌బాస్ హౌస్‌కి వెళ్లాలి అనే మా అమ్మనాన్నల కోరిక నెరవేరింది. 5లో ఉన్నా, 4లో ఉన్నా హ్యాపీయే. ఇమ్మూ, తనూజ, పవన్‌లలో ఎవరో ఒకరు బిగ్‌బాస్ విన్నర్ అయ్యుంటే బాగుండు అనుకున్నాను. బిగ్‌బాస్‌లో ఉన్నప్పుడు బయట నా గురించి చాలా వ్యతిరేకంగా వార్తలు రావడం, దుష్ప్రచారం జరగడంతో మా అమ్మ చాలా బాధపడింది. నేను ఎలిమినేట్ అయితే బాగుండు అనుకుంది. నాకు ఆర్టిస్ట్‌లు కూడా ఎవ్వరూ నాకు సపోర్ట్ చేయలేదు. మా మమ్మీ నాకు ఓటు వేయండి అని వాళ్లకి ఫోన్ చేస్తే చాలామంది ఫోన్ లిఫ్ట్ చేయలేదు, చాలామంది ఆ అమ్మాయి క్యారెక్టర్ బ్యాడ్ అని వస్తుంది. మేం ఓటు వేయ్యమని నానామాటలు అన్నారట. అంత నన్ను బ్యాడ్ చేస్తున్నా కూడా.. ప్రతి వారం నామినేషన్స్‌లో నేను సేవ్ అవుతూనే వచ్చా, ప్రేక్షకులు నన్ను నమ్మారు. నన్ను ఎంత బ్యాడ్ చేసినా జనాలు నన్ను ప్రేమించారు. బయటకు వచ్చిన తర్వాత ఇదంతా చూసి గర్వంగా ఫీల్ అయ్యానని రీతూ చౌదరి పేర్కొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X